Showing posts with label శైలజ. Show all posts
Showing posts with label శైలజ. Show all posts

Sunday, August 23, 2020

అన్నా... విన్నా... పాపమే

చిత్రం : అపరాధి (1982)
సంగీతం : జె. వి. రాఘవులు
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, శైలజ   



పల్లవి :


అనసూయా... లల లల హా హా.. హుహు హూ హా హా..
లాలా లలలా లలలా హ హ...


అన్నా... విన్నా... పాపమే...
అనసూయా అసూయెందుకే... ఇదిగో


అవ్వా... అంతా మోసమే...
మగబుద్ధి అన్నారందుకే...
సందెకాడ కోపం... చందమామ శాపం
రాత్రిళ్లకే కాళ్ళబేరం... ఆ అ అ రాజీకి రానంటే పాపం... హా


చరణం 1 :


పెద్దలమీద పెదొట్టు బుగ్గలమీద ముదొట్టు

నీ బొట్టు మీదొట్టు... చాలా?


పేరుకు భార్య రత్నం... మెళ్ళో మంగళసూత్రం
వన్నెల విసన కర్రలతోన వ్యవహారం

పెద్దలమీద పెదొట్టు బుగ్గలమీద ముదొట్టు

నీ బొట్టు మీదొట్టు... చాలా?

పేరుకు భార్య రత్నం... మెళ్ళో మంగళసూత్రం 

వన్నెల విసన కర్రలతోనా వ్యవహారం 


నోట్లో వేలు కొరకని వాణ్ని
నిన్నే తప్ప ఎరగని వాణ్ని
నీ భామా కలాపాలు చూశాలే 

అవ్వా అంత మోసమే
మగ బుద్ధి అన్నారందుకే


సందెకాడ కోపం చందమామ శాపం
రాత్రిళ్లకే కాళ్ళబేరం... ఆ అ అ
రాజీకి రానంటే పాపం... హా


చరణం 2 :


మమతలన్ని మనువు చేసి భర్తనైనానే

మమతలన్ని మనువు చేసి భర్తనైనానే


నిన్ను నమ్మి మనసు నమ్మి ఆలినైనానే
నిన్ను నమ్మి మనసు నమ్మి ఆలినైనానే


అనుమానం పెనుభూతం... చాలించు భాగోతం
అనుమానం పెనుభూతం... చాలించు భాగోతం


అన్నా విన్నా పాపమే
అనసూయా...  అసూయెందుకే

సందెకాడ కోపం చందమామ శాపం
రాత్రిళ్లకే కాళ్ళబేరం..
రాజీకి రానంటే... పాపం...


లల..లల..లలలా..
ల లా లా ల ల లా 



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=13005

Thursday, August 6, 2020

నేనెవరో అనామికనూ

చిత్రం :  సిరిమువ్వల సింహనాదం 
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సిరివెన్నెల
నేపథ్య గానం : బాలు,  శైలజ 





పల్లవి : 



నేనెవరో అనామికనూ... నీ కథలో అభిసారికను
నేనెవరో అనామికనూ... నీ కథలో అభిసారికను
తలపులు తెలుపని కోరికను...
ఏ తళుకులు తెలియని తారకను


నేనెవరో అనామికనూ... 


చరణం 1 :


బదులు దొరకని పొడుపు కథనై ఎదురు చూస్తున్నా
పెదవి కదపని పేద యెదనై ఎదుటనే ఉన్నా


చెలిమి చినుకే తొలకరిస్తే చిగురు తొడిగేను
మనసు తెలిసి పలకరిస్తే మంచు కరిగేను


నేనెవరో అనామికనూ


చరణం 2 :


దిశలు తెలిపే కలికి కెరటం పిలుపు వింటున్నా
నిశిని చెరిపే పసిడి కిరణం వెలుగు కంటున్నా 


గుండెలోతున గూటి కోసం కదిలి వస్తున్నా
గువ్వ జాడకు మువ్వ నవ్వులు కానుక ఇమ్మన్నా 


నేనెవరో అనామికను... నీ కథలో అభిసారికను
తీరము దొరికిన కోరికను...
నే ద్వారము తెరిచిన ద్వారకను....



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12506

Wednesday, July 22, 2020

కోటిరాగాలలో వేయి దైవాలలో

చిత్రం : మరో సీత కథ (1979)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు,  శైలజ 



పల్లవి : 


కోటిరాగాలలో... వేయి దైవాలలో       
హృదయాన నిలిచేది ఒక దైవమే       
మనసారా పలికేది ఒక రాగమే ... అనురాగమే


కోటి అందాలలో...  వేయి బంధాలలో           
హృదయాన నిలిచేది నీ అందమే           
మనసారా కోరెది ఒక బంధమే...  అనుబంధమే       
                   



చరణం 1 :


చిరుగాలి కెరటాలు సిరిమల్లె గంధాలు           
తెలిపేను నా రాణి వచ్చేనని
చిరుగాలి కెరటాలు సిరిమల్లె గంధాలు           
తెలిపేను నా రాణి వచ్చేనని
మేఘాల దాహాలు సెలయేటి దేహాలు           
తెలిపేను విరహాన వేగేవని... విరహాన వేగెవని


కోటి అందాలలో వేయి బంధాలలో
హృదయాన నిలిచేది నీ అందమే           
మనసారా కోరెది ఒక బంధమే... అనుబంధమే



చరణం 2 :



నీపైట కొంగే తెరచాప కాగా         
రాగాల సాగాలి నా ప్రేమనౌక
నీపైట కొంగే తెరచాప కాగా         
రాగాల సాగాలి నా ప్రేమనౌక


నీ వాలుచూపే చుక్కాని కాగా             
చేరాలి శృంగార తీరాలిక... శృంగార తీరాలిక


కోటి అందాలలో వేయి బంధాలలో           
హృదయాన నిలిచేది నీ అందమే           
మనసారా కోరెది ఒక బంధమే... అనుబంధమే      

                         
కోటిరాగాలలో వేయి దైవాలలో       
హృదయాన నిలిచేది ఒక దైవమే       
మనసారా పలికేది ఒక రాగమే... అనురాగమే

Sunday, May 24, 2020

సుడిగాలిలోన దీపం

చిత్రం : ఆనంద భైరవి (1984)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, శైలజ  



పల్లవి : 


సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం
సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం
ఇనుకుంటే ఇంతేరా ఇష్ణుమాయా
ఆ.. ఇనుకుంటే ఇంతేరా ఇష్ణుమాయా


సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం
సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం
దయచూపి కాపాడు దైవరాయా
ఓ... దయచూపి కాపాడు దైవరాయా


చరణం 1 :


మట్టి మీద పుట్టేనాడు.. మట్టిలోన కలిసేనాడు
మట్టి మీద పుట్టేనాడు.. మట్టిలోన కలిసేనాడు
పొట్ట షాత పట్టందే ఓ రయ్యో...
గిట్టుబాటు కాదీ బ్రతుకు ఇనరయ్యో...
గిట్టుబాటు కాదీ బ్రతుకు ఇనరయ్యో... 


సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం
సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం
దయచూపి కాపాడు దైవరాయా
ఓ... దయచూపి కాపాడు దైవరాయా


చరణం 2 :


గుడ్డు కన్ను తెరిచేనాడు... రెక్కలొచ్చి ఎగిరేనాడు
గుడ్డు కన్ను తెరిచేనాడు... రెక్కలొచ్చి ఎగిరేనాడు
జోలెపట్టి అడగందే ఓలమ్మో...
కత్తి మీద సామీ బ్రతుకు ఇనవమ్మో...
కత్తి మీద సామీ బ్రతుకు ఇనవమ్మో...



సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం
ఇనుకుంటే ఇంతేరా ఇష్ణుమాయా
ఆ.. ఇనుకుంటే ఇంతేరా ఇష్ణుమాయా


సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం
దయచూపి కాపాడు దైవరాయా
ఓ... దయచూపి కాపాడు దైవరాయా




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7570

Sunday, April 26, 2020

అందాలరాశి... నీ అందచందాలు చూసి

చిత్రం :  అందాల రాశి (1980)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు, శైలజ 




పల్లవి :


అందాలరాశి... నీ అందచందాలు చూసి
ఎన్నో గ్రంథాలు రాసి... తరించేనులే ప్రేయశి... ప్రేయశి


అందాలరాశి... నీ అందచందాలు చూసి
ఎన్నో గ్రంథాలు రాసి... తరించేనులే ప్రేయశి... ప్రేయశి
అందాలరాశి...



చరణం 1 :


నీ రూపు హృదయాలయ దీపికా... నీ చూపు ఉదయోదయ తారకా
నీ రూపు హృదయాలయ దీపికా... నీ చూపు ఉదయోదయ తారకా


నీ పలుకుల సడికి ఉలికిపడే ఊర్వశినై ఊగనీ
నీ మేను తగిలి  మెలిక తిరిగి మేనకనై ఆడనీ


ఆ.. నీవే నా జీవన బృందావన రాధికా
నీవే యువతీ జన నవమోహన గీతికా


అందాలరాశి... నీ అందచందాలు చూసి
ఎన్నో గ్రంథాలు రాసి... తరించేనులే ప్రేయశి... ప్రేయశి


చరణం 2 :


నీ మాట మంత్రాక్షర మాలికా... నీ మనసే మమతల మరుమల్లికా
నీ మాట మంత్రాక్షర మాలికా... నీ మనసే మమతల మరుమల్లికా


పురివిప్పిన నీ సొగసున మణిపురినే చూడనీ
గురి తప్పని నీ అడుగులు కూచిపూడి ఆడనీ


నీవేలే శ్రీశైల శిఖరాంచల చంద్రికా
నీవే నా నవయవ్వన నందనవన భ్రమరికా


అందాలరాశి... నీ అందచందాలు చూసి
ఎన్నో గ్రంథాలు రాసి... తరించేనులే ప్రేయశి... ప్రేయశి


అందాలరాశి... నీ అందచందాలు చూసి
ఎన్నో గ్రంథాలు రాసి... తరించేనులే ప్రేయశి... ప్రేయశి
అందాలరాశి...





Saturday, April 11, 2020

ఎదటికొస్తే నవ్వులు

చిత్రం : అమృత కలశం  (1980)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : వీటూరి
నేపథ్య గానం : బాలు, శైలజ 


పల్లవి : 


హ..ఆ.. హ.. ఆ...ఆ.. హ.. ఆ...
ఎదటికొస్తే నవ్వులు... ఎనక జూస్తే పువ్వులు
ఎవరమ్మా.... ఆ.. ఆ... హా
నవ్వులపువ్వుల గువ్వలాంటి చిన్నది.. రివ్వురివ్వుమన్నది


ఎండలాంటి చూపులు... ఎన్నెలంటి నవ్వులు
ఎవరమ్మా... ఆ... ఆ.. హా
మల్లెల మబ్బుల జల్లులాంటి చిన్నోడు... జివ్వుజివ్వుమన్నాడు
 


చరణం 1 :


చూపు సుప్రభాతం... మాట మలయమారుతం
కొంగుచాటు కవితగా... పొంగుతున్న సాగరం
నవ్వుతున్న జవ్వనం...  నడుస్తున్న నందనం


ఎవరమ్మా.. ఆ.. హా..
అందాలన్నీ గ్రంథాలల్లి... అభివర్ణించే కవికుమారుడు


ఎదటికొస్తే నవ్వులు... ఎనక జూస్తే పువ్వులు


చరణం 2 :


చూపు నాకు చుంభనం... వలపు సేతుబంధనం
కౌగిలింత బిగువులో...  వణకుతున్న ఆకసం
గడుస్తున్న పొద్దులో... పొడుస్తున్న తారలం


ఎవరమ్మా... ఆ..
ఎన్నో జన్మల బంధం తానై నన్నల్లుకునే రాగమాలిక


ఎండలాంటి చూపులు... ఎన్నెలంటి నవ్వులు
ఎవరమ్మా... ఆ... ఆ.. హా
మల్లెల మబ్బుల జల్లులాంటి చిన్నోడు... జివ్వుజివ్వుమన్నాడు



ఎదటికొస్తే నవ్వులు... ఎనక జూస్తే పువ్వులు
ఎవరమ్మా.... ఆ.. ఆ... హా
నవ్వులపువ్వుల గువ్వలాంటి చిన్నది.. రివ్వురివ్వుమన్నది

జివ్వుజివ్వుమన్నాడు... రివ్వురివ్వుమన్నది




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8105

Tuesday, July 16, 2019

చిరుగాలి... చెప్పవే గొరవంకకి

చిత్రం : గ్రహణం విడిచింది (1980)
సంగీతం :  
రమేశ్ నాయుడు    

గీతరచయిత : మైలవరపు గోపి

నేపథ్య గానం :  బాలు, శైలజ



పల్లవి :



చిరుగాలి..
చిరుగాలి... చెప్పవే గొరవంకకి..
చేరువలో చిలకమ్మ.. వచ్చి కూర్చుందనీ..
చిరుగాలి... చెప్పవే గొరవంకకి..
చేరువలో చిలకమ్మ.. వచ్చి కూర్చుందనీ..


చిరుగాలి చెప్పవే చిలకమ్మకి..
పిలవకనే ఒడిలోకి  వచ్చి వాలాలనీ
చిరుగాలి చెప్పవే చిలకమ్మకి..
పిలవకనే ఒడిలోకి  వచ్చి వాలాలనీ



చరణం 1 :


ఆ చిరునవ్వులే వరి మడిలోనా వంక సన్నాలు
ఆ చిరునవ్వులే వరి మడిలోనా వంక సన్నాలు
కలకంటి చూపులో చిందే...  వలపులే శీత కాటుకలు

నీ చల్లని రెప్పల నీడలోనే రాజభోగాలు
నీ చల్లని రెప్పల నీడలోనే రాజభోగాలు
నీ కమ్మని కౌగిలి నాదైతే రోజులు నిమిషాలు



చిరుగాలి... చెప్పవే గొరవంకకి..
పిలవకనే ఒడిలోకి  వచ్చి వాలాలనీ



చరణం 2 :



నువు కదలాడితే.. నా ఎదలోన ఎన్ని కోరికలు..
నువు కదలాడితే.. నా ఎదలోన ఎన్ని కోరికలు..
నీ నిండు మనుగడే.. నాకు పసుపు కుంకుమలు..


నువు లాలించే వేళలో...  నే పాపనవుతాను..
నువు లాలించే వేళలో...  నే పాపనవుతాను..
నీ చలవుంటే ఒకనాటికి నేను.. తల్లినవుతాను..


చిరుగాలి... చెప్పవే గొరవంకకి..
చేరువలో చిలకమ్మ.. వచ్చి కూర్చుందనీ..


చిరుగాలి చెప్పవే చిలకమ్మకి..
పిలవకనే ఒడిలోకి  వచ్చి వాలాలనీ



Saturday, December 29, 2018

పండు పండు నా బుజ్జిపండు

చిత్రం : స్వాతి (1984)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు,  శైలజ 




పల్లవి :


పండు పండు నా బుజ్జిపండు... రేపటికిస్తాను రేగుపండు
సైటు కొట్టడం పైట లాగడం 

నేర్చుకొంటే మంచిదంట కవ్విస్తున్న కళ్లవాడా..ఆ ఆ ఆ ఆ ఆ  


పండు పండు నా బుజ్జిపండు...  ముద్దు ముద్దుకి నా నోరు పండు
సిగ్నలివ్వటం సిగ్గు పెంచటం...  కోరి నాకు నేర్పుకోవె కోలకళ్ల చిన్నదానా 



చరణం 1 : 



రారా నా సామిరంగ... ఆసామి నువ్వే అందాలకి
నీదేరా ఈ పూలతోట... ఆడుకో అందాల వేట


రాణి రవ్వంతకానీ... రాగాలబోణీ ఈ పూటకీ
గుట్టుదాటిపోతేను ఎట్టా... గూడుదాటినా ఈడు పిట్ట


వళ్ళంత ఏడెక్కి... వయసంతా గుండెక్కె
అంతో ఇంతో ఆదుకోర... చెంత చేరి చిన్నవాడా


పండు పండు నా బుజ్జిపండు...రేపటికిస్తాను రేగుపండు 



చరణం 2 : 


నవ్వు  నీగుమ్మ నవ్వు..దానిమ్మపువ్వు దక్కించవా
పువ్వులే పండించుకొంటా... పులుపంతనే నంజుకొంట
సిగ్గు ఆనాటి సిగ్గు... వచ్చింది తగ్గు కవ్వించక
సిగ్గువుంటే సింగారమంటా... ఉన్నసిగ్గు ఊదేయకంట
ఈ పూట నలుపెక్కె... నీ బుగ్గ ఎరుపెక్కె
రెగిందంటె రేపుమాపు... ఎట్టగంట నీతో తంట



పండు పండు నా బుజ్జిపండు... రేపటికిస్తాను రేగుపండు
సైటు కొట్టడం పైట లాగడం నేర్చుకొంటే
మంచిదంట కవ్విస్తున్న కళ్లవాడా..ఆ ఆ ఆ ఆ ఆ  


పండు పండు నా బుజ్జిపండు...  ముద్దు ముద్దుకి నా నోరు పండు



కల్యాణం కమనీయం

చిత్రం : స్వాతి (1984)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : సుశీల,  శైలజ 




పల్లవి :


కల్యాణం కమనీయం..  కలలే పండిన వైభోగం
అనురాగం అభిమానం...  అమ్మకు నాన్నకు శతమానం
కల్యాణం కమనీయం ... కలలే పండిన వైభోగం
అనురాగం అభిమానం...  అమ్మకు నాన్నకు శతమానం


అమ్మను వధువుగా  చేస్తున్న
వరునిగా నాన్నను చూస్తున్న
కనుపాపలకేంతో ఆహ్లాదం... ఈ పాపలకేంతో ఆనందం 


                                                   
కల్యాణం కమనీయం...  కలలే పండిన వైభోగం
అనురాగం అభిమానం...  అమ్మకు నాన్నకు శతమానం 




చరణం 1 : 



ఆ వేదమంత్రాల అర్థాలు తెలిసి...  ఆశీర్వదించండి ఈ జంటని
ఆ పుష్య రాగాల ఆంతర్యమెరిగి...  దీవించి పంపండి ఈ ఇంటికి 


మనసుపడే సౌభాగ్యం మమత అనే మాంగల్యం
స్త్రీ జన్మ కోరేటి సిరులే కదా... స్త్రీ జన్మ కోరేటి సిరులే కదా
శివ పార్వతులు మాకు మీరే కదా... శివ పార్వతులు మాకు మీరే కదా


కల్యాణం కమనీయం...  కలలే పండిన వైభోగం
అనురాగం అభిమానం...  అమ్మకు నాన్నకు శతమానం 



చరణం 2 : 


ముక్కోటి దేవుళ్ళ ముధ్దంత తెచ్చి...  ముగ్గెసు కోవాలి ఈ ఇంటికి
శతకోటి తారల్ల చిరునవ్వు తెచ్చి...  హారాలు వెయ్యాలి ఈ జంటకి
సగమైన సహధర్మం కలిసిందే సంసారం


ఏడేడు జన్మాల బంధాలతో... ఏడేడు జన్మాల బంధాలతో
మీ జన్మ పండాలి అనురాగమై... మీ జన్మ పండాలి అనురాగమై



కల్యాణం కమనీయం ... కలలే పండిన వైభోగం
అనురాగం అభిమానం...  అమ్మకు నాన్నకు శతమానం


అమ్మను వధువుగా  చేస్తున్న
వరునిగా నాన్నను చూస్తున్న
కనుపాపలకేంతో ఆహ్లాదం... ఈ పాపలకేంతో ఆనందం 


                                                     




http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12009

Tuesday, January 30, 2018

కలలెందుకు.. కథలెందుకు

చిత్రం :  సూత్రధారులు (1989)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు, శైలజ  




పల్లవి :



ఆ...  ఆ...  ఆ...  ఆ
కలలెందుకు.. కథలెందుకు.. తలపెందుకు.. తపమెందుకు
కలలెందుకు.. కథలెందుకు.. తలపెందుకు.. తపమెందుకు


కోర్కెలన్ని కనులముందే కొలువు తీరిన వేళ
కోర్కెలన్ని కనులముందే కొలువు తీరిన వేళ


కలలెందుకు.. కథలెందుకు.. తలపెందుకు.. తపమెందుకు



చరణం 1 :



కొనచూపుల కలికితనం...  విరులవాన కురిసింది
కొనచూపుల కలికితనం...  విరులవాన కురిసింది
కరిగిపోని కాంతివనం...  కోటి చిగురులేసింది


చిరునవ్వుల చల్లదనం...  సిరుల వరము చిలికింది
చిరునవ్వుల చల్లదనం...  సిరుల వరము చిలికింది
చెదిరిపోని చెలిమి ధనం...  తీరని ఋణమయ్యింది


మలిగిపోని మమతలన్ని మదిని వెలిగే వేళ
పోత పోసిన పున్నెమంత పున్నమయ్యే వేళ
ఆ ఆ ఆ ఆ ఆ


కలలెందుకు...  ఆ...  ఆ...  ఆ...  ఆ
కథలెందుకు...  ఆ...  ఆ...  ఆ...  ఆ
తలపెందుకు...  ఆ...  ఆ...  ఆ...  ఆ
తపమెందుకు...  ఆ...  ఆ...  ఆ...  ఆ


   



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1453

Monday, January 22, 2018

వెలుగు నీడల్లో

చిత్రం : సత్యం-శివం (1981)
సంగీతం : చక్రవర్తి 
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి, శైలజ  




పల్లవి : 



లరలలలాలా... లలలలలాలా
ఉహుహుహుహు... లలలలలాలా


వెలుగు నీడల్లో వెలిగే నీ బంధం
వేయి జన్మలకీ వెలుతురీ బంధం 


వెలుగు నీడల్లో వెలిగే నీ బంధం
వేయి జన్మలకీ వెలుతురీ బంధం 




చరణం 1 :



మమత కోసం మనసు తెరిచి నిన్ను పిలిచాను
వెలుగు కోసం వెతికి వెతికి నిన్ను చూశాను
మమత కోసం మనసు తెరిచి నిన్ను పిలిచాను
వెలుగు కోసం వెతికి వెతికి నిన్ను చూశాను 


నీవు నా హృదయ గీతం... నీవు నా ఉదయ రాగం


చెలిమిలో ఇది చైత్ర మాసం... చెరగనీ మధురానుబంధం



వెలుగు నీడల్లో వెలిగే నీ బంధం
వేయి జన్మలకీ వెలుతురీ బంధం



చరణం 2 :



వీణలైనా.. వేణువైనా ఒక్కటే రాగం
మోగుతున్నా.. మూగదైనా పేరు అనురాగం
వీణలైనా.. వేణువైనా ఒక్కటే రాగం
మోగుతున్నా.. మూగదైనా పేరు అనురాగం


నీవు నా ప్రాణ శిల్పం... నీవు నా ప్రేమ కావ్యం


మనసులో తొలి సుప్రభాతం... వయసులో విరిసే వసంతం


వెలుగు నీడల్లో...  వెలిగే నీ బంధం
వేయి జన్మలకీ... వెలుతురీ బంధం 



ఆ.. హ.. ఆ.. హా.. ఆ.. ఆహా...






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=863

Wednesday, November 1, 2017

హరివిల్లు పొదరిల్లు


చిత్రం :   స్వయంవరం (1982)
సంగీతం :  సత్యం
గీతరచయిత : రాజశ్రీ
నేపధ్య గానం : బాలు, సుశీల, శైలజ  


పల్లవి :



హరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం
హరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం
అన్ని ఆందరి కోసం... నువ్వున్నది నాకోసం
నేనున్నదీ నీకోసం...



సిరిమల్లె జాబిల్లి దిక్కులు ఆకాశం
అన్ని ఆందరి కోసం నువ్వున్నది నాకోసం
నేనున్నదీ నీకోసం

ఆ... అ... ఆ.. ఆ.. ఆ.. 




చరణం 1 :


ఆ... అహ.. ఆ.. ఆ..
ఓహో.. ఓ.. ఓ.. ఓ..

తలిరాకులు మొగ్గలుగా... చిరుమొగ్గలు పువ్వులుగా
అది నీ చిరునవ్వులుగా మారెను


నెలవంకే జాబిలిగా... ఆ జాబిలి వెన్నెలగా
అది నీ కొనచూపులుగా తోచెను


నీ చూపులలో...  నా నవ్వులలో
మధురిమలుగా పెరిగెను .. 


సిరిమల్లె జాబిల్లి దిక్కులు ఆకాశం
అన్ని ఆందరి కోసం నువ్వున్నది నాకోసం
నేనున్నదీ నీకోసం 



చరణం 2 :




నీ అలకే సింధూరం... నీ పలుకే సంగీతం
నీ సొగసే అందాల బృందావనం


నీ మాటే మకరందం... నీ మనసే మందారం
నీ యదలో ఆణువణువూ నా సొంతం


తీయ తీయనిది...  వసివాడనది
మన ఇద్దరి అనుబంధం .. 


హరివిల్లు పొదరిల్లు చుక్కలు ఆకాశం
అన్ని ఆందరి కోసం... నువ్వున్నది నాకోసం
నేనున్నదీ నీకోసం...



సిరిమల్లె జాబిల్లి దిక్కులు ఆకాశం
అన్ని ఆందరి కోసం... నువ్వున్నది నాకోసం
నేనున్నదీ నీకోసం...



ఆ... అహ.. ఆ.. ఆ..
ఓహో.. ఓ.. ఓ.. ఓ..







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2720

Saturday, April 1, 2017

ఓ బాటసారి...ఇది జీవిత రహదారి

చిత్రం :  ఇల్లాలు (1981)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత  :
నేపధ్య గానం  : ఏసుదాసు,  శైలజ 




పల్లవి :



ఓ బాటసారి...ఇది జీవిత రహదారి
ఓ బాటసారి...ఇది జీవిత రహదారి 


ఎంత దూరమో... ఏది అంతమో
ఎవరు ఎరుగని దారి ఇది
ఒకరికె సొంతం కాదు ఇది 


ఓ బాటసారి... ఇది జీవిత రహదారి..



చరణం 1 :



ఎవరు ఎవరికి తోడౌతారో.... ఎప్పుడెందుకు విడిపోతారో
మమతను కాదని వెళతారో... మనసే చాలని ఉంటారు
ఎవ్వరి పయనం ఎందాకో...
అడగదు ఎవ్వరిని... బదులే దొరకదని
అడగదు ఎవ్వరిని... బదులే దొరకదని


చరణం 2 :



కడుపుతీపికి రుజువేముందీ... అంతకు మించిన నిజమేముందీ...
కాయే చెట్టుకు బరువైతే.... చెట్టును భూమి మోస్తుందా..
ఇప్పుడు తప్పులు తెలుసుకొనీ... జరిగేదేమిటనీ..క్షమించదెవ్వరినీ


చరణం 3 :



తెంచుకుంటివి అనుబంధాన్ని... పెంచుకున్నదొక హృదయం దాన్ని..
అమ్మలిద్దరు వుంటారని అనుకోలేని పసివాడ్ని
బలవంతాన తెచ్చుకొని... తల్లివి కాగలవా? ... తనయుడు కాగలడా?


చరణం 4 :



అడ్డ దారిలో వచ్చావమ్మా... అనుకోకుండా కలిసావమ్మ
నెత్తురు పంచి ఇచ్చావూ... నిప్పును నీవే మింగావూ
ఆడదాని ఐశ్వర్యమేమిటో...ఇప్పుడు తెలిసింది..కథ ముగిసేపొయింది
ఇప్పుడు తెలిసింది..కథ ముగిసేపొయింది 


ఓ..బాటసారీ..ఇది జీవిత రహదారీ






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2663

Wednesday, May 25, 2016

చెల్లెమ్మకు పెళ్ళంట







చిత్రం: దేవాంతకుడు (1984)
సంగీతం: జె.వి. రాఘవులు
గీతరచయిత: మైలవరపు గోపి
నేపధ్య గానం: బాలు, శైలజ



పల్లవి :



స్వస్తిశ్రీ చాంద్రమాన రుధిరోద్గారి నామ సంవత్సరము..
మార్గశిర పౌర్ణమి బుద్ధవారం పుష్యమి నక్షత్రయుక్త శుభలగ్నమందు





చెల్లెమ్మకు పెళ్ళంట...  అన్నయ్యకు సంబరమంట
చెల్లెమ్మకు పెళ్ళంట...  అన్నయ్యకు సంబరమంట
ఏ ఇంటికి ఇల్లాలైనా...  నా కంటికి పాపేనంటా



చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట
ఏ ఇంటికి ఇల్లాలైనా నా కంటికి పాపేనంటా
చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట 




చరణం 1 :



ఎదపై ఆడిన నా చిట్టి చెల్లి... వధువుగ మారే సమయంలో
ఎదపై ఆడిన నా చిట్టి చెల్లి... వధువుగ మారే సమయంలో 



నింగినంతగా పందిరి వేసి... నేల నిండుగా వేదిక వేసి
పూలరథంలో పంపిస్తా.. ఆ.. ఆ.. నలుగురిలోనే గర్విస్తా




చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట
చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట
ఏ ఇంటికి ఇల్లాలైనా నా కంటికి పాపేనంటా
చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట 




చరణం 2 :


ఆ దేవుడు దిగి వస్తే వరమొక్కటి ఇమ్మంటా
ఆ దేవుడు దిగి వస్తే వరమొక్కటి ఇమ్మంటా


మరు జన్మనేదే ఉంటే ఈ అన్నే కావాలంటా
ఆ దేవుడు దిగి వస్తే వరమొక్కటి ఇమ్మంటా



చరణం 3 :



కొంగుముడితో నే వెళ్లిపోతే...  ఏమౌతుందో నీ పేద మనసు
కొంగుముడితో నే వెళ్లిపోతే...  ఏమౌతుందో నీ పేద మనసు



ఎక్కడ ఉన్నా.. నేనేమైనా...  కోరేదేమిటి నీ బాగు కన్నా
పెద్ద మనసుతో దీవిస్తున్నా.. .. ఆ.. ఆ.. వయసున నీకు చిన్నైనా



చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట
ఏ ఇంటికి ఇల్లాలైనా నా కంటికి పాపేనంటా
చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట  







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8063

Thursday, April 28, 2016

మావయ్య అన్న పిలుపు






చిత్రం : ముద్దుల మావయ్య (1989)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వెన్నెలకంటి
నేపధ్య గానం : బాలు, శైలజ






పల్లవి :



మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు



కమ్మగా పాడనా కంటిపాప జోల
కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల


మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు



చరణం 1 :



అరచేత పెంచాను చెల్లిని
ఈ అరుదైన బంగారు తల్లిని
అడుగేస్తే పాదాలు కందవా
నా కన్నుల్లో కన్నీళ్ళు చిందవా


అమ్మగా లాలించాడు
నిన్ను నాన్నగా పాలించాడు
అన్నగా ప్రేమించాడు అన్నీ తానైనాడు


తన ప్రాణంగా నను పెంచాడు
ఆ దైవంగా దీవించాడు
నా అన్నలాంటి అన్న ఈ లోకాన లేడు



మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు




చరణం 2 :



ఆరేడు మాసాలు నిండగా
ఈ అన్నయ్య కలలన్నీ పండగా

తేవాలి బంగారు ఊయల
కావాలి మా ఇల్లు కోవెల
రెప్పగా నిను కాచనా
పాపగా నిను చూడనా
రేపటి ఆశ తీరగా
నీ పాపకు జోల పాడనా


ఇది అరుదైన ఓ అన్న కథ
ఇది మురిపాల ఓ చెల్లి కథ
ఇది చెల్లెలే కాదులే నను కన్నతల్లి




మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు



కమ్మగా పాడనా కంటిపాప జోల
కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల


మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు


మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దుపొడుపు






Tuesday, April 5, 2016

సుజాతా... ఐ లవ్ యూ సుజాతా




చిత్రం: గోపాలరావు గారి అమ్మాయి (1980)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: ఆరుద్ర
నేపథ్య గానం: బాలు, శైలజ 


పల్లవి :

సుజాతా.. ఐ లవ్ యూ
సుజాతా.. ఐ లవ్ యూ.. ఐ లవ్ యూ.. ఐ లవ్ యూ..  సుజాతా


సుజాతా.. ఐ లవ్ యూ సుజాతా
నిజంగా ఐ లైక్ యూ సుజాతా
సుజాతా.. ఐ లవ్ యూ సుజాతా
నిజంగా ఐ లైక్ యూ సుజాతా
ఐ లవ్ యూ సుజాతా.. సుజాతా.. సుజాతా.. సుజాతా



సుజాతా...  ఐ లవ్ యూ సుజాతా
నిజంగా..  ఐ లైక్ యూ సుజాతా




చరణం 1 :


వెచ్చగా నులివెచ్చగా.. నే మెచ్చగా చేరవా
చల్లగా జాబిల్లిగా మరుమల్లెగా మారనా
వెచ్చగా నులివెచ్చగా.. నే మెచ్చగా చేరవా
చల్లగా జాబిల్లిగా మరుమల్లెగా మారనా


కన్ను కన్ను కలిపిన నాడే పున్నమి వెన్నెల కురిసింది
నిన్ను నన్ను కలిపిన వాడికి ప్రేమకు అర్థం తెలిసింది 


నీ పేరే తపిస్తూ..  జపిస్తూ..  జపిస్తా జపిస్తా


సుజాతా.. హహహా.. ఐ లవ్ యూ సుజాతా
నిజంగా .. ఉమ్మ్.. ఉమ్మ్ .. ఐ లైక్ యూ సుజాతా




చరణం 2 : 


కొంటెగా క్రీగంటితో నా ఒంటిపై వాలకు
వెంటనే నీ జంటగా జేగంటగా మ్రోగనా
కొంటెగా క్రీగంటితో నా ఒంటిపై వాలకు
వెంటనే నీ జంటగా జేగంటగా మ్రోగనా



నీలో ఏదో నాదం ఉంది నన్నే గానం చేసింది 
నీలో ఏదో బంధం ఉంది నన్నే బందీ చేసింది


నే నిన్నే వరించా.. వరించా.. వరించి తరించా



సుజాతా..హహహా..  ఐ లవ్ యూ సుజాతా
నిజంగా..ఉ..ఉ..ఉమ్మ్.. ఐ లైక్ యూ సుజాతా
ఐ లవ్ యూ సుజాతా.. సుజాతా.. సుజాతా.. సుజాతా


సుజాతా..హహహా..  ఐ లవ్ యూ సుజాతా
నిజంగా..ఉ..ఉ..ఉమ్మ్.. ఐ లైక్ యూ సుజాతా




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5062

Monday, March 28, 2016

గోపీలోల... నీ పాల పడ్డామురా



చిత్రం : లేడీస్ టైలర్ (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు, శైలజ 


పల్లవి :


గోపీలోల.. నీ పాల పడ్డామురా
లీలాలోల.. అల్లాడుతున్నామురా
చనీళ్లలో ఉన్నామురా... చిన్నరులం మన్నించరా 


భామా భామా... తీరాన్ని చేరాలమ్మా
పరువేకోరి... చెయ్యెత్తి మొక్కాలమ్మా
అందాక మీ అందాలకు.. ఆ దిక్కులే దిక్కమ్మలూ 


గోపీలోల... నీ పాల పడ్డామురా 




చరణం 1 :



జాలిమాలిన ఈ గాలీ.. తేరిపార చూసే రేపే ఈల
మావిమాటున దాగుంటే.. గువ్వలు చూసి నవ్వే గోల 


తరుణి రో.....కరుణతో మోక్షం చూపే.. కిరణమై నిలిచానే
తనువుతో పుట్టే మాయను.. తెలుపగా పిలిచానే
మోక్షం కన్నా.. మానం మిన్న
నిన్ను నన్ను కన్నులు మూసేనా


గోపీలోల.. నీ పాల పడ్డామురా
భామా భామా.. తీరాన్ని చేరాలమ్మా
చనీళ్లలో ఉన్నామురా.. చిన్నరులం మన్నించరా ..
గోపీలోల.. నీ పాల పడ్డామురా 



చరణం 2 :


వాడిపొనీ సిరులెన్నో.. పూలు పూచేటి కొమ్మ రెమ్మ గుమ్మ
నేను కోరే ఆ తారా..  ఏది మీలోన భామా భామా భామా


తగదు రా.....ఇది మరీ సోద్దెం కాదా.. సొగసరీ గోవిందా
అందరూ నీ వారేగా.. ఒకరితూ ముడి ఉందా..


చూసే కలలూ.. ఎన్నో ఉన్నా.. చూపే హృదయం ఒకటే ఉందమ్మ


గోపీలోల.. నీ పాల పడ్డామురా
లీలాలోల... అల్లాడుతున్నామురా
చనీళ్లలో ఉన్నామురా... చిన్నరులం మన్నించరా ..
అందాక మీ అందాలకు... ఆ దిక్కులే దిక్కమ్మలూ 


భామా భామా... తీరాన్ని చేరాలమ్మా
పరువే కోరి... చెయ్యెత్తి మొక్కాలమ్మా 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11506

Monday, November 30, 2015

నీవే కదా నా అందాలరాశి

చిత్రం :  అందాల రాశి (1980)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  బాలు,  శైలజ




పల్లవి:


నీవే కదా నా అందాలరాశి..
నీవే కదా నా అందాలరాశి.. 


నా జీవనాధారా లావణ్య సరసి..
నా జీవనాధారా లావణ్య సరసి..  

నీ హృదయ గగనాన వెలిగే శశి..
నీ హృదయ గగనాన వెలిగే శశి..


నిను కోరి దరి జేరే నీ ప్రేయసి..
నిను కోరి దరి జేరే నీ ప్రేయసి..  


నీవే కదా నా అందాలరాశి..
నీవే కదా నా అందాలరాశి.. 



చరణం 1 :


వేయి కనులతో వెతికేను నీ రూపమే...
వేయి కనులతో వెతికేను నీ రూపమే...


కోటి గొంతులతో పలికేను నీ గీతమే..
కోటి గొంతులతో పలికేను నీ గీతమే..


కలలన్నీ కర్పూర శిలలైన చోటా..
కలలన్నీ కర్పూర శిలలైన చోటా..


కలసినది మన విడిపోని జంట...


నీవే కదా నా అందాలరాశి..
నిను కోరి దరి జేరే నీ ప్రేయసి
నీవే కదా నా అందాలరాశి.. 




చరణం 2 :



ఎన్ని జన్మల చెలిమి ఎనలేని అనురాగము...
ఎన్ని జన్మల చెలిమి ఎనలేని అనురాగము...

ఎన్ని నోముల కలిమి నీ ప్రణయ సౌభాగ్యము..
ఎన్ని నోముల కలిమి నీ ప్రణయ సౌభాగ్యము..


నీ వలపు నా ఇంట నెలకొన్న తులసి..
నీ వలపు నా ఇంట నెలకొన్న తులసి..


నా మనసు ప్రియ చరణాల దాసి..
నా మనసు ప్రియ చరణాల దాసి.. 





నీవే కదా నా అందాలరాశి..
నీవే కదా నా అందాలరాశి.. 


నా జీవనాధారా లావణ్య సరసి..
నా జీవనాధారా లావణ్య సరసి.. 


నీ హృదయ గగనాన వెలిగే శశి..
నీ హృదయ గగనాన వెలిగే శశి..


నిను కోరి దరి జేరే నీ ప్రేయసి
నిను కోరి దరి జేరే నీ ప్రేయసి
నీవే కదా నా అందాలరాశి.. 







Thursday, October 16, 2014

రామా కనవేమిరా

చిత్రం :  స్వాతిముత్యం (1986)

సంగీతం :  ఇళయరాజా

నేపథ్య గానం :  బాలు,  శైలజ  


పల్లవి :


రామా కనవేమిరా....

రామా కనవేమిరా... శ్రీ రఘురామ కనవేమిరా ఆ ఆ ఆ......

రామా కనవేమిరా...

రమణీ లలామ... నవ లావణ్య సీమ

ధరాపుత్రి.. సుమ గాత్రి

ధరాపుత్రి సుమ గాత్రి ... నడయాడి రాగా

రామా కనవేమిరా


సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని

సభాసదులందరు పదే పదే చూడగా

 శ్రీరామ చంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట 

తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు

రామా కనవేమిరా...

రామా కనవేమిరా... శ్రీ రఘురామ కనవేమిరా ఆ ఆ ఆ...

రామా కనవేమిరా...

 

రమణీ లలామ నవ లావణ్య సీమ....  ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

రమణీ లలామ నవ లావణ్య సీమ

ధరాపుత్రి.. సుమ గాత్రి

ధరాపుత్రి సుమ గాత్రి...  నడయాడి రాగా

రామా కనవేమిరా...


చరణం 1 :


ముసిముసి నగవుల రసిక శిఖామణులు

సా ని ద మ ప మ గ రి స

ఒసపరి చూపుల అసవిష   విక్రములు

స గ రి గ మ ని ద మ ని ని

ముసిముసి నగవుల రసిక శిఖామణులు.. తా తకిట తక జణుత

ఒసపరి చూపుల అసవిష  విక్రములు

తకజణు తకధిమి తక

మీసం మీటే రోష పరాయణులు నీ ద మ ప మా గ రి గ మ

మా సరి ఎవరను మత్త గుణొల్వణులూ...  ఆహ

క్షణమే.. ఒక దినమై.. నిరీక్షణమే... ఒక యుగమై

తరుణి వంక శివ..  ధనువు వంక.. తమ తనువు మరచి కనులు తెరచి చూడగ


రామా కనవేమిరా... కనవేమిరా...


చరణం 2 :

ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన దొరలు.. భూ వరులు

తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు

ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన దొరలు.. భూ వరులు

తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు.. అహ గుండెలు జారిన విభులు

విల్లెత్తాలేక మొగమెత్తాలేక సిగ్గేసిన నరపుంగవులు

తమ ఒళ్ళు ఒరిగి రెండు కళ్ళు తిరిగి... వొగ్గెసిన పురుషాద్గణులు


ఎత్తే వారు లేరా.. అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా...

ఎత్తే వారు లేరా.. అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా..

అరెరె ఎత్తే వారు లేరా.. అ... విల్లు ఎక్కు పెట్టే వారు లేరా..

అహ ఎత్తే వారు లేరా ... అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా

తకద తైయ్యకు తా ధిమి తా..


చరణం 2 :


రామాయ.. రామభద్రాయ.. రామచంద్రాయ నమః


అంతలో రామయ్య లేచినాడు.. ఆ వింటి మీద చెయ్యి వేసినాడు

అంతలో రామయ్య లేచినాడు... ఆ వింటి మీద చెయ్యి వేసినాడు

సీతవంక ఓరకంట చూసినాడు... సీతవంక ఓరకంట చూసినాడు

ఒక్క చిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు

చిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు

పెళ పెళ పెళ పెళ పెళ పెళ పెళవిరిగెను శివధనువుకళలొలికెను సీతానవవధువు

జయజయరామ రఘుకులసోమా

జయజయరామ రఘుకులసోమా

దశరధరామా దైత్యవిరామా

దశరధరామా దైత్యవిరామా

జయజయరామ రఘుకులసోమా

దశరధరామా దైత్యవిరామ


సీతాకల్యాణ వైభోగమే... శ్రీరామ కల్యాణ వైభోగమే

సీతాకల్యాణ వైభోగమే... శ్రీరామ కల్యాణ వైభోగమే

కనగ కనగ కమనీయమే... అనగ అనగ రమణీయమే

కనగ కనగ కమనీయమే... అనగ అనగ రమణీయమే

సీతాకల్యాణ వైభోగమే... శ్రీరామ కల్యాణ వైభోగమే


రామయ్య.. అదుగోనయ్య..

రమణీ లలామ... నవ లావణ్య సీమ

ధరాపుత్రి సుమ గాత్రి.. నడయాడి రాగా

రామా కనవేమిరా... శ్రీ రఘురామ కనవేమిరా...

రామా కనవేమిరా...



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=5648

పట్టుసీర తెస్తనని

చిత్రం :  స్వాతిముత్యం (1986)

సంగీతం :  ఇళయరాజా

నేపథ్య గానం :  బాలు,  శైలజ  




పల్లవి :



పట్టుసీర తెస్తనని..ఈ..ఈ..ఈ

పట్టుసీర తెస్తనని పడవేసికెళ్ళిండు మావ

పట్టుసీర తెస్తనని పడవేసికెళ్ళిండు మావ

గట్టుసేరే దాకా అట్టగే ఉండు

పట్టపగలల్లే ఓ సందమావాఁ

పట్టపగలల్లే ఓ సందమావాఁ

తననన నానా తానాని నన

తననన..



చరణం 1 :




 తాళిబొట్టు తెస్తనని తాళ్ళరేవుకెళ్ళిండు మావా

తాళిబొట్టు తెస్తనని తాళ్ళరేవుకెళ్ళిండు మావా

 

ఆలినయ్యే దాకా యెల్లిపోమాకా

ఎన్నెల్లమ్మ తోడు సందమావాఁ

ఎన్నెల్లమ్మ హొయ్ తోడు సందమావాఁ

ఎన్నెలమ్మ.. అబ్బ..స్స్