Showing posts with label ఏ.పి. కోమల. Show all posts
Showing posts with label ఏ.పి. కోమల. Show all posts

Monday, July 9, 2018

మనసైనా చెలీ పిలుపూ

చిత్రం : జయసింహ (1955)
సంగీతం : టి.వి. రాజు
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం : రావు బాలసరస్వతి,  ఏ.పి. కోమల

పల్లవి : 

ఆ.. ఓ..ఓ.. ఓ... 

మనసైనా చెలీ పిలుపూ...
మనసైనా చెలీ పిలుపూ... వినరావేల ఓ చందమామా
మనసైనా చెలీ పిలుపూ... వినరావేల ఓ చందమామా 

మనసైనా చెలీ పిలుపూ ... 

చరణం 1 :

పిలిచే నిన్నే నే వలచాననా బిగిసేరూ మగవారలూ
పిలిచే నిన్నే నే వలచాననా బిగిసేరూ మగవారలూ
ఓ..ఓ.. ఓ...

తలచేరులే చెలి నిను చౌకగా...  వలచేనే ననూ జాబిలీ
ఓ..ఓ.. ఓ... అదొ నవ్వేను నను చూచి...

అదొ నవ్వేను నను చూచి... నను కవ్వించి ఆడేను దోబూచి ...
అదొ నవ్వేను నను చూచి...

చరణం 2 :

లే నవ్వుల తొలి లాలింతురే...  తుది కన్నీట తేలింతురే
లే నవ్వుల తొలి లాలింతురే...  తుది కన్నీట తేలింతురే
ఓ..ఓ.. ఓ...

నమ్మేదెలా మనసమ్మేదెలా మనసనాడో ఆ రాజు సొమ్మాయెనే
ఓ..ఓ.. ఓ...

మనసైనా చెలీ పిలుపూ...
మనసైనా చెలీ పిలుపూ... వినరావేల ఓ చందమామా
మనసైనా చెలీ పిలుపూ... 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18506