Tuesday, May 26, 2020

మా చల్లని ఇల్లు మమతల పుట్టిల్లు.

చిత్రం : హంతకులు వస్తున్నారు జాగ్రత్త (1966)
సంగీతం : విజయ కృష్ణమూర్తి
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : సుశీల 



పల్లవి :


మా చల్లని ఇల్లు...  మమతల పుట్టిల్లు..
మా చల్లని ఇల్లు...  మమతల పుట్టిల్లు
మా ఇంటను విరిసెనులే మాయని హరివిల్లు


మా చల్లని ఇల్లు...  మమతల పుట్టిల్లు


చరణం 1 :


కోదండ రామునిలా ఆదుకొను అన్నయ్యా
మాపాలి జానకియై కాపాడు వదినమ్మా
కోదండ రామునిలా ఆదుకొను అన్నయ్యా..
మాపాలి జానకియై కాపాడు వదినమ్మా 


దైవమే తానుగా దీవించు మా నాన్నా
దైవమే తానుగా దీవించు మా నాన్నా

మా ఇల్లె నందనం... ఆనంద మదిరం... ఆనంద మదిరం


మా చల్లని ఇల్లు...  మమతల పుట్టిల్లు
మా చల్లని ఇల్లు...  మమతల పుట్టిల్లు
మా ఇంటను విరిసెనులే మాయని హరివిల్లు


చరణం 2 :


ఈ ఇంట ఇన్నాళ్ళు  తీవనై ఉన్నాను
ఈ నాడు నీలోనా  లీనమౌతున్నాను
ఈ ఇంట ఇన్నాళ్ళు  తీవనై ఉన్నాను
ఈ నాడు నీలోనా లీనమౌతున్నాను 


పూచిన కలలన్నీ... దాచుకొని ఉన్నాను
పూచిన కలలన్నీ... దాచుకొని ఉన్నాను
నా మనసు నీదే... నా తనువు నీదే... నా తనువు నీదే


మా చల్లని ఇల్లు...  మమతల పుట్టిల్లు
మా ఇంటను విరిసెనులే మాయని హరివిల్లు
మా చల్లని ఇల్లు...  మమతల పుట్టిల్లు

No comments:

Post a Comment