చిత్రం: గమ్యం (2008)
సంగీతం: ఇ.ఎస్.మూర్తి, అనీల్.ఆర్
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: సుజాత
పల్లవి:
సమయమా.. చలించకే... బిడియమా... తలొంచకే....
సమయమా.. చలించకే... బిడియమా... తలొంచకే....
తీరం ఇలా తనకు తానే..
తీరం ఇలా తనకు తానే...
వెతికి జతకి చేరే క్షణాలలో
సమయమా.. చలించకే... బిడియమా... తలొంచకే....
చరణం 1:
చంటిపాపలా అనుకుంటూ ఉండగానే
చందమామలా కనుగొన్నా గుండెలోనే...
తనలో చిలిపిదనం సిరివెన్నెలే అయ్యేలా
ఇదుగో కలలవనం అని చూపుతున్న లీలలో
సమయమా.. చలించకే... బిడియమా... తలొంచకే....
చరణం 2:
పైడిబొమ్మలా నను చూసే కళ్ళలోనే
ఆడజన్మలా నను గుర్తించాను నేనే
తనకే తెలియదనీ నడకంటే నేర్పుతూనే
నను నీ వెనక రానీ అని వేడుతున్న వేళలో
సమయమా.. చలించకే... బిడియమా... తలొంచకే....
సమయమా.. చలించకే... బిడియమా... తలొంచకే....
No comments:
Post a Comment