Showing posts with label ఎస్. హనుమంతరావు. Show all posts
Showing posts with label ఎస్. హనుమంతరావు. Show all posts

Thursday, August 30, 2018

అ..అమ్మ ఆ..ఆవు

చిత్రం :  రైతు బిడ్డ (1971)
సంగీతం :  ఎస్. హనుమంతరావు
గీతరచయిత :  సినారె
నేపథ్య గానం :  సుశీల  




పల్లవి : 
   

 

అ... అమ్మ
ఆ... ఆవు 


అ... అమ్మ
ఆ... ఆవు
అమ్మవంటిదే ఆవు... అది తెలుసుకో నీవు


ఇ... ఇల్లు
ఈ... ఈ... ఈశ్వరుడు
ఆ... ఇంటిని ఇలనూ కాచేదెవడు ... ఈశ్వరుడు..పరమేశ్వరుడు 




చరణం 1 :



అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ
ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అః...  అం అః


క ఖ గ ఘ జ్ఞ
చ ఛ జ ఝ ఞ
ట ఠ డ ఢ ణ
త థ ద ధ న
ప ఫ బ భ మ..
య ర ల వ శ ష స హ ళ...  క్ష 


అ మొదలుకొని... క్ష వరకు
అ మొదలుకొని... క్ష వరకు
మన అక్షరాలు... యాభైయారూ
అక్షరమాల నేర్చుకొని
ఆపై బ్రతుకులు దిద్దుకొని
చక్కని పౌరులు... కావాలీ
మన జాతికి పేరు... తేవాలి    


అ... అమ్మ
ఆ... ఆవు
అమ్మవంటిదే... ఆవు
అది తెలుసుకో... నీవు
ఇంటిని ఇలనూ కాచేదెవడు
ఈశ్వరుడు... పరమేశ్వరుడు 



చరణం 2 :



అందరిదీ ఒకే... కులం
అందరమూ... మానవులం
కండలు పెంచితె సరిపోదు
కావాలయ్యా బుద్ధిబలం ... కావాలయ్యా బుద్ధిబలం   

         

మనభాషలు వేరే ఐనా
మన మతాలు వేరే ఐనా
జీసస్... ఈశ్వర్... అల్లా ...  


ఈశ్వర..  అల్లా తేరేనామ్... సబకో సన్మతి దే భగవాన్
రఘుపతి రాఘవ రాజారామ్ ... పతీత పావన సీతారామ్
ఈశ్వర్ అల్లా తేరేనామ్...  సబ్ కో సన్మతీ దే భగవాన్
రఘుపతి రాఘవ రాజారామ్... పతీత పావన సీతారామ్



మన భాషలు... వేరే ఐనా
మన మతాలు... వేరే ఐనా
పాలూ పైరూ... ఒకటే
భూమాత అందరికొకటె
భూమాత... అందరికొకటె
పేదా గొప్పా భేదాలు .... పెళ్ళగించుకొని..పోవాలి
పేదా గొప్పా భేదాలు .... పెళ్ళగించుకొని..పోవాలి


గిరిజనుడే... పురజనుడై
గిరిజనుడే పురజనుడై
ధరా చక్రమును తిప్పాలి


ఈ ధరా చక్రమును తిప్పాలి 
ఈ ధరా చక్రమును తిప్పాలి 
అ..అ..అ..అ..అ..అ..అ..అ..


అ... అమ్మ
ఆ... ఆవు
అమ్మవంటిదే  ఆవు
అది తెలుసుకో నీవు
ఇంటిని ఇలనూ కాచేదెవడు
ఈశ్వరుడు... పరమేశ్వరుడు


ఈశ్వరుడు... పరమేశ్వరుడు 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6511


Thursday, August 28, 2014

విరిసిన మరుమల్లి

చిత్రం :  రైతు బిడ్డ (1971)
సంగీతం : ఎస్. హనుమంతరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు, సుశీల  


సాకీ : 


దిక్కులను చూసేవు ...దిగులుగా నిలిచేవు
అనుకున్న కబురందలేదా ...ఆ..ఎందుకమ్మాయి నీకింత బాధా..


పల్లవి :


ఓ..ఓ.. విరిసిన మరుమల్లి.. జరుగును మన పెళ్ళీ
విరిసిన మరుమల్లి.. జరుగును మన పెళ్ళీ
ముత్యాల పందిరిలోనా ..ఆ..ఆ..మురిపాల సందడిలోనా..
మురిపాల సందడిలోనా...


విరిసిన మరుమల్లి.. జరుగును మన పెళ్ళీ
ముత్యాల పందిరిలోనా ..ఆ..ఆ..మురిపాల సందడిలోనా..
మురిపాల సందడిలోనా... 


చరణం 1 :


అమ్మగారి దీవెనలు అందుకున్నారా... ..ఓ......ఓ.. ఆ..... ఆ.....

అన్నగారు అందుకు సరే అన్నారా
మనసు కనుగోనారు..ప్రణయ కథ విన్నారు
మనసు కనుగోనారు..ప్రణయ కథ విన్నారు
మనల మన్నిచారు ...మనువు కుదిరించారు
ఓ......ఓ.....ఆ.....ఆ......

విరిసిన మరుమల్లి... జరుగును మన పెళ్ళీ
ముత్యాల పందిరిలోనా..మురిపాల సందడిలోనా..
మురిపాల సందడిలోనా 



చరణం 2 : 


ఆ..అ.....ఆ......ఆ......ఓ.......ఓ.....ఓ.......ఓ.......
పెళ్ళితోనే బులపాటం చెల్లునంటావా...కళ్ళలోనే కలకాలం దాచుకుంటావా?
పెళ్ళితోనే బులపాటం చెల్లునంటావా...కళ్ళలోనే కలకాలం దాచుకుంటావా?


వలచి కాదంటానా... కలసి విడిపోతానా?
వలచి కాదంటానా... కలసి విడిపోతానా?
ఏకమై ఉందామూ ఎన్ని జన్మలకైనా
ఓ.....ఓ........
........ఓ......ఓ......


విరిసిన మరు మల్లి ...జరుగును మన పెళ్ళీ
ముత్యాల పందిరిలోనా...
మురిపాల సందడిలోనా...మురిపాల సందడిలోనా



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7204

Wednesday, May 14, 2014

హే రేఖా .. శశిరేఖా

చిత్రం :  మనుషుల్లో దేవుడు (1974)
సంగీతం : టి.వి. రాజు, ఎస్. హనుమంతరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు


పల్లవి:


హే రేఖా .. శశిరేఖా
చిర్రు బుర్రులెందుకు .. చెట్టా పట్టాలేసుకో
కోపమా .. తాపమా
అయ్యొ రామా ..అయ్యొ రామా .. అయ్యొ రామా


చరణం 1:


ఓ సఖీ .. మండె చెకుముకి .. చురచుర చూపులే చూడకూ
ముక్కున కోపమూ .. మొదటికి మోసమూ... అదేనేమో ఆడపిల్లకు అందమూ
అవునా?
కోపమా .. తాపమా
కోపమా .. తాపమా
అయ్యొ రామా ..అయ్యొ రామా .. అయ్యొ రామా


చరణం 2:


ఓ చెలి .. రగిలే జాబిలి.. ఉరుములు మెరుపులు మానుకో
తొలకరి జల్లులు .. తడిసిన మల్లెలా
తొలకరి జల్లులు .. తడిసిన మల్లెలా.. ఇలా ఇలా ఇలా ఒదిగిపో
ఏమంటావ్ ?
కోపమా .. తాపమా
కోపమా .. తాపమా
అయ్యొ రామా ..అయ్యొ రామా .. అయ్యొ రామా


చరణం 3:


నీ మది ..పొరబడుతున్నది.. నిజమేదో ఎరుగకున్నది
అలజడి తగ్గితే .. నిలకడ కుదిరితే
అలజడి తగ్గితే నిలకడ కుదిరితే..అదే అదే అదే తెలుస్తుందిలే .. అసలు కథ
కోపమా .. తాపమా
కోపమా .. తాపమా
అయ్యొ రామా ..అయ్యొ రామా .. అయ్యో రామా




Thursday, August 9, 2012

నేడే తెలిసింది ఈనాడే తెలిసింది

చిత్రం: ఆరాధన (1976)
సంగీతం: ఎస్. హనుమంతరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: మహమ్మద్ రఫీ, జానకి


పల్లవి:

నేడే ..తెలిసింది.. ఈనాడే తెలిసింది

నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది
కమ్మని కలకే రూపం వస్తే...ఏ...
కమ్మని కలకే రూపం వస్తే .. అది నీలాగే ఉంటుందనీ
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది

నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది
తీయని పాటకు ప్రాణం వస్తే ...ఏ...
తీయని పాటకు ప్రాణం వస్తే .. అది నీలాగే ఉంటుందనీ
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది

చరణం 1:

ఇంత మంచి రూపానికి .. అంత మంచి మనసుంటుందని
ఇంత మంచి రూపానికి .. అంత మంచి మనసుంటుందని
ఆ మనసున అంతరాలకు తావన్నది లేనే లేదని
ఆ మనసున అంతరాలకు తావన్నది లేనే లేదని
అది వలచే దొకసారే ననీ ...ఆ వలపే విడిపో లేనిదనీ
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది...

చరణం 2:

ఆఁ......ఆ...ఆ...ఆ....ఆ..ఆ...
ఆఁ......ఆ...ఆ...ఆ....ఆ..ఆ...

మారుమూల పల్లెలోన ..మధుర గానముదయించేనని
మారుమూల పల్లెలోన ..మధుర గానముదయించేనని
శిలలకైన ఆ గానం... పులకింతలు కలిగించేననీ
శిలలకైన ఆ గానం ...పులకింతలు కలిగించేననీ
అది జతగా నను చేరాలని ..నా బ్రతుకే శృతి చేయాలని

నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది
కమ్మని కలకే రూపం వస్తే .. అది నీలాగే ఉంటుందనీ
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది ...
తీయని పాటకు ప్రాణం వస్తే .. అది నీలాగే ఉంటుందనీ
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది...
నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది..

నీకేలా ఇంత నిరాశా

చిత్రం: ఆరాధన (1976)
సంగీతం: ఎస్. హనుమంతరావు
గీతరచయిత: దాశరథి
నేపధ్య గానం: జానకి


పల్లవి:

నీకేలా.. ఇంత నిరాశా...
నీకేలా.. ఇంత నిరాశా

నీకేలా.. ఇంత నిరాశా
నీకేలా.. ఇంత నిరాశా
నీ కన్నులలో కన్నీరేల
అంతా దేవుని లీల
అంతా దేవుని లీల
నీకేలా.. ఇంత నిరాశా..
నీకేలా.. ఇంత నిరాశా

చరణం 1:

ఆశ నిరాశలు దాగుడుమూతల
ఆటేలే ఈ లోకం.. ఆటేలే ఈ లోకం

కష్ట సుఖాల కలయికలోనే
ఉన్నదిలే మాధుర్యం.. జీవిత మాధుర్యం

చీకటి కొంత.. వెలుతురు కొంత
ఇంతే జీవితమంతా.. ఇంతే జీవితమంతా
నీకేలా.. ఇంత నిరాశా... నీకేలా.. ఇంత నిరాశా

చరణం 2:

నీ మదిలోని వేదనలన్నీ
నిలువవులే.. కలకాలం
నిలువవులే.. కలకాలం

వాడిన మోడు పూయక మానదు
వచ్చును.. వసంతకాలం
వచ్చును.. వసంత కాలం

నీతో నడచి నీడగ నడిచే
తోడుగ నేనున్నాను.. నీ తోడుగ నేనున్నాను
నీకేలా.. ఇంత నిరాశా.. నీకేలా.. ఇంత నిరాశా

నా మది నిన్ను పిలిచింది

చిత్రం: ఆరాధన (1976)
సంగీతం: ఎస్. హనుమంతరావు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: మహమ్మద్ రఫీ

పల్లవి:

ఓ ప్రియతమా... ఓ ప్రియతమా...ప్రియతమా...

నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై

చరణం 1:

ఎవ్వరివో నీవు నే నెరుగలేను
ఏ పేరున నిన్ను నే పిలువగలను
ఎవ్వరివో నీవు నే నెరుగలేను
ఏ పేరున నిన్ను నే పిలువగలను

తలపులలోనే నిలిచేవు నీవే
తొలకరి మెరుపుల రూపమై

నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై 


చరణం 2:

ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను
ఈ మూగబాధ ఎందాక దాచేను
ఎన్ని యుగాలని నీ కొరకు వేచేను
ఈ మూగబాధ ఎందాక దాచేను

వేచిన మదినే వెలిగింప రావే
ఆరని అనురాగ దీపమై

నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై