Monday, June 11, 2018

ఏ తల్లి నిను కన్నదో

చిత్రం : దాన వీర శూర కర్ణ (1977)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : సుశీల  



పల్లవి : 


ఏ తల్లి నిను కన్నదో... నేను నీ తల్లినైనానురా.. ఆ.. ఆ.. 

నీ తల్లినైనానురా... 

నా వరాల తొలిపంటగా... ఆ.. ఆ.. ఆ..
నా వరాల తొలిపంటగా... నీవు నా ఇంట వెలిశావురా
నా ఇంట వెలిశావురా ... 


ఏ తల్లి నిను కన్నదో... నేను నీ తల్లినైనానురా.. ఆ.. ఆ..
నీ తల్లినైనానురా... 



చరణం 1 : 


లలితలలితజల లహరుల ఊయలలూగినావు... అలనాడే
తరుణతరుణ రవి కిరణ పథంబుల... సాగినావు తొలినాడే


అజస్త్ర సహస్ర నిజ ప్రభలతో అజేయుడవు కావలెరా...
నీ శౌర్యము గని వీర కర్ణుడని...
నీ శౌర్యము గని వీర కర్ణుడని...  నిఖిల జగంబులు వినుతించవలెరా




చరణం 2 :



మచ్చ ఎరుంగని శీల సంపదకు స్వచ్ఛమైన  ప్రతిరూపమై
బలిశిబిదధీచి వదాన్యవరులను తలదన్ను మహాదాతవై...


అడిగినదానికి లేదన్నది ఏనాడు నీ నోట రానిదై...
నీ నామము విని దాన కర్ణుడని...
నీ నామము విని దాన కర్ణుడని... యుగయుగాలు నిను స్మరియించవలెరా






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6635

7 comments:

  1. dear sir very good blog and very good contnet
    Telugu News

    ReplyDelete
  2. Ento chakkani saahityam,samgeetamto marugunapadina manchi aanimutyam ee paata.suseelamma gaatramlo maadhuryam amongham.

    ReplyDelete
    Replies
    1. అవునండి. సినారె పదప్రయోగం ఎంత బాగుందో," అజస్త్ర సహస్ర నిజ ప్రభలతో అజేయుడవు కావెలెరా " అన్న మాట ఒక్క ఫేస్ లో పాడిన సుశీల గారు కూడా అద్భుతంగా పాడారు! ఇరువురూ మహానుభావులే!
      thanks anDi

      Delete
  3. I am very happy on seeing lyrics here. thank you very much🙏🙏

    ReplyDelete
  4. వదాన్యవరులు అని అన్నారు కదా ఎవరు వారు? చెప్పగలరు

    ReplyDelete