Thursday, August 9, 2018

చెడు అనవద్దు

చిత్రం  :  మేలుకొలుపు (1978)
సంగీతం  :  మాస్టర్ వేణు
గీతరచయిత  :  సినారె
నేపథ్య గానం  :  జానకి  

పల్లవి :

దారి తప్పిన బాలల్లారా... దగా పడిన యువకుల్లారా
చెడు అనవద్దు... చెడు వినవద్దు... చెడు కనవద్దు
ఇది బాపూజీ పిలుపు... ఇదే మేలుకొలుపు... ఇదే మేలుకొలుపు 

చరణం 1 : 

ఇంటిని కాల్చే మంటల్లాగా ఎందుకు బ్రతకాలి?
ఆ ఇంటికి చల్లని జ్యోతుల్లాగా ఎపుడూ వెలగాలి

మానవతయే మన దైవం... మంచితనమే మన ధర్మం
మానవతయే మన దైవం... మంచితనమే మన ధర్మం

చెడు అనవద్దు... చెడు వినవద్దు... చెడు కనవద్దు
ఇది బాపూజీ పిలుపు... ఇదే మేలుకొలుపు... ఇదే మేలుకొలుపు  

చరణం 2 :

చక్కని  తెలివి విషమించిందా రక్కసులౌతారు
చక్కని  తెలివి విషమించిందా రక్కసులౌతారు

అది మంచిదారిలో మలచుకొంటిరా మహాత్ములౌతారు
మహాత్ములౌతారు..
పరోపకారం పరమగుణం... పరమగుణం
సహనం మన ఆభరణం... ఆభరణం.. 

చెడు అనవద్దు... చెడు వినవద్దు... చెడు కనవద్దు
ఇది బాపూజీ పిలుపు... ఇదే మేలుకొలుపు... ఇదే మేలుకొలుపు  

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8715

No comments:

Post a Comment