స్వరాల పల్లకి
Guest Book
[Sign My Guestbook]
[View My Guestbook]
Powered by E-Guestbooks Server
.
Saturday, December 29, 2018
పండు పండు నా బుజ్జిపండు
చిత్రం : స్వాతి (1984)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, శైలజ
పల్లవి :
పండు పండు నా బుజ్జిపండు... రేపటికిస్తాను రేగుపండు
సైటు కొట్టడం పైట లాగడం
నేర్చుకొంటే మంచిదంట కవ్విస్తున్న కళ్లవాడా..ఆ ఆ ఆ ఆ ఆ
పండు పండు నా బుజ్జిపండు... ముద్దు ముద్దుకి నా నోరు పండు
సిగ్నలివ్వటం సిగ్గు పెంచటం... కోరి నాకు నేర్పుకోవె కోలకళ్ల చిన్నదానా
చరణం 1 :
రారా నా సామిరంగ... ఆసామి నువ్వే అందాలకి
నీదేరా ఈ పూలతోట... ఆడుకో అందాల వేట
రాణి రవ్వంతకానీ... రాగాలబోణీ ఈ పూటకీ
గుట్టుదాటిపోతేను ఎట్టా... గూడుదాటినా ఈడు పిట్ట
వళ్ళంత ఏడెక్కి... వయసంతా గుండెక్కె
అంతో ఇంతో ఆదుకోర... చెంత చేరి చిన్నవాడా
పండు పండు నా బుజ్జిపండు...రేపటికిస్తాను రేగుపండు
చరణం 2 :
నవ్వు నీగుమ్మ నవ్వు..దానిమ్మపువ్వు దక్కించవా
పువ్వులే పండించుకొంటా... పులుపంతనే నంజుకొంట
సిగ్గు ఆనాటి సిగ్గు... వచ్చింది తగ్గు కవ్వించక
సిగ్గువుంటే సింగారమంటా... ఉన్నసిగ్గు ఊదేయకంట
ఈ పూట నలుపెక్కె... నీ బుగ్గ ఎరుపెక్కె
రెగిందంటె రేపుమాపు... ఎట్టగంట నీతో తంట
పండు పండు నా బుజ్జిపండు... రేపటికిస్తాను రేగుపండు
సైటు కొట్టడం పైట లాగడం నేర్చుకొంటే
మంచిదంట కవ్విస్తున్న కళ్లవాడా..ఆ ఆ ఆ ఆ ఆ
పండు పండు నా బుజ్జిపండు... ముద్దు ముద్దుకి నా నోరు పండు
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment