Tuesday, July 3, 2018

ఇదో రకం దాహం

చిత్రం :  గజదొంగ (1981)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం :  బాలు, జానకి




పల్లవి :


ఇదో రకం దాహం... అదో రకం తాపం
కటకటాలలో..ఓ.. చలిరాత్రి..హా.. హా
ఇది కనివిని ఎరుగని తొలిరాత్రి..హా..హా..హా..ఆ


ఇదో రకం దాహం... అదో రకం తాపం
కటకటాలలో..ఓ.. చలిరాత్రి..హా..హా..
ఇది కనివిని ఎరుగని తొలిరాత్రి..హా..హా..హా..



చరణం 1 :


అర్రెర్రే..ఏ.. కరెంట్ పోయిందే..
ఆ..అమ్మో..నాకు భయమేస్తుంది..
హ..హ..హ.. ఏం భయంలేదు నాదగ్గరగా రా
ఎక్కడ..?.. ఇక్కడే..
హు...ఎక్కడ...? ఇటూ..ఇటూ..అ..అ..అదీ..సుజా..ఆ
ఊహ..సుజా... మై డార్లింగ్..మూ....సుజా..ఆ



మసకలోనే మనసుతీరా అల్లుకుంటున్నా..ఆ
ఇరుకులోనే వలపుతీరా ఇల్లు కడుతున్నా..ఆ
ఏదో తెలియని దప్పిక... తీరీతీరని కోరిక..


ఏదో తెలియని దప్పిక..తీరీతీరని కోరిక..
నరనరాలలో..ఓ..ఓ నస..నసగా..
నాలో..నీలో గుస గుసగా..
గుండె గుప్పెడయిపోతుంటే... గుట్టు చప్పుడయిపోతుంటే..
దాహం..తాపం..దాహం..తాపం..దాహం..తాపం..హా..


ఇదో రకం దాహం... అదో రకం తాపం



చరణం 2 :



ఇదిగో..ఇదిగో...ఏవి..ఏవిటయ్యా
అరగంట నుండి చూస్తున్నా..
ఇది జైలు అనుకున్నారా... మీ ఇల్లు అనుకున్నారా...ఆ?
చూడలేక చస్తున్నాను వెధవది..


హ..హ..
చూడలేక చస్తున్నాడంట హ..హ పాపం..
అయితే ఓ పని చేద్దాం...


మళ్ళీ ఏమిటది..ఏమిటది శబ్ధం..?
దోమలయ్యా బాబు చచ్చిపోతున్నాం..చంపలేక..
హ..హ..హ..హ..హ..హ..హ..


పెదవి తాకి పెదవి దాహం పెరిగిపోతున్నా..
జరగనున్నది జాము రాతిరి జరిగిపోతున్నా...
కన్నుల కరిగే కాటుక... వెన్నెల విందుల కానుక..



కౌగిలింతలో... కసికసిగా...
కరుగుతూ వుంటే... గజిబిజిగా..
ఇద్దరొక్కటయిపోతుంటే... ఒక్కరిద్దరయి ముద్దంటే..
దాహం..తాపం..దాహం..తాపం..దాహం..తాపం..హా..





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=850

No comments:

Post a Comment