Monday, August 20, 2018

రాగాలు మేళవింప

చిత్రం :  పాండవ వనవాసం (1965)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  సముద్రాల (సీనియర్)
నేపథ్య గానం :  ఘంటసాల, సుశీల



పల్లవి :


ఓ...ఓ...
రాగాలు మేళవింప... ఆహా
హృదయాలు పరవశింప... ఓహొ
ఆడేము మధుర సీమ... తనిసేము అమరప్రేమ


రాగాల మేళవింప... ఆహా
హృదయాలు పరవశింప... ఓహొ
ఆడేము మధురసీమ... తనిసేము అమరప్రేమ



చరణం 1 :



మురిపించు మల్లె శరమౌచు నీదు... ఉరమందు విరిసిపోయెనా
మురిపించు మల్లె శరమౌచు నీదు... ఉరమందు విరిసిపోయెనా
విరితేనెలాను మధుపమ్మువోలె... నే మేను మరచి పోయేనా


రాగాలు మేళవింప... హృదయాలు పరవశింప
ఆడేము మధురసీమ... తనిసేము అమరప్రేమ



చరణం 2 : 



ఆనంద మొలక నా డెందమందు... నిను దాచుకొందునోబాలా
ఆనంద మొలక నా డెందమందు... నిను దాచుకొందునోబాలా
నాకన్నుదోయి నీరూపె నిలిపె... పూజించుకొందు బావా


రాగాలు మేళవింప... హృదయాలు పరవశింప
ఆడేము మధురసీమ... తనిసేము అమరప్రేమ


రాగాలు మేళవింప... హృదయాలు పరవశింప
ఆడేము మధురసీమ... తనిసేము అమరప్రేమ




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18330

No comments:

Post a Comment