Showing posts with label ఆర్.సుదర్శనం. Show all posts
Showing posts with label ఆర్.సుదర్శనం. Show all posts

Thursday, August 6, 2015

భారత వీరకుమారిని నేనే




చిత్రం :  సంఘం (1954)
సంగీతం :  ఆర్.సుదర్శనం
గీతరచయిత :  తోలేటి వెంకటరెడ్డి
నేపధ్య గానం : సుశీల



పల్లవి : 

ఆ...ఆఆ... ఆ... ఆఆ...
లల్లా లాల్లలా... లల్లా లాల్లలా...
లల్లా లాల్లలా... లల్లా లాల్లలా...
లాలల లాలల లా లల్లల్లా...


భారత వీరకుమారిని నేనే.. నారీ రతనము నేనే
భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే


భారత వీరకుమారిని నేనే.. నారీ రతనము నేనే
భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే



చరణం 1 :



స్వార్థముతో కులమత భేదముతో..
సతతము పోరే భరతావనిలో శాంతి జ్యోతీ వెలిగిస్తా..
సతతము పోరే భరతావనిలో శాంతి జ్యోతీ వెలిగిస్తా..

కర్షక సౌఖ్యం...
కర్షక సౌఖ్యం...  కార్మిక శ్రేయం..
కర్షక సౌఖ్యం.... కార్మిక శ్రేయం
కలిగే మార్గం చూపిస్తా..ఆ...ఆ
కలిగే మార్గం చూపిస్తా.
..


చరణం 2 :


రాణీ రుద్రమ... మల్లమదేవీ.. రెడ్డినాగమ్మ..  నేనే
రాణీ రుద్రమ.. మల్లమదేవీ..  రెడ్డినాగమ్మ..  నేనే
రణ తిక్కన భార్యా...  సతి మాంచాల
తిక్కన భార్యా...  సతి మాంచాల
శౌర్య ధైర్యములు నావే..
శౌర్య ధైర్యములు నావే.. 


భారత వీరకుమారిని నేనే.. నారీ రతనము నేనే
భారత నారీ అభ్యుదయానికి నాయకురాలిని నేనే..


ఆహో..ఓఓఓ...ఆఅహో..ఆ...ఆ...
ఆహో..ఆ... ఆ.. ...






Monday, September 22, 2014

సుందరాంగ మరువగలేనోయ్

చిత్రం :  సంఘం (1954)
సంగీతం : ఆర్. సుదర్శనం
గీతరచయిత :  తోలేటి
నేపధ్య గానం :  సుశీల, టి. ఎస్. భగవతి 



పల్లవి :



సుందరాంగ మరువగలేనోయ్ రావేలా...
నా అందచందములు దాచితి నీకై... రావేలా...
సుందరాంగ మరువగలేనోయ్ రావేలా...
నా అందచందములు దాచితి నీకై... రావేలా...


ముద్దునవ్వులా మోహనకృష్ణా... రావేలా...
ముద్దునవ్వులా మోహనకృష్ణా... రావేలా...
ఆ నవ్వులలో రాలు సరాగాలు రాగమయ రతనాలూ...
నవ్వులలో రాలు సరాగాలు రాగమయ రతనాలూ...


సుందరాంగ మరువగలేనోయ్ రావేలా...
నా అందచందములు దాచితి నీకై... రావేలా....
 



చరణం 1 :


నీలి కనులలో వాలుచూపుల ఆ వేళా...
నను చూసి కనుసైగ చేసితివోయీ... రావేలా
కాలి మువ్వలా కమ్మని పాటా ఆ వేళా....
కాలి మువ్వలా కమ్మని పాటా ఆ వేళా....


ఆ మువ్వలలో పిలుపు అదే వలపు మురిపెములె కలగలుపూ....
మువ్వలలో పిలుపు అదే వలపు మురిపెములె కలగలుపూ


సుందరాంగ మరువగలేనోయ్ రావేలా...
నా అందచందములు దాచితి నీకై రావేలా...
 



చరణం 2 :



హృదయవీణ తీగలు మీటీ ఆ వేళా...
అనురాగ రసములే చిందితివోయీ.... రావేలా
హృదయవీణ తీగలు మీటీ ఆవేళా....
అనురాగ రసములే చిందితివోయీ.... రావేలా


మనసు నిలువదోయ్ మధువసంతమోయ్ రావేలా....
మనసు నిలువదోయ్ మధువసంతమోయ్ రావేలా..
పువ్వులు వికసించే ప్రకాశించే ప్రేమతో పలవించే...
పువ్వులు వికసించే ప్రకాశించే ప్రేమతో పలవించే


సుందరాంగ మరువగలేనోయ్ రావేలా
నా అందచందములు దాచితి నీకై రావేలా...




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18433

Friday, August 2, 2013

కన్నయ్యా నల్లని కన్నయ్యా

చిత్రం : నాదీ ఆడజన్మే (1965) 
సంగీతం : టి.వి. రాజు 
గీతరచయిత : ఆర్.సుదర్శనం
నేపధ్య గానం : సుశీల 

పల్లవి: 

కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. 
నిన్ను కనలేని కనులుండునా 
కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. 
నిన్ను కనలేని కనులుండునా 
నిన్ను ప్రేమింతురే.. నిన్ను పూజింతురే 
నన్ను గనినంత నిందింతురే 

కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. 
నిన్ను కనలేని కనులుండునా 
నిన్ను ప్రేమింతురే.. నిన్ను పూజింతురే 
నన్ను గనినంత నిందింతురే 
కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. 
నిన్ను కనలేని కనులుండునా..ఆ.. 

చరణం 1: 

గుణమెంత లేనింట పడవైతువా.. నన్ను వెలివేయువారికే బలిచేతువా 
గుణమెంత లేనింట పడవైతువా.. నన్ను వెలివేయువారికే బలిచేతువా 
సిరి జూచుకుని నన్ను మరిచావయా.. 
సిరి జూచుకుని నన్ను మరిచావయా.. మంచి గుడి చూచుకొని నీవు మురిసేవయా 

కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. 
నిన్ను కనలేని కనులుండునా 

చరణం 2: 

బంగారు మనసునే ఒసగినావు.. అందు అందాల గుణమునే పొదిగినావు 
బంగారు మనసునే ఒసగినావు.. అందు అందాల గుణమునే పొదిగినావు 

మోముపై నలుపునే పులిమినావు.. 
మోముపై నలుపునే పులిమినావు.. ఇట్లు నన్నేల బ్రతికించదలచినావు 

కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. 
నిన్ను కనలేని కనులుండునా 
నిన్ను ప్రేమింతురే.. నిన్ను పూజింతురే 
నన్ను గనినంత నిందింతురే 
కన్నయ్యా..ఆ.. నల్లని కన్నయ్యా..ఆ.. 
నిన్ను కనలేని కనులుండునా

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=84