Wednesday, January 31, 2018

కాశీపట్నం చూడర బాబు

చిత్రం :  వాగ్ధానం (1961)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల 

పల్లవి :

ఓహో నిలబడితే పడిపోయే నీరసపు నీడవంటి బీదవాడా
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
మనిషిగా బ్రతికేందుకు కనీస అవసరాలైనా లేనివాడా

అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో!

కాశీపట్నం చూడర బాబు..  కల్లాకపటం లేని గరీబు
కాశీపట్నం చూడర బాబు..  కల్లాకపటం లేని గరీబు
అల్లో లక్షణ అని అల్లాడే..  పల్లెల దుస్థితికేమి జవాబు
అల్లో లక్షణ అని అల్లాడే.. పల్లెల దుస్థితికేమి జవాబు
కాశీపట్నం చూడర బాబు..  కల్లాకపటం లేని గరీబు 

చరణం 1 :

నిరాశతోను నిస్పృహలోను...  తెరువెరుగని నిరుపేదలు
మురికి గుంటలు ఇరుకు కొంపలు నిండిన చీకటి పేటలు
పాడు రోగాలు మోసుకు తిరిగి...  ప్రజలను చంపే ఈగలు
కరువు బరువు పరితాపాలు...  కలిసి వెరసి మన పల్లెలు

కాశీపట్నం చూడర బాబు..  కల్లా కపటం లేని గరీబు
కాశీపట్నం చూడర బాబు..  కల్లా కపటం లేని గరీబు

చరణం 2 :

శరీరాల్లో అరచాటాకైనా రక్తం లేని దరిద్రులనే
పీల్చుకు తింటాడు దోమరాక్షసుడు...
వాడి దుంప తెగ
మేడల్లో మిద్దెల్లో నివసించే వారి జోలికైనా పోడు గదా
అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో!

వైద్య సహాయం అసలే లేదు ఉన్నా దొరకవు మందులు
డాక్టర్ కోసం వెతికే లోగా...  రోగులు గుటుక్కుమందురు
నెత్తురు పీల్చే వృత్తి పరులే మన గ్రామాలకు కామందులు
దొరలూ దోమలు పల్లె జనాలను పంచుకు నంచుకు తిందురు

కాశీపట్నం..హోయ్ హోయ్
కాశీపట్నం చూడర బాబు...  కల్లాకపటం లేని గరీబు
కాశీపట్నం చూడర బాబు...  కల్లాకపటం లేని గరీబు

చరణం 3 :

ప్రజలతో సమానంగా కష్టసుఖాలను పంచుకుంటామంటారు మన వినాయకులు
అవునవును
సుఖాలన్నీ తమకు దక్కించుకుని కష్టాలన్నీ మనకు వదిలేస్తారు
ఊ.. ఊ.. ఊ..అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో!

ఎవరో వచ్చి సాయం చేస్తారనుకోవడమే పొరపాటు
పదవులు వస్తే ప్రజను మరవడం బడా నాయకుల అలవాటు
మనలో శక్తి మనకే తెలియదు అదే కదా మన గ్రహపాటు
తెలిసి కలిసి నిలిచిన నాడు ఎదుటివాడికది తలపోటు

కాశీపట్నం..ఓ హోయ్
కాశీపట్నం చూడర బాబు..  కల్లాకపటం లేని గరీబు
కాశీపట్నం చూడర బాబు..  కల్లాకపటం లేని గరీబు
అల్లో లక్షణ అని అల్లాడే పల్లెల దుస్థితికేమి జవాబు
కాశీపట్నం చూడర బాబు..  కల్లాకపటం లేని గరీబు
కాశీపట్నం చూడర బాబు..  కల్లాకపటం లేని గరీబు

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1606

No comments:

Post a Comment