Wednesday, July 11, 2018

గాలికి కులమేది

చిత్రం : కర్ణ (1963)
సంగీతం : విశ్వనాథన్- రామ్మూర్తి
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : సుశీల 




పల్లవి : 



గాలికి కులమేది?
గాలికి కులమేది?
ఏదీ... నేలకు కులమేది
గాలికి కులమేది?
ఏదీ నేలకు కులమేది
గాలికి కులమేది?
మింటికి మరుగేది ఏదీ.... ఈ... ఈ.
మింటికి మరుగేదీ... ఏదీ కాంతికి నెలవేదీ..


గాలికి కులమేది?
ఏదీ నేలకు కులమేదీ..ఈ..
గాలికి కులమేది?  



చరణం 1 :  



పాలకు ఒకటే...ఏ..ఏ...ఆ... ఆ...ఆ..
పాలకు ఒకటే తెలివర్ణం
ఏదీ ప్రతిభకు కలదా స్థలభేదం
వీరుల కెందుకు కులభేదం
అది మనసుల చీల్చెడు మతభేదం


గాలికి కులమేది?
ఏదీ నేలకు కులమేదీ..ఈ..
గాలికి కులమేదీ..ఈ... 



చరణం 2 : 


జగమున యశమే..ఏ... ఏ...
జగమున యశమే మిగులునులే
అది యుగములకైనా చెదరదులే
దైవం నీలో నిలుచునులే
ధర్మం నీతో నడచునులే
ధర్మం నీతో నడచునులే


గాలికి కులమేది?
ఏదీ నేలకు కులమేదీ..ఈ..
గాలికి కులమేది?




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=67

1 comment:

  1. Nice song

    https://vega2020.com/viewenlistedgadgetapps/tollywood-telugu-video-songs-smartphone-mobile-apps/

    ReplyDelete