Thursday, March 1, 2018

కరిగించు ఈ కలికి హృదయం

చిత్రం :  సన్నాయి అప్పన్న (1980)

సంగీతం :  జి.కె. వెంకటేశ్

గీతరచయిత :  దేవులపల్లి కృష్ణశాస్త్రి

నేపథ్య గానం :  జానకి 


పల్లవి :


కరిగించు ఈ కలికి హృదయం

కరిగించు ఈ కలికి హృదయం

కదిలించు నా కాలి గజ్జల కడియం 

కరిగించు ఈ కలికి హృదయం

కదిలించు నా కాలి గజ్జల కడియం 

కరిగించు ఈ కలికి హృదయం


చరణం 1 :


వినిపించు నాలో...   

వినిపించు నాలో...  ఏదో వింత సన్నాయి

అనిపించు ఈ రేయి... అనుకోని హాయి

మనసున... ఒదిగిన...

 మనసున ఒదిగిన మమతలెల్ల మధు ధారలై పొరల


కరిగించు ఈ కలికి హృదయం

కదిలించు నా కాలి గజ్జల కడియం 

కరిగించు ఈ కలికి హృదయం


చరణం 2 : 


నేనే నీవైపోయి...  నీవే నేనైపోయి

సన్నాయిపై వేళ్ళు నాట్యాలు చేయాలి

నేనే నీవైపోయి...  నీవే నేనైపోయి

సన్నాయిపై వేళ్ళు నాట్యాలు చేయాలి

సరిగజ్జే మువ్వలు రాగాలు పాడాలి

గలగలలు సరిగమలు

గలగలలు సరిగమలు కలిసిపోయి సెలయేరువై పొంగ

గలగలలు సరిగమలు కలిసిపోయి సెలయేరువై పొంగ


కరిగించు ఈ కలికి హృదయం

కదిలించు నా కాలి గజ్జల కడియం 

కరిగించు ఈ కలికి హృదయం

No comments:

Post a Comment