Wednesday, August 8, 2018

రాననుకున్నావేమో

చిత్రం :  మంచిమనిషి  (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు/టి. చలపతి రావు
గీతరచయిత : శ్రీశ్రీ
నేపథ్య గానం : ఘంటసాల, సుశీల 




పల్లవి :


రాననుకున్నావేమో... ఇక రాననుకున్నావేమో
ఆడినమాటకు నిలిచేవాడను కాననుకున్నావేమో... ఏమో


ఏమనుకున్నారేమో..తమరేమనుకున్నారేమో
మీచేతులలో కీలుబొమ్మలం మేమనుకున్నారేమో... ఏమో
 



చరణం 1 :


చక్కని కన్యవు ముక్కున కోపం నీకేలా... నీకేలా
చల్లగాలిలో ఆటలాడగా రావేలా... రావేలా


పిలిచిన వెంటనె పరుగున చెంతకు చేరాలా... చేరాలా
వలచివచ్చి నే చులకనైతిగా ఈవేళా... ఈవేళా



ఏమనుకున్నారేమో... తమరేమనుకున్నారేమో
మీచేతులలో కీలుబొమ్మలం మేమనుకున్నారేమో... ఏమో



చరణం 2 :


దొరగారేదో తొందరపనిలో మునిగారా... మునిగారా
అందుచేతనే అయినవారినే మరిచారా... మరిచారా


నిజమే తెలియక నిందలు వేయకు నామీదా... నామీదా
మాటవిసురులు మూతివిరుపులు మరియాదా... మరియాదా


రాననుకున్నావేమో... ఇక రాననుకున్నావేమో
ఆడినమాటకు నిలిచేవాడను కాననుకున్నావేమో... ఏమో



చరణం 3 :


క్షణమే యుగమై మనసే శిలయై నిలిచానే... నిలిచానే
నిన్ను చూడగా యుగమె క్షణముగా గడచేనే... గడచేనే


ఎడబాటన్నది ఇకపై లేదని అందామా... అందామా
ఈడుజోడుగా తోడునీడగా ఉందామా... ఉందామా
ఆ . . . ఆ . . ఓ . . .ఓ . . .







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=572

No comments:

Post a Comment