Wednesday, July 1, 2020

అద్దంలాంటి చెక్కిలి చూసి

చిత్రం : నిండు హృదయాలు  (1969)
సంగీతం : టి. వి. రాజు
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : ఘంటసాల, సుశీల   


పల్లవి : 


అద్దంలాంటి చెక్కిలి చూసి ముద్దొస్తుందంటావా
చెంపకు చేరెడు కళ్ళను చూసి చెంతకొస్తానంటావా
అమ్మమ్మో... ఓయమ్మో ...
అమ్మమ్మో... సోగ్గాడా... వచ్చావా మావాడా


చరణం 1 :



కాలిలో మువ్వలుఘల్లంటున్నాయి
మోవిలో నవ్వులు ఝిల్లంటున్నాయి
కాలిలో మువ్వలుఘల్లంటున్నాయి
మోవిలో నవ్వులు ఝిల్లంటున్నాయి



మెత్తగా....
మెత్తగా సోకిందంటే నీ చేయి
మత్తుగా చిత్తైపోవును ఈ రేయి
ఆ.. ఆ.. ఆ..
ఎంతటి రసికుడవో ఇపుడే...ఇపుడే తెలిసిందీ
ఆ.. ఆ.. ఆ..
మధుపాత్రకు ఏనాడో మాసంగతి తెలిసింది
ఆ.. ఆ.. ఆ..ఆ.. ఆ.. ఆ..


అద్దంలాంటి చెక్కిలి చూసి అల్లాడిపోయాము
చెంపకు చారెడు కళ్ళను చూసి చిత్తైపోతున్నాము
అమ్మమ్మో... ఓయమ్మో
అమ్మమ్మో... నీతోడు ఓయమ్మో... ఇటు చూడు


చరణం 2 : 

చూపులో మైకం ఇంకా రావాలి... కైపులో పాకం ఇంకా కావాలి                                                       చూపులో మైకం ఇంకా రావాలి... కైపులో పాకం ఇంకా కావాలి
గుండెలో...
గుండెలో గుసగుసలేవో నిండాలి
దండలో ఘుమఘుమలెన్నో పండాలి
ఇంతకు మించిన తరుణం ఇంకేన్నడు రాదు
మనసుంటే అనుకుంటే మళ్ళీ రాకపోదు 


అద్దంలాంటి చెక్కిలి చూసి ముద్దొస్తుందంటావా
చెంపకు చేరెడు కళ్ళను చూసి చెంతకొస్తానంటావా

అమ్మమ్మో... సోగ్గాడా... వచ్చావా మావాడా

No comments:

Post a Comment