Friday, March 23, 2018

ఒకసారి ఆగుమా

చిత్రం : బండరాముడు (1959)
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల  



పల్లవి :



సాగిపోయే...  ఓ చందమామా...  ఆ... ఆ
ఆగుమా...ఆ... ఆ... 
ఒకసారి ఆగుమా... 



ఒకసారి ఆగుమా...  ఓ చందమామా
మనసార నా మాట ఆలించిపొమ్మా
ఒకసారి ఆగుమా...  ఓ చందమామా
మనసార నా మాట ఆలించిపొమ్మా
ఒకసారి ఆగుమా...  ఓ చందమామా 



చరణం 1 :



నీలి మబ్బుల తెర చాటు మాటున... మాటి మాటికి ఇటు దాగనేల...
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..
నీలి మబ్బుల తెర చాటు మాటున... మాటి మాటికి ఇటు దాగనేల
యెందుకో కనలేవు సూటిగ
యెందుకో కనలేవు సూటిగ....  యెదలోన నీవైన శోధించుకొమ్మా


ఒకసారి ఆగుమా...  ఓ చందమామా
మనసార నా మాట ఆలించిపొమ్మా
ఒకసారి ఆగుమా...  ఓ చందమామా



చరణం 2 :



పరుల సొమ్మును హరియించు వాడే... పగటి పూటను ఇలు వీడలేడోయ్
ఓ..ఓ..ఓ...
పరుల సొమ్మును హరియించు వాడే... పగటి పూటను ఇలు వీడలేడోయ్
మంచి గా మనవోయి జాబిలి
మంచి గా మనవోయి జాబిలి... మలినమ్ము లికనైన తొలగించుకొమ్మా 


ఒక సారి ఆగుమా..
ఒకసారి ఆగుమా...  ఓ చందమామా
మనసార నా మాట ఆలించిపొమ్మా


మారేన నీ మనసు...  ఓ చందమామా
మారేన నీ మనసు...  ఓ చందమామా
ఓ చందమామా...  ఓ చందమామా






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18458

No comments:

Post a Comment