Showing posts with label అగ్గి బరాట (1966). Show all posts
Showing posts with label అగ్గి బరాట (1966). Show all posts

Thursday, March 15, 2018

పలుకవే నా రామచిలుకా

చిత్రం  :  అగ్గి బరాట (1966)
సంగీతం  :  విజయా కృష్ణమూర్తి
గీతరచయిత  :  సినారె
నేపధ్య గానం  :  సుశీల

పల్లవి :

ఉమ్మ్.. ఉమ్మ్.. ఉమ్మ్.. ఉమ్మ్మ్ ఉమ్మ్...
ఉమ్మ్.. ఉమ్మ్.. ఉమ్మ్.. ఉమ్మ్మ్ ఉమ్మ్... 

పలుకవే నా రామచిలుకా... ఆ.. ఆ..
పలుకవే నాలోన పన్నీరు తొణకగా  

పలుకవే నా రామచిలుకా... ఆ.. ఆ..
పలుకవే నాలోన పన్నీరు తొణకగా

చరణం 1 :

పంజరములో నీవు బంధీగ ఉన్నావు....
పంజరములో నీవు బంధీగ ఉన్నావు....
బంగారు మేడలో పవ్వలించితి నేను...
బంగారు మేడలో పవ్వలించితి నేను...

ఈ రేయి తీరెనా ఎగిసిపోయేములే
గగనాల నీడలో తరగిపోయేములే

పలుకవే నా రామచిలుకా... ఆ.. ఆ..
పలుకవే నాలోన పన్నీరు తొణకగా

చరణం 2 :

నా కంటి పాపలో నవ్వులొలికేదెవరో...
నా కంటి పాపలో నవ్వులొలికేదెవరో....
నా కలల దారిలో నడచిపోయేదెవరో...
నా కలల దారిలో నడచిపోయేదెవరో...

ఇంకెవరు కాదులే ఇలలోని నెలరాజే...
నమ్మవే ఓ చెలి...  నాలోని వలరాజే

పలుకవే నా రామచిలుకా... ఆ.. ఆ..
పలుకవే నాలోన పన్నీరు తొణకగా

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=118

Thursday, February 22, 2018

చిరునవ్వులోని హాయి

చిత్రం  :  అగ్గి బరాట (1966)
సంగీతం  :  విజయా కృష్ణమూర్తి
గీతరచయిత  :  సినారె
నేపధ్య గానం  :  సుశీల, ఘంటసాల 

పల్లవి :

చిరునవ్వులోని హాయి... చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి... ఈ నాడు కలిగెనోయి

చిరునవ్వులోని హాయి... చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి... ఈ నాడు కలిగెనోయి

చరణం 1 :

నెలరాజు సైగచేసే... వలరాజు తొంగిచూసే
నెలరాజు సైగచేసే... వలరాజు తొంగిచూసే

సిగపూలలోన నగుమొములోన... వగలేవొ చిందులేసే
సిగపూలలోన నగుమొములోన... వగలేవొ చిందులేసే

చిరునవ్వులోని హాయి... చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి... ఈ నాడు కలిగెనోయి

చరణం 2 :

నయనాల తారవీవే... నా రాజహంస రావే
అహహ..ఆ..ఆ..ఆ..
నయనాల తారవీవే... నా రాజహంస రావే

నను చేరదీసి... మనసార చూసి... పెనవేసి నావు నీవే
నను చేరదీసి... మనసార చూసి... పెనవేసి నావు నీవే

చిరునవ్వులోని హాయి... చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి... ఈ నాడు కలిగెనోయి

చరణం 3 :

పవళించు మేనిలోన... రవళించే రాగవీణ
పవళించు మేనిలోన... రవళించే రాగవీణ

నీలాలనింగి లోలోనపొంగి... కురిపించే పూలవాన
నీలాలనింగి లోలోనపొంగి... కురిపించే పూలవాన

చిరునవ్వులోని హాయి... చిలికించె నేటి రేయి
ఏ నాడులేని హాయి... ఈ నాడు కలిగెనోయి
ఈ నాడు కలిగెనోయి