చిత్రం: గమ్యం (2008)
సంగీతం: ఇ.ఎస్.మూర్తి, అనీల్.ఆర్
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: సుజాత
పల్లవి:
సమయమా.. చలించకే... బిడియమా... తలొంచకే....

తీరం ఇలా తనకు తానే..
తీరం ఇలా తనకు తానే...
వెతికి జతకి చేరే క్షణాలలో
సమయమా.. చలించకే... బిడియమా... తలొంచకే....
చరణం 1:
చంటిపాపలా అనుకుంటూ ఉండగానే
చందమామలా కనుగొన్నా గుండెలోనే...
తనలో చిలిపిదనం సిరివెన్నెలే అయ్యేలా
ఇదుగో కలలవనం అని చూపుతున్న లీలలో
సమయమా.. చలించకే... బిడియమా... తలొంచకే....
చరణం 2:
పైడిబొమ్మలా నను చూసే కళ్ళలోనే
ఆడజన్మలా నను గుర్తించాను నేనే
తనకే తెలియదనీ నడకంటే నేర్పుతూనే
నను నీ వెనక రానీ అని వేడుతున్న వేళలో
సమయమా.. చలించకే... బిడియమా... తలొంచకే....
సమయమా.. చలించకే... బిడియమా... తలొంచకే....
Showing posts with label ఇ.ఎస్.మూర్తి. Show all posts

Sunday, December 9, 2012
ఎంతవరకు ఎందుకొరకు
చిత్రం: గమ్యం (2008)
సంగీతం: ఇ.ఎస్.మూర్తి, అనీల్.ఆర్
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: రంజిత్
పల్లవి:
ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతీ చోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా
చరణం 1:
కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు .. అడగరే ఒక్కొక్క అల పేరు
మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు ..పలకరే మనిషి అంటే ఎవరూ
సరిగా చూస్తున్నదా నీ మది మదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టూ అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చూపుల్లో లేదా
మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా

మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై ..నీడలు నిజాల సాక్ష్యాలే
శతృవులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే ..ఋతువులు నీ భావ చిత్రాలే
ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం
మోసం రోషం ద్వేషం నీ మకిలి మతికి భాష్యం
పుట్టక చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ
జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ
తారరరరే తారరరరే తారరరరే తారారరే
తారరరరే తారరరరే తారరేరా రారరరరే

Subscribe to:
Posts (Atom)