Wednesday, June 26, 2019

శ్రావణ సంధ్యా రాగం

చిత్రం : రావణబ్రహ్మ (1986)
సంగీతం :  
జె.వి. రాఘవులు  

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :


శ్రావణ సంధ్యా రాగం.. నా జీవన వీణా గానం
శ్రావణ సంధ్యా రాగం.. నా జీవన వీణా గానం
సరసాల సరిగమలెన్నో... విసిరింది నీలో అందం
పరువాల ఘుమఘుమలన్నీ.. ఇక పైన నాకే సొంతం
శ్రావణ సంధ్యా రాగం.. నా జీవన వీణా గానం



చరణం 1 :


వచ్చేవచ్చే ఒక హేమంతం... ఒళ్లోకొచ్చే ఒక సౌందర్యం
ఆ.. ఆ.. ఆ.. ఆ..
నాలో పొంగే ఒక అనురాగం... తొలి కౌగిళ్లల్లో చలి సంగీతం
పొగమంచు పొదరిల్లైతే... చలిమంటతో అనుబంధం
ఆ.. అ..  ఆ... ఆ.. ఆ.. ఆ..
పొగమంచు పొదరిల్లైతే... చలిమంటతో అనుబంధం
హరివిల్లు ఇలకే వస్తే... అది నీకు నా ప్రియ హారం


శ్రావణ సంధ్యా రాగం.. నా జీవన వీణా గానం
శ్రావణ సంధ్యా రాగం.. నా జీవన వీణా గానం



చరణం 2 :



వచ్చేవచ్చే ఒక వైశాఖం.. మళ్ళీ వచ్చే ఒక మధుమాసం
ఓ..ఓ.. విచ్చే నీలో ఒక మందారం.. మనసిచ్చే నాకే తన సిందూరం
చిరునవ్వు సిగమల్లైతే... సిగమాయకే సింగారం
 ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ..
చిరునవ్వు సిగమల్లైతే...  సిగమాయకే సింగారం
తిలకాల జలకాలాడే మన బంధమే సంసారం



శ్రావణ సంధ్యా రాగం.. నా జీవన వీణా గానం
సరసాల సరిగమలెన్నో... విసిరింది నీలో అందం
పరువాల ఘుమఘుమలన్నీ.. ఇక పైన నాకే సొంతం
ఉమ్మ్హ్..ఉహ్మ్మ్మ్ ఉహ్మ్.. 






3 comments:

  1. చాలా మంచిపాటను (నాకు) పరిచయం చేశారు. బహుశా ఈ పాట మరియు 'బందిపోటు' చిత్రంలోని 'ఊహలు గుసగుసలాడె' పాట ఒకే రాగాన (మధుకౌన్స్) ఉన్నాయి కాబోలు.

    స్వర-రచయిత మరియు గీత-రచయిత ల పేర్లు, అటు-ఇటు ఐనట్టు వున్నాయి అండీ. సరిచూడగలరు. ధన్యవాదాలు.

    ReplyDelete
  2. ధన్యవాదాలు అండీ!
    నా క్రిత వ్యాఖ్యలో మరొక విషయం పంచుకోవడం మరిచాను.
    అది ఏమంటే, ఈ గీత చరణాలలో వినిపించే humming, 'పెళ్లిసందడి' చిత్రంలో కీరవాణిగారు చంద్రకౌన్స్ రాగంలో బాణీ కట్టిన 'సౌందర్యలహరి...' అన్న గీత పల్లవికి ముందు వచ్చే ఆలాపన, ఒకేలా అనిపిస్తాయి కదూ!

    అభినందనలతో
    మహేష్ ఆదిరాజు

    ReplyDelete