Monday, August 20, 2018

బావా బావా పన్నీరు

చిత్రం :  పాండవ వనవాసం (1965)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  సముద్రాల (జూనియర్)
నేపథ్య గానం :  సుశీల



పల్లవి :


బావా బావా పన్నీరు...  బావకు మరదలు బంగారు
బాజాలు మోగందే బాకాలు ఊదందే ఎందుకు కంగారు


బావా బావా పన్నీరు...  బావకు మరదలు బంగారు
బాజాలు మోగందే బాకాలు ఊదందే ఎందుకు కంగారు 



చరణం 1 :



చిలిపి చేష్టలతో వలపే కోరునట... ముద్దు తీర్చమని సద్దు చేయునట
చిలిపి చేష్టలతో వలపే కోరునట... ముద్దు తీర్చమని సద్దు చేయునట


మరులుకొనే బాల...  తను మనసు పడే వేళ
మరులుకొనే బాల...  తను మనసు పడే వేళ
ఉలికిపడి ఉనికిచెడి...  ఉక్కిరిబిక్కిరి అవుతాడంట


ఒహొహొ హొయ్ బావా బావా... మరదలా
బావా బావా పన్నీరు బావకు మరదలు బంగారు
పరుగులు తీసే ఉరకలు తీసే బావను ఆపేరు



చరణం 2 : 


సుందరాంగుడట గ్రంధసాంగుడట... ఏడు మల్లెయల ఎత్తు తూగునట
సుందరాంగుడట గ్రంధసాంగుడట... ఏడు మల్లెయల ఎత్తు తూగునట
కలికి కొనగోట...  ఆ చెంప ఇలా మీట
కలికి కొనగోట...  ఆ చెంప ఇలా మీట
అబల వలే అదిరిపడి లబోదిబో అంటాడంట


ఒహొహొ హొయ్ బావా బావా... మరదలా
బావా బావా పన్నీరు బావకు మరదలు బంగారు
వలపులలోన జలకములాడ బావను తిప్పేరు


బావా బావా పన్నీరు బావకు మరదలు బంగారు
వలపులలోన జలకములాడ బావను తిప్పేరు
బావా బావా పన్నీరు బావకు మరదలు బంగారు
వలపులలోన జలకములాడ బావను తిప్పేరు
వలపులలోన జలకములాడ బావను ముంచేరు 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18061

No comments:

Post a Comment