Thursday, December 27, 2018

ఎప్పుడు ఎప్పుడు

చిత్రం : ఆఖరి పోరాటం (1988)

సంగీతం : ఇళయరాజా

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : బాలు, చిత్ర 




పల్లవి :


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో

ఇప్పటికిప్పుడు చిచ్చుల కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో దక్కిన చెక్కిలిలో 


నీ వంపుల సొంపే నా వంటికి పంపే

అల్లికలో అందికలో మల్లిక పూసిన మాపటిలో


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో....

ఇప్పటికిప్పుడు చిచ్చుల కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో దక్కిన చెక్కిలిలో 



చరణం 1 :


ఒక మాటు ఒడిని మీటి...  

ఒక మాటు ఒడిని మీటి... వలపు రాగాలు లాగేసుకుంటాలే 


పొద చాటు కథలు దాటి...  

పొద చాటు కథలు దాటి... చిలిపి తాళాలు మోగించుకుంటాలే  


ఎప్పటికప్పుడు దప్పిక తీరని చెప్పని దాహాలే

ఏమని చెప్పను నీకు జవాబులు పైటల పాప


అచ్చట ముచ్చట ఇచ్చట గిచ్చుడు పెంచిన మొహాలే

ఎంతని ఆపను నిన్ను మరీ మది బిత్తరపోక


చక్కని చుక్క తన సొంతం అనుకోమాక బలవంతం 

కోరికలే ఓపికలై మోజులు తెచ్చిన అల్లరిలో 


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో....


ఇప్పటికిప్పుడు చిచ్చుల కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో దక్కిన చెక్కిలిలో 



నీ వంపుల సొంపే నా వంటికి పంపే

అల్లికలో అందికలో మల్లిక పూసిన మాపటిలో


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో....

ఇప్పటికిప్పుడు చిచ్చుల కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో దక్కిన చెక్కిలిలో 




చరణం 2 :



పొరపాటో తెరకు చాటో...  

పొరపాటో తెరకు చాటో... వయసులాటాడుకోవాలి ఈనాడే 

అది ఆటో పెదవి గాటో...  

అది ఆటో పెదవి గాటో ... మధుర గాయాలు తాకాలి లోలోనే


చప్పున ఆరని నిప్పుల కుంపటి రేపిన తాపాలే

చల్లని వెన్నెల చిచ్చుల ఉచ్చులు వేసెను నాకే


అచ్చిక బుచ్చిక పిచ్చిగ మచ్చిక చేసిన అందాలే

జంటగ తుంటరి రెప్పల గంటలు కొట్టెను నేడే


చమ్మని చక్కే మన ఆట...  మల్లెల పక్కే మన తోట

నవ్వులతో పువ్వులతో రివ్వులు పెట్టిన ప్రేమలలో


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో....


ఇప్పటికిప్పుడు చిచ్చుల కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో దక్కిన చెక్కిలిలో 


నీ వంపుల సొంపే నా వంటికి పంపే

అల్లికలో అందికలో మల్లిక పూసిన మాపటిలో


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో....


ఇప్పటికిప్పుడు చిచ్చుల కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో దక్కిన చెక్కిలిలో 







2 comments:

  1. నమస్తే అండి, మంచి పాట అందించారు కానీ సాహిత్యంలో కొన్ని తప్పులు ఉన్నాయి సరిదిద్దగలరు
    1. మొదటి చరణంలో correction "అచ్చట ముచ్చట ఇచ్చట గిచ్చుడు పెంచిన మొహాలే ఎంతని ఆపను...." అని ఉండాలి
    2. రెండో చరణంలో పాపాలే కాదు, "తాపాలే" అని ఉండాలి అండి.
    "అచ్చిక బుచ్చిక పిచ్చిగ మచ్చిక" అని ఉండాలి
    "నవ్వులతో పువ్వులతో దివ్వెలు పెట్టిన ప్రేమలలో" అని ఉండాలి.

    ReplyDelete