Sunday, June 28, 2020

ఎంత తియ్యని మాట

చిత్రం : చల్ మోహన రంగ (1978)
సంగీతం : బి.శంకర్ (ఘజల్ శంకర్)
గీతరచయిత : జాలాది
నేపధ్య గానం :  సుశీల 

పల్లవి :

ఎంత తియ్యని మాట తలచుకుంటే చాలు పులకింతలే పూచెేరా
కొత్త కొత్త వయసు పైటంతా పాకంగా పురివిప్పి ఆడేనురా
ఇక ఆగలేను నేనింకా ఓలాలా ... ఊగింది నా మనసే వుయ్యాలా

ఎంత తియ్యని మాట తలచుకుంటే చాలు పులకింతలే పూచెేరా
కొత్త కొత్త వయసు పైటంతా పాకంగా పురివిప్పి ఆడేనురా
ఇక ఆగలేను నేనింకా ఓలాలా... హా ఊగింది నా మనసే వుయ్యాలా

చరణం 1 :

మనసైనవాడే వరసైనాడని స్వప్నాల విహరించినా
కన్నె మనసే నీకు కానుకయ్యిందని పువ్వు పువ్వుకు చెప్పనా
ఉన్నపాటున నిన్ను పెనవేయేనా... ముద్ధుల్లో మురిపాల ముంచెత్తనా
నా కొంగు చాటున నిన్ను  దాచెయ్యనా 

ఎంత తియ్యని మాట తలచుకుంటే చాలు పులకింతలే పూచెేరా
కొత్త కొత్త వయసు పైటంతా పాకంగా పురివిప్పి ఆడేనురా
ఇక ఆగలేను నేనింకా ఓలాలా... హా ఊగింది నా మనసే వుయ్యాలా

చరణం 2 :

ఆనాడు వద్దంటే పైపైకి వచ్చావు... ఈనాడు ఏమాయారా
అసలైన వగలేమో బుసకొట్టి కసిరేపె ఇక సైపకున్నానురా
వలపంతా రంగరించి కలబోయరా... చెలరేగి  స్వర్గాలు చూపించరా

ఎంత తియ్యని మాట తలచుకుంటే చాలు పులకింతలే పూచెేరా
కొత్త కొత్త వయసు పైటంతా పాకంగా పురివిప్పి ఆడేనురా
ఇక ఆగలేను నేనింకా ఓలాలా... హా ఊగింది నా మనసే వుయ్యాలా

No comments:

Post a Comment