Wednesday, July 22, 2020

మసకమసక చీకట్లో

చిత్రం : మరో సీత కథ (1979)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : సుశీల 



పల్లవి : 


మసకమసక చీకట్లో ముసిముసిముసి నవ్వుల్తో
మసకమసక చీకట్లో ముసిముసిముసి నవ్వుల్తో
మిసమిసమిసలాడే నన్ను కసికసిగా చూడకు బాబు
రా... నిశి రాత్రికే నీదాన్నిరా


మసకమసక చీకట్లో ముసిముసిముసి నవ్వుల్తో
మసకమసక చీకట్లో ముసిముసిముసి నవ్వుల్తో
మిసమిసమిసలాడే నన్ను కసికసిగా చూడకు బాబు
రా... నిశి రాత్రికే నీదాన్నిరా
రా ... నిశి రాత్రికే నీదాన్నిరా



చరణం 1 :

                 

సగం చీకటి సగం వెలుతురు.. సగం అందితే సగం అందదు
సగం చీకటి సగం వెలుతురు సగం అందితే సగం అందదు
రారా రా తెలుసుకోరా రారారా తెలుసుకోరా
అందని దాంట్లో అందం వుంది
అందంలోనే బంధం వుంది


నీ చూపులు నీ కైపులు నాకోసమేరా
నీ ఆశలు నీ మోజులు నామీదనేరా
అరె రా నిశి రాత్రికే నీదాన్నిరా
అరె రారా నిశి రాత్రికే నీదాన్నిరా 



చరణం 2 :



సగం రేయిలో జగం సోలితే సుఖం వున్నది ఖుషీ వున్నది
సగం రేయిలో జగం సోలితే సుఖం వున్నది ఖుషీ వున్నది
రారారా కలుసుకోరా రారారా కలుసుకోరా
మెరిసేకళ్లు రమ్మంటున్నాయి
ఆడేకాళ్లు లెమ్మంటున్నాయి
ఈ కన్యమే ఈ నాట్యమే నీకోసమేరా
ఈ పొంగులు ఈ హంగులు నీకోసమేరా

అరె రా నిశి రాత్రికే నీదాన్నిరా
అరె రారా నిశి రాత్రికే నీదాన్నిరా
మసకమసక చీకట్లో ముసిముసిముసి నవ్వుల్తో
మసకమసక చీకట్లో ముసిముసిముసి నవ్వుల్తో
మిసమిసమిసలాడే నన్ను కసికసిగా చూడకు బాబు
రా నిశి రాత్రికే నీదాన్నిరా

No comments:

Post a Comment