Tuesday, March 31, 2020

కురిసే చినుకుల గుసగుసలు

చిత్రం :  అమ్మ నాన్న (1975)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత :  సినారె
నేపథ్య గానం :  బాలు, సుశీల 

పల్లవి : 

కురిసే చినుకుల గుసగుసలు... అవి మదిలో మెరిసే కోరికలు
ఆ కోరికలన్నీ తీరం చేరే తీయని వేళా... ఆ.. ఆ... ఆ..ఈ తీయని వేళా

చరణం 1 :

మనసే ఒక ఆకాశమై... అనురాగమే నీలిమేఘమై
మనసే ఒక ఆకాశమై... అనురాగమే నీలిమేఘమై
ఆ తొలకరి తలపుల జల్లులలో...
ఆ తొలకరి తలపుల జల్లులలో... మన కలలే విరిసే వేళా
ఈ తీయని వేళా

కురిసే చినుకుల గుసగుసలు... అవి మదిలో మెరిసే కోరికలు

ఆ కోరికలన్నీ తీరం చేరే తీయని వేళా... ఆ.. ఆ... ఆ..ఈ తీయని వేళా

చరణం 2 :

వయసే నవ వసంతమై... తొలివలపులే పూల తీవెలై...
వయసే నవ వసంతమై... తొలివలపులే పూల తీవెలై
ఆ పరిమళ లహరుల దారులలో...
ఆ పరిమళ లహరుల దారులలో...
మన బ్రతుకే సాగే వేళా.. ఈ తీయని వేళా

కురిసే చినుకుల గుసగుసలు... అవి మదిలో మెరిసే కోరికలు

ఆ కోరికలన్నీ తీరం చేరే తీయని వేళా... ఆ.. ఆ... ఆ..ఈ తీయని వేళా

ఈ తీయని వేళా... ఈ తీయని వేళా

https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4114

No comments:

Post a Comment