Thursday, July 23, 2020

ఒక మనసు పాడితే

చిత్రం : మోహన రాగం (1979)
సంగీతం :  మాస్టర్ వేణు
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : సుశీల 



పల్లవి : 


ఒక మనసు పాడితే మోహనరాగం
రెండు హృదయాలు కూడితే జీవనరాగం
ఒక మనసు పాడితే...  


చరణం 1 :


గగనాన సాగినప్పుడే జాబిల్లికి అందం
సిగలోనా చేరినప్పుడే సిరిమల్లెకి అందం
తగిన జత ఉన్నప్పుడే తరుణి వయసుకు అందం


ఒక మనసు పాడితే మోహనరాగం
రెండు హృదయాలు కూడితే జీవనరాగం
ఒక మనసు పాడితే...  


చరణం 2 :


నీలిమబ్బు కురవాలన్నా చలిగాలి తాకాలి
ఏ వీణ పలకాలన్నా కొనగోట మీటాలి
కలలేవి పండాలన్నా వలచే కనులు కావాలి


ఒక మనసు పాడితే మోహనరాగం
రెండు హృదయాలు కూడితే జీవనరాగం
ఒక మనసు పాడితే..



చరణం 3 :


మదిలోని కోరికలన్నీ పదముల పలికెనులే
అనురాగదీపికలన్నీ స్వరములై వెలిగెనులే
నీ బంగరు అడుగుల కోసం నా ముంగిలి వేచెనులే


ఒక మనసు పాడితే మోహనరాగం
రెండు హృదయాలు కూడితే జీవనరాగం
ఒక మనసు పాడితే..




No comments:

Post a Comment