Showing posts with label సముద్రాల. Show all posts
Showing posts with label సముద్రాల. Show all posts
Tuesday, August 18, 2020
గతిలేని వాణ్ణి
చిత్రం : మనోరమ (1959)
గతిలేని వాణ్ణి గుడ్డివాణ్ణి బాబయ్య
ప్రేమతోడ లోకమేను దేవుడు
చావలేము బతకలేము బాబయ్యా
ఆకలి చికాకుతోడ వేగుతూ...
గంజికొక్క ధర్మమెయ్యి బాబయ్య
Labels:
(మ),
NTR,
తలత్ మహమూద్,
మనోరమ (1959),
రమేశ్ నాయుడు,
సముద్రాల,
సుశీల
Monday, August 17, 2020
మరచి పోయేవేమో
చిత్రం : మనోరమ (1959)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : సముద్రాల
నేపధ్య గానం : తలత్ మహమూద్, సుశీల
పల్లవి :
మరచి పోయేవేమో మాయని బాసలూ... మనకివే ఓ సఖీ
మరచి పోరాదోయీ చేసిన బాసలూ... ఆశలు మాసినా
చరణం 1 :
వెలిగేను నీ కులుకే నా కన్నుదోయి
మెలిగేను నా మదిలో నీ చెలిమి హాయి
వెలుగొందు ఆ తారలాగా
మాయని బాసలూ మనకివే ఓ సఖీ
మరచి పోరాదోయీ చేసిన బాసలూ ఆశలు మాసినా
చరణం 2 :
విరబూసే ఈ పువ్వు నీ పూజ కొరకే
విసిరేవు దూరముగా వసి వాడునోయీ
నీ దాన ఏనాటికైనా..
మాయనీ బాసలూ మనకివే ఓ సఖా
మరచి పోరాదోయీ చేసిన బాసలూ ఆశలు మాసినా
Labels:
(మ),
NTR,
తలత్ మహమూద్,
మనోరమ (1959),
రమేశ్ నాయుడు,
సముద్రాల,
సుశీల
అందాల సీమా
చిత్రం : మనోరమ (1959)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : సముద్రాల
నేపధ్య గానం : తలత్ మహమూద్
పల్లవి :
అందాల సీమా సుధా నిలయం
ఈ లోకమే దివ్య ప్రేమమయం
అందాల సీమా సుధా నిలయం
ఈ లోకమే దివ్య ప్రేమమయం
చరణం 1 :
వలపేమో తెలియకా తెలవారు బ్రతుకేలా
తొలినాటి ప్రేమలు ఫలమైన కలయైనా
మాయనీ గాయమై మిగిలినా అభినయం
మాయనీ గాయమై మిగిలినా అభినయం
అందాల సీమా సుధా నిలయం
ఈ లోకమే దివ్య ప్రేమమయం
చరణం 2 :
అందాల వెలుగులో అలరారు ఆనందం
అలరించు సొగసులా ఆనందమున తేలే
తీయనీ అనుభవం దేవుని పరిచయం
తీయనీ అనుభవం దేవుని పరిచయం
అందాల సీమా సుధా నిలయం
ఈ లోకమే దివ్య ప్రేమమయం
Labels:
(మ),
NTR,
తలత్ మహమూద్,
మనోరమ (1959),
రమేశ్ నాయుడు,
సముద్రాల
Wednesday, October 28, 2015
చింత చిగురు పులుపనీ
చిత్రం : ఓ సీత కథ (1974)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సముద్రాల
నేపథ్య గానం : బాలు
పల్లవి :
చింత చిగురు పులుపనీ.. చీకటంటే నలుపనీ చెప్పందే తెలియనీ చిన్నపిల్ల
అది చెఱువులో పెరుగుతున్న చేప పిల్ల.. అభం శుభం తెలియని పిచ్చిపిల్ల
చింత చిగురు పులుపనీ.. చీకటంటే నలుపనీ చెప్పందే తెలియనీ చిన్నపిల్ల
అది చెఱువులో పెరుగుతున్న చేప పిల్ల.. అభం శుభం తెలియని పిచ్చిపిల్ల
చరణం 1 :
గట్టు మీద కొంగను చూసి చెట్టు మీద డేగను చూసి
చుట్టమని అనుకుంది చేప పిల్ల పాపం చేప పిల్ల
గట్టు మీద కొంగను చూసి చెట్టు మీద డేగను చూసి
చుట్టమని అనుకుంది చేప పిల్ల.. పాపం చేప పిల్ల
చెంగు చెంగున చెరువు దాటి చెంత నిలిచి
చేయి చాచి చెలిమి చేయ పిలిచింది.. చేప పిల్ల
అభం శుభం తెలియని పిచ్చిపిల్లా
చింత చిగురు పులుపనీ.. చీకటంటే నలుపనీ చెప్పందే తెలియనీ చిన్నపిల్ల
అది చెఱువులో పెరుగుతున్న చేప పిల్ల.. అభం శుభం తెలియని పిచ్చిపిల్ల
చింత చిగురు పులుపనీ.. చీకటంటే నలుపనీ చెప్పందే తెలియనీ చిన్నపిల్ల
అది చెఱువులో పెరుగుతున్న చేప పిల్ల.. అభం శుభం తెలియని పిచ్చిపిల్ల
చరణం 2 :
ఎరవేసిన పిల్లవాడు ఎవరనుకుందో.. ఎగిరి వచ్చి పడ్డది ఆతని ఒడిలో
తుళ్ళి తుళ్ళి ఆడే.. చిలిపి చేప పిల్ల.. తాళి లేని తల్లాయె అమ్మచెల్ల
నాన్న లేని పాపతో నవ్వేలోకంలో.. ఎన్నాళ్ళు వేగేను చేప తల్లి
అభం శుభం తెలియని పిచ్చితల్లి.. పిచ్చితల్లి
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4861
Sunday, January 20, 2013
ఓ తారకా
| చిత్రం: చండీరాణి (1953) సంగీతం: విశ్వనాథన్, రామ్మూర్తి గీతరచయిత: సముద్రాల నేపధ్య గానం: ఘంటసాల, భానుమతి పల్లవి: ఓ తారకా.. ఓ.. ఓ జాబిలీ ..ఓ.. ఓ తారకా.. నవ్వులేల.. ననూగనీ ఓ తారకా నవ్వులేల ననూగనీ ఓ తారకా నవ్వులేల ననూగనీ అందాలు చిందెడి చందమామ నీవని అందాలు చిందెడి చందమామ నీవని ఓ జాబిలీ ..ఓ.. ఆ తారక నవ్వునోయి నినూగనీ చరణం 1: వినువీథిలోని తారాకుమారీ దరిజేరనౌనా ఈ చందమామా చేరువే తారా రేరాజుకు.. ఊ.. ఆ తారకా నవ్వునోయి నినూగనీ అందాలు చిందెడి చందమామ నీవని ఓ జాబిలీ.. ఓ.. ఆ తారకా నవ్వునోయి నినూగనీ చరణం 2: మనోగాథ నీతో నివేదించలేను నివేదించకున్నా.. జీవించలేను ఊ... నెరజాణవేలే ఓ జాబిలీ ఓ.. ఆ తారకా నవ్వునోయి నినూగనీ అందాలు చిందెడి చందమామ నీవని ఓ జాబిలీ.. ఓ.. ఆ తారకా నవ్వునోయి నినూగనీ చరణం 3: తొలిచూపులోని సంకేతమేమో చెలినవ్వులోని ఆ శిల్పమేమో... నీ నవ్వు వెన్నెలే ఓ జాబిలీ..ఓ ఆ తారకా నవ్వునోయి నినూగనీ అందాలు చిందెడి చందమామ నీవని ఓ జాబిలీ.. ఓ.. ఆ తారకా నవ్వునోయి నినూగనీ | |
Subscribe to:
Posts (Atom)