Saturday, March 24, 2018

నీ సిగ్గే సింగారమే

చిత్రం :  భాగ్యరేఖ (1957)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  దేవులపల్లి
నేపధ్య గానం :  ఏ. ఎం. రాజా 



పల్లవి :


నీ సిగ్గే సింగారమే... నీ సొగసే బంగారమే
నీ సిగ్గే సింగారమే... ఓ చెలియా... నీ సొగసే బంగారమే
కనులారా గని మెచ్చేనే.... ఓ వనలక్ష్మి
మనసిచ్చి దిగివచ్చెనే... ఉహు హు ఉహు హు



చరణం 1 :



ఓ... ఓ...  ఓ... ఓ... ఓ...  ఓ
నీ నవ్వు పూలు...  అవే మాకు చాలు
నీ వయ్యారాలు...  అవే వేనవేలు
ఓ పేదరాలా... మరే పూజలేల
మా పైన నీ దయ చూపవా ఓ నా చెలి


నీ సిగ్గే సింగారమే.. ఓ చెలియా... నీ సొగసే బంగారమే
నీ సిగ్గే సింగారమే



చరణం 2 :



ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ
మా తోట పూచె వసంతమ్ము నీవే
మా బాట చూపే ప్రభాతమ్ము నీవే
మాలోన కొలువైన మహలక్ష్మి నీవే
మా పైన నీ దయ చూపవా ఓ నా చెలి



నీ సిగ్గే సింగారమే... ఓ చెలియా... నీ సొగసే బంగారమే
కనులారా గని మెచ్చేనే... ఓ వనలక్ష్మి
మనసిచ్చి దిగివచ్చెనే... ఉహు హు ఉహు హు





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18490

No comments:

Post a Comment