చిత్రం : ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య (1982)
సంగీతం : జె.వి. రాఘవులు
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
వచ్చే వచ్చే వాన జల్లు... జాల్మదియేలో
గుచ్చే గుచ్చే రేగు ముల్లు... జాల్మదియేలో
జాల్మదియేలో ... జాల్మదియేలో ... జాల్మదియేలో
పాడండి...
వచ్చే వచ్చే వయసు బొమ్మా... జాల్మదియేలో
విచ్చే విచ్చే మనసు రెమ్మా... జాల్మదియేలో
రెమ్మా మాటున చిలకమ్మా... జాల్మదియేలో
కమ్మా కమ్మగ పలుకమ్మా... జాల్మదియేలో
వచ్చే వచ్చే వయసు బొమ్మా... జాల్మదియేలో
విచ్చే విచ్చే మనసు రెమ్మా... జాల్మదియేలో
చరణం 1 :
చక్కానమ్మ తానె పక్కాకు రాగానే
మొక్కాజొన్న చేను ఏం చేసే... నిక్కాపొడుచుకొని తేరి చూసే
గున్నాగున్నమ్మ వచ్చి నున్న పున్నమ్మ మెచ్చి
నిన్నే చెరుకొని ఏం చేసే... ఉన్నా ఉన్నదుండి నమిలేసే
కంటి రెప్ప చిటికేసే... కాకిపిల్లా గుటకేసే
కంటి రెప్ప చిటికేసే... కాకిపిల్లా గుటకేసే
కంటి రెప్ప చిటికేసే... కాకిపిల్లా గుటకేసే
ఉమ్మ్మ్.. ఉమ్మ్మ్.. ఉమ్మ్మ్
వచ్చే వచ్చే వయసు బొమ్మా... జాల్మదియేలో
విచ్చే విచ్చే మనసు రెమ్మా... జాల్మదియేలో
చరణం 2 :
కన్నేమో కల్వపిల్ల.. చూపేమో చాపపిల్లా
చిన్నారి నడకే హంసపిల్లా.. కోనంగి మనసే కోతిపిల్లా
చెట్టూ చాటెందుకింక.. సిగ్గు మాటెందుకింక
చెట్టాపట్టాలు వేసుకోరాదా... చెంగూన కట్టేసుకోరాదా
జోడు కుదిరెను ఇద్దరికీ... తాళమున్నది మద్దెలకి
జోడు కుదిరెను ఇద్దరికీ... తాళమున్నది మద్దెలకి
వచ్చే వచ్చే వయసు బొమ్మా... జాల్మదియేలో
విచ్చే విచ్చే మనసు రెమ్మా... జాల్మదియేలో
రెమ్మా మాటున చిలకమ్మా... జాల్మదియేలో
కమ్మా కమ్మగ పలుకమ్మా... జాల్మదియేలో
వచ్చే వచ్చే వయసు బొమ్మా... జాల్మదియేలో
విచ్చే విచ్చే మనసు రెమ్మా... జాల్మదియేలో
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9309
No comments:
Post a Comment