Monday, July 27, 2020

భారత దేశపు భావి పౌరులం

చిత్రం : పునాదిరాళ్ళు (1979)
సంగీతం :  ప్రేమ్‌జీ
గీతరచయిత : జాలాది
నేపథ్య గానం :  బాలు



పల్లవి : 


భారత దేశపు భావి పౌరులం
భవితవ్యాన్ని భాగస్వాములం
బాధ్యతనెరిగి బ్రతికే వాళ్ళం
భావితరానికి పునదిరాళ్ళం
భావితరానికి పునదిరాళ్ళం



చరణం 1 :


కార్మిక కర్షక శ్రామిక జీవులు
మనదేశానికి వెన్నుపూసలు
వారి రక్షణే దేశ రక్షణ
వారి పరిశ్రమే మన జీవనము
వారి పరిశ్రమే మన జీవనము


విజ్ఞానానికి ఉపాధ్యాయులు

ప్రజా సేవకై యన్ జి ఓ లు
ఐకమత్యతకు నాయకత్వము
వారి పరీశ్రమె దేశ పురోగతి
వారి పరీశ్రమె దేశ పురోగతి


స్వార్ధపరులకు సాయపడుటకై
సమ్మెలు సవాళ్లు చేయం చేయం
ప్రతిపని కోసం ప్రభుత్వమనక
ప్రజాశక్తిని కలుపుట న్యాయం
ప్రజాశక్తిని కలుపుట న్యాయం


సోమరితనముకు సమాధి కట్టి
సహకారంతో సాధన చేసి
స్వాతంత్రాన్ని నిలబెడదాం
సమ సమాజమే సాధిద్దాం
సమ సమాజమే సాధిద్దాం


భారత దేశపు భావి పౌరులం
భవితవ్యాన్ని భాగస్వాములం
బాధ్యతనెరిగి బ్రతికే వాళ్ళం
భావితరానికి పునదిరాళ్ళం
భావితరానికి పునదిరాళ్ళం



చరణం 2 :  



మనం మనం ఒక తల్లి బిడ్డలం
అనం అనం నేను నాదని
పదం పదం కలుపుదాం
ప్రగతిపధంలో పయనిద్దాం
ప్రగతిపధంలో పయనిద్దాం


తరం తరం కలవాలని
నిరంతరం నిలవాలని
వేద్దాం పదండి వెలుగు బాటకు
కదలని చెదరని పునాది రాళ్ళు
కదలని చెదరని పునాది రాళ్ళు


భారత దేశపు భావి పౌరులం
భవితవ్యాన్ని భాగస్వాములం
బాధ్యతనెరిగి బ్రతికే వాళ్ళం
భావితరానికి పునదిరాళ్ళం
భావితరానికి పునదిరాళ్ళం


వందేమాతరం... వందేమాతరం
వందేమాతరం... వందేమాతరం




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8713

No comments:

Post a Comment