చిత్రం : కాంచన గంగ (1984)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు
పల్లవి :
బృందావని ఉంది... హా
యమునా నది ఉంది... హా
మధురాపురి ఉంది... కాళింది ఉంది
లేని వాడొక్కడే... శ్రీకృష్ణమూర్తి
కలిలోన శిలయైన... కల్యాణ మూర్తి
కలిలోన శిలయైన... కల్యాణ మూర్తి
హొయ్.. హొయ్.. హొయ్ హొయ్.. హొయ్
చరణం 1 :
పుట్టగానే పెరిగేటి... మాయబంధనాలకన్నా
పుడుతూనే తొలిగేటి... చెరసాలలే మిన్న
ఆ కిటుకు తెలిసేరా... హా
ఆ కిటుకు తెలిసేరా... శ్రీకృష్ణమూర్తి
కలిలోన శిలయైన..కల్యాణ మూరితి
కలిలోన శిలయైన..కల్యాణ మూరితి
హొయ్.. హొయ్.. హొయ్ హొయ్.. హొయ్
చరణం 2 :
వెంటపడి వేధించే... వేలమంది స్త్రీలున్నా
ఇంటనుండి పూజించే... ఇంతి ఉంటె చాలన్నా
ఆ కిటుకు తెలిసేరా ... హా
ఆ కిటుకు తెలిసేరా... శ్రీకృష్ణమూర్తి
రాధ గుండె దోచినాడు... వేదాంతమూరితి
రాధ గుండె దోచినాడు... వేదాంతమూరితి
హొయ్.. హొయ్.. హొయ్ హొయ్.. హొయ్
చరణం 3 :
గేయాలుగా మారే గీతాలు ఎన్నున్నా...
గాయాలు మాంపేటి గాయాలు మిన్నా...
ఆ కిటుకు తెలిసేరా.. హా
ఆ కిటుకు తెలిసేరా... శ్రీకృష్ణమూరితి
వేణువూది లాలించే గీతానువర్తి...
వేణువూది లాలించే గీతానువర్తి...
హొయ్.. హొయ్.. హొయ్ హొయ్.. హొయ్
బృందావని ఉంది..యమునా నది ఉందిమధురాపురి ఉంది..కాళింది ఉంది లేని వాడొక్కడే..శ్రీకృష్ణమూర్తి
కలిలోన శిలయైన..కల్యాణ మూరితి కలిలోన శిలయైన..కల్యాణ మూరితి
హొయ్.. హొయ్.. హొయ్ హొయ్.. హొయ్
No comments:
Post a Comment