Tuesday, March 31, 2020

నువ్వే కావాలి నాతో రావాలి

చిత్రం :  అమ్మ నాన్న (1975)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత :  సినారె
నేపథ్య గానం :  బాలు, సుశీల
 



పల్లవి : 


నువ్వే కావాలి నాతో రావాలి
నువ్వే కావాలి నాతో రావాలి... అందాల తీరాలదాక
జతగా ఉండాలి.. బ్రతుకే పండాలి ఏడేడు జన్మల దాకా


నువ్వే కావాలి నాతో రావాలి... అందాల తీరాలదాక
జతగా ఉండాలి.. బ్రతుకే పండాలి ఏడేడు జన్మల దాకా


అహాహా ఆ... ఆ... హా.. ఓహొహో..ఓ...ఓ..ఓ... 



చరణం 1 :


నువ్వు  చెలరేగే  సెలయేరువైతే... నేను కెరటంలా నీతో ఉంటా
నువ్వు  ఉదయించే నెలవంకవైతే... నేను కిరణంలా నీతో ఉంటా


నా వెలుగు నీవైతే... నీ పరుగు నేనైతే
సంద్రాలు దాటి.. శిఖరాలు దాటి...
ఎగిరేము గగనాల దాకా
అహాహా ఆ... ఆ... హా.. ఓహొహో..ఓ...ఓ..ఓ... 


నువ్వే కావాలి నాతో రావాలి... అందాల తీరాలదాక
జతగా ఉండాలి.. బ్రతుకే పండాలి ఏడేడు జన్మల దాకా


చరణం 2 :


నువ్వు పరువాలా విరజాజివైతే... నేను చిరుగాలినై నీతో ఆడతా
నువ్వు మనసైనా చిరుగాలివైతే... నేను వేణువునై నీతో పాడతా


నా పాట నీవైతే... నీ ఆట నేనైతే
దేహాలు మరచి... లోకాలు మరచి
సాగేము స్వర్గాల దాకా

అహాహా ఆ... ఆ... హా.. ఓహొహో..ఓ...ఓ..ఓ... 

నువ్వే కావాలి నాతో రావాలి... అందాల తీరాలదాక
జతగా ఉండాలి.. బ్రతుకే పండాలి ఏడేడు జన్మల దాకా



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4112

No comments:

Post a Comment