చిత్రం : అల్లరి వయసు (1979) సంగీతం : జె.వి. రాఘవులు గీతరచయిత : నేపథ్య గానం : బాలు, శోభా శేఖర్
పల్లవి :
ఎదలో జీవన రాగాల వీణా ఎదుటే ఆమని అందాల జాణా ఇది కన్ను కన్ను కలసిన కళ్యాణి రాగం నిన్ను నన్ను కలిపిన అనురాగ యోగం మది కోవెలగా... నిను దేవతగా నిలుపుకున్న నా వలపు వసంతం
ఎదలో జీవన రాగాల వీణా ఎదుటే ఆమని అందాల జాణా
చరణం 1 :
కన్నీటి విడుపు నీ కన్నెతనానికి... వీడుకొలుపులని తెలుసు ఆ జిలుగు పైటలో వొదుగు సొగసు... నా ముద్దు ముడుపుకని తెలుసు అరుణోదయాల కిరణకాంతి నే దిద్దు తిలకమని తెలుసు అరుణోదయాల కిరణకాంతి నే దిద్దు తిలకమని తెలుసు ఇంత తెలిసి జంట కలిసి.. ఎందుకే వగపు నేనున్నది నీ కొరకు
ఎదలో జీవనరాగాల వీణా... ఎదుటే ఆమని అందాల జాణా
చరణం 2 :
ప్రేమ పలుకుల రామ చిలుకలే పెళ్లి మంత్రమే చదువగా కొమ్మకొమ్మలో కోయిలమ్మలే సన్నాయి పాటలే పాడగా తనువులు కలిసిన శుభతరుణాలే మనువైపోయిన ముహూర్తాలుగా తనువులు కలిసిన శుభతరుణాలె మనువైపోయినముహూర్తాలుగా ఏడుజన్మల తోడు నేనై వుండనా నేనే నూరేళ్లు నీలోనే
ఎదలో జీవన రాగాల వీణా ఎదుటే ఆమని అందాల జాణా ఇది కన్ను కన్ను కలసిన కళ్యాణి రాగం నిన్ను నన్ను కలిపిన అనురాగ యోగం మది కోవెలగా నిను దేవతగా నిలుపుకున్న నా వలపు వసంతం
No comments:
Post a Comment