Showing posts with label జయసింహ (1955). Show all posts
Showing posts with label జయసింహ (1955). Show all posts

Tuesday, July 10, 2018

నడిరేయి గడిచేనే

చిత్రం : జయసింహ  (1955)
సంగీతం : టి.వి. రాజు
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపథ్య గానం : సుశీల 

పల్లవి : 

నడిరేయి గడిచేనే చెలియా...
రాడాయెనే సామి... నా సామి
రాడాయెనే సామి... నేడూ

నడిరేయి గడిచేనే

ఎదురు తెన్నులు చూచి చూచి..ఓ... చెలియా వానికై వేచి వేచి నేడు
నడిరేయి గడిచేనే చెలియా... రాడాయెనే సామి... నేడూ

నడిరేయి గడిచేనే.. ఏ.. ఏ...

చరణం 1 : 

గగనాన నెలరేడు దిగజారిపోయె
సిగలోని విరులన్ని పసివాడిపోయె...
గగనాన నెలరేడు దిగజారిపోయె
సిగలోని విరులన్ని పసివాడిపోయె... 

దిగులాయనే... ఏ..ఏ..ఏ...ఏ..
దిగులాయనే... మది వగలే మిగులాయే...
మగరాయడే వాడ మనలేనో నేడూ...

నడిరేయి గడిచేనే.. ఏ.. ఏ...

చరణం 2 :

గడిపా పడిగాపు పడియుండలేనే
ఘడియొక్క యుగమూగా గడుపగా లేనే
గడిపా పడిగాపు పడియుండలేనే
ఘడియొక్క యుగమూగా గడుపగా లేనే

ఎడబాటుతో.. ఓ..ఓ..ఓ..
ఎడబాటుతో... గమరిస రిసనిసదప గమరిగమ
ఎడబాటుతో.... సా..నీ..దా..సానీ సనిదపమ... నిదప నిదపమగ
మపమగమగమ పదప మపమస
దనిద పద పద నినిసని పపదమప

ఎడబాటుతో ఈ సడిలేని రేయి
కడలేని కన్నీరై నిలువాగలేనే 

నడిరేయి గడిచేనే చెలియా... రాడాయెనే సామి... నేడూ

నడిరేయి గడిచేనే.. ఏ.. ఏ...

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18509

జయజయ శ్రీరామా

చిత్రం : జయసింహ (1955)
సంగీతం : టి.వి. రాజు
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం : ఘంటసాల  

పల్లవి : 

జయజయ శ్రీరామా... రఘువరా...  శుభకర శ్రీరామా
జయజయ శ్రీరామా... రఘువరా...  శుభకర శ్రీరామా

త్రిభువనజన నయనాభిరామా
త్రిభువనజన నయనాభిరామా
జయజయ శ్రీరామా... రఘువరా...  శుభకర శ్రీరామా

చరణం 1 :

తారకనామా...
తారక నామా... దశరథరామా
తారక నామా... దశరథరామా
దనుజవిరామా...  పట్టాభిరామా
దనుజవిరామా...  పట్టాభిరామా

జయజయ శ్రీరామా... రఘువరా...  శుభకర శ్రీరామా

చరణం 2 :

రామా రఘుకుల జలనిధిసోమా
రామా రఘుకుల జలనిధిసోమా... భూమిసుతాకామా
రామా రఘుకుల జలనిధిసోమా... భూమిసుతాకామా

కామితదాయక కరుణాధామా
కామితదాయక కరుణాధామా
కోమల నీల సరోజ శ్యామా
కోమల నీల సరోజ శ్యామా

జయజయ శ్రీరామా... రఘువరా...  శుభకర శ్రీరామా

త్రిభువనజన నయనాభిరామా
త్రిభువనజన నయనాభిరామా
జయజయ శ్రీరామా... రఘువరా...  శుభకర శ్రీరామా

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18502

Monday, July 9, 2018

మనసైనా చెలీ పిలుపూ

చిత్రం : జయసింహ (1955)
సంగీతం : టి.వి. రాజు
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం : రావు బాలసరస్వతి,  ఏ.పి. కోమల

పల్లవి : 

ఆ.. ఓ..ఓ.. ఓ... 

మనసైనా చెలీ పిలుపూ...
మనసైనా చెలీ పిలుపూ... వినరావేల ఓ చందమామా
మనసైనా చెలీ పిలుపూ... వినరావేల ఓ చందమామా 

మనసైనా చెలీ పిలుపూ ... 

చరణం 1 :

పిలిచే నిన్నే నే వలచాననా బిగిసేరూ మగవారలూ
పిలిచే నిన్నే నే వలచాననా బిగిసేరూ మగవారలూ
ఓ..ఓ.. ఓ...

తలచేరులే చెలి నిను చౌకగా...  వలచేనే ననూ జాబిలీ
ఓ..ఓ.. ఓ... అదొ నవ్వేను నను చూచి...

అదొ నవ్వేను నను చూచి... నను కవ్వించి ఆడేను దోబూచి ...
అదొ నవ్వేను నను చూచి...

చరణం 2 :

లే నవ్వుల తొలి లాలింతురే...  తుది కన్నీట తేలింతురే
లే నవ్వుల తొలి లాలింతురే...  తుది కన్నీట తేలింతురే
ఓ..ఓ.. ఓ...

నమ్మేదెలా మనసమ్మేదెలా మనసనాడో ఆ రాజు సొమ్మాయెనే
ఓ..ఓ.. ఓ...

మనసైనా చెలీ పిలుపూ...
మనసైనా చెలీ పిలుపూ... వినరావేల ఓ చందమామా
మనసైనా చెలీ పిలుపూ... 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18506

Monday, June 17, 2013

ఈనాటి ఈ హాయి

చిత్రం: జయసింహ (1955) 
సంగీతం: టి.వి. రాజు 
గీతరచయిత: సముద్రాల (సీనియర్) 
నేపధ్య గానం: ఘంటసాల, పి. లీల 

పల్లవి: 

ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ.. కల కాదోయి నిజమోయి.. 
ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ.. కల కాదోయి నిజమోయి.. 
ఈనాటి ఈ హాయి.. 

చరణం 1: 

నీ ఊహతోనే పులకించి పోయే.. ఈ మేను నీదోయి..ఈ..ఈ..ఈ.. 
నీ ఊహతోనే పులకించి పోయే.. ఈ మేను నీదోయి..ఈ..ఈ..ఈ.. 
నీ కోసమే ఈ అడియాశలన్ని.. నా ధ్యాస నా ఆశ నీవే కదా 

ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ.. కల కాదోయి నిజమోయి.. 
ఈనాటి ఈ హాయి.. 

చరణం 2: 

ఏ నోము ఫలమో ఏ నోటి వరమో.. ఈ ప్రేమ జవరాలా..ఆ..ఆ..ఆ.. 
ఏ నోము ఫలమో ఏ నోటి వరమో.. ఈ ప్రేమ జవరాలా..ఆ..ఆ..ఆ.. 
మనియేములే ఇక విరితావిలీల.. మన ప్రేమ కెదురేది లేదే సఖి.. 

ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ.. కల కాదోయి నిజమోయి.. 
ఈనాటి ఈ హాయి.. 

చరణం 3: 

ఊగేములే తుల తూగేములే.. ఇక తొలి ప్రేమ భోగాలా.. 
ఆ..ఆ..ఆ.. ఊగేములే తులతూగేములే.. ఇక తొలి ప్రేమ భోగాలా.. 
మురిపాలతేలే మన జీవితాలు.. 
మురిపాలతేలే మన జీవితాలు.. దరహాస లీలావిలాసాలులే.. 

ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ.. కల కాదోయి నిజమోయి.. 
ఈనాటి ఈ హాయి..ఈ..ఈ..ఈ.. కల కాదోయి నిజమోయి..ఈ..ఈ..ఈ.. 
ఈనాటి ఈ హాయి..