Tuesday, May 26, 2020

పల్లవించిన భావాలు

చిత్రం : హంతకులు వస్తున్నారు జాగ్రత్త (1966)
సంగీతం : విజయ కృష్ణమూర్తి
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : సుశీల 


పల్లవి :


పల్లవించిన భావాలు... పరిమళించెను ఈనాడు
తీయగా తీయగా తీయగా విరబూయగా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
అహా హా అహా హా అహా హా ఆ 


పల్లవించిన భావాలు... పరిమళించెను ఈనాడు
తీయగా తీయగా తీయగా విరబూయగా 



చరణం 1 :


నీ నీడలోన సాగి.. నీ కళ్ళలోన దాగి.. నీలోనే ఆగిపోనా
నీ నీడలోన సాగి.. నీ కళ్ళలోన దాగి.. నీలోనే ఆగిపోనా
నీ కోసమే నీ కోసమే... లోకాలు దాటిరానా 


పల్లవించిన భావాలు... పరిమళించెను ఈనాడు
తీయగా తీయగా తీయగా విరబూయగా 



చరణం 2 :


తొలిరేయి నిన్ను చూసి.. కలలన్నిచేరదీసి.. నిలువెల్ల పొంగిపోనా..
తొలిరేయి నిన్ను చూసి.. కలలన్ని చేరదీసి.. నిలువెల్ల పొంగిపోనా..
నా తోడుగా నీవుండగా... నను నేను మరచిపోనా 


పల్లవించిన భావాలు... పరిమళించెను ఈనాడు
తీయగా తీయగా తీయగా విరబూయగా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..



No comments:

Post a Comment