Showing posts with label జొన్నవిత్తుల. Show all posts
Showing posts with label జొన్నవిత్తుల. Show all posts
Wednesday, January 11, 2017
కోలో కోలో కోయిలమ్మా
చిత్రం : నెంబర్ వన్ (1994)
కోలో కోలో కోయిలమ్మా కొండాకోనా బుల్లెమ్మా
కోలో కోలో కొమ్మారెమ్మా కొండాకోనా ఓయమ్మా
తాకితే ఎర్రాని బుగ్గ కందాలా
కోలో కోలో కొమ్మారెమ్మా కొండాకోనా ఓయమ్మా
ఓ ప్రియా లాలించమంది వయ్యారం
కోలో కోలో కోయిలమ్మా కొండాకోనా బుల్లెమ్మా
Thursday, January 5, 2017
అందమైనది ముందర ఉంది
చిత్రం : నెంబర్ వన్ (1994)
సంగీతం : ఎస్. వి. కృష్ణా రెడ్డి
గీతరచయిత : జొన్నవిత్తుల
నేపధ్య గానం : బాలు, చిత్ర
పల్లవి :
అందమైనది ముందర ఉంది
అందుకే యమ తొందరగుంది
రంభ మరదలు రంజుగ ఉంది
సంబరానికి సయ్యని అంది
పాలపొంగుకి ఆశగ ఉంది
పైటకొంగుకి కోరిక ఉంది
పూతరేకుల కానుక ఉంది
ఆరగింపుకి రమ్మని అంది
చరణం 1 :
అడిగిందీ రాచిలకా... అలకలు తీర్చు రసగుళికా
తగిలిందా చెలి చురకా... సరిగమపా సరసమిక
అరె మొదలెడితే తెర వెనుక... మెరుపులమేను తకిటతక
విరబూసే వయసు ఇక... నిలవదుపా నువు లేక
అరె మోజైతే సయ్యంటు రాక... మొహమాటమేలా ఇక
ఊరంతా గగ్గోలు కాక... చూడాలి నువ్వే ఇక
గుండెలో ఏ బెంగలేక... గుట్టుగా రావే ఇక
జోరుగా నూరేళ్ళదాకా... ఎగరేయి జెండా ఇక
అందమైనది ముందర ఉంది
అందుకే యమ తొందరగుంది
పూతరేకుల కానుక ఉంది
ఆరగింపుకి రమ్మని అంది
చరణం 2 :
తపనలలో తలమునక... చలిచలివేళ చమకుచక
పొదవెనుక పరువమిక... పదనిసలే పలుకునిక
ఆ చురుకుమనే చూపులకి... శృతిమించేను సోకు ఇక
ముదిరినదా మురిపమిక... మొదలుకదా మోత ఇక
నువ్వంటే పడిచస్తా మామా... నీకే నా సోకిస్తా రా
నీకోసం దిగి వచ్చా భామా... వలపిస్తా వడిపట్టవే
గుండెల్లో కోయిళ్ళ కూత... తీయనా నీ కౌగిట
బుగ్గలో దానిమ్మపూత... ఓలమ్మీ ఈ సందిట
అందమైనది ముందర ఉంది
అందుకే యమ తొందరగుంది
రంభ మరదలు రంజుగ ఉంది
సంబరానికి సయ్యని అంది
పాలపొంగుకి ఆశగ ఉంది
పైటకొంగుకి కోరిక ఉంది
పూతరేకుల కానుక ఉంది
ఆరగింపుకి రమ్మని అంది
Monday, February 4, 2013
అభిమతమో అభినయమో
చిత్రం: జయమ్ము నిశ్చయమ్మురా (1989)
సంగీతం: రాజ్-కోటి
గీతరచయిత: జొన్నవిత్తుల
నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి:
అభిమతమో అభినయమో ఈ ప్రేమ చతురాతిచతురం
అభిమతమో అభినయమో ఈ ప్రేమ చతురాతిచతురం
చలిలో... రేగును సెగలే
ఎదలో.... మోగును లయలే
ఇది పెళ్ళికి పిచ్చికి నడుమ విచిత్రం
మధుకలశం హిమశకలం మన చెలిమి మధురాతిమధురం
మధుకలశం హిమశకలం మన చెలిమి మధురాతిమధురం
మనసే... మమతకు జోడై
మమతే.... మనిషికి నీడై
ఇటు సాగిన స్నేహమె మైత్రికి అందం
అభిమతమో అభినయమో ఈ ప్రేమ చతురాతి చతురం
ఓ... మధుకలశం హిమశకలం మన చెలిమి మధురాతిమధురం
చరణం 1:
కోటినవ్వుల గూటి గువ్వవు గోట మీటగానే మోగు వీణవు
కోమలి కో అంటే... ఆరును ఎదమంట
భామిని నో అంటే... బాధలు మొదలంట...
సరి అనవా... వరమిడవా.. సరసన నవరస మధురసమీవా
మధుకలశం హిమశకలం మన చెలిమి మధురాతిమధురం
ఓ... అభిమతమో అభినయమో ఈ ప్రేమ చతురాతిచతురం
చరణం 2:
మండుటెండలో మంచుకొండవై... స్నేహ సుధలలోనా భాగమందుకో
ఒంటరి మనుగడలో... ఊరట కలిమేలే...
బాధల సుడివడిలో... బాసట బలిమేలే...
వేడుకలో ..వేదనలో... తోడుగ నిలిచెడి స్నేహమె.. సంపద
అభిమతమో అభినయమో ఈ ప్రేమ చతురాతిచతురం
మధుకలశం హిమశకలం మన చెలిమి మధురాతిమధురం
చలిలో... రేగును సెగలే
ఎదలో.... మోగును లయలే
ఇటు సాగిన స్నేహమె మైత్రికి అందం
అభిమతమో అభినయమో ఈ ప్రేమ చతురాతిచతురం
మధుకలశం హిమశకలం మన చెలిమి మధురాతిమధురం
సంగీతం: రాజ్-కోటి
గీతరచయిత: జొన్నవిత్తుల
నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి:
అభిమతమో అభినయమో ఈ ప్రేమ చతురాతిచతురం
అభిమతమో అభినయమో ఈ ప్రేమ చతురాతిచతురం
చలిలో... రేగును సెగలే
ఎదలో.... మోగును లయలే
ఇది పెళ్ళికి పిచ్చికి నడుమ విచిత్రం
మధుకలశం హిమశకలం మన చెలిమి మధురాతిమధురం
మధుకలశం హిమశకలం మన చెలిమి మధురాతిమధురం
మనసే... మమతకు జోడై
మమతే.... మనిషికి నీడై
ఇటు సాగిన స్నేహమె మైత్రికి అందం
అభిమతమో అభినయమో ఈ ప్రేమ చతురాతి చతురం
ఓ... మధుకలశం హిమశకలం మన చెలిమి మధురాతిమధురం
చరణం 1:
కోటినవ్వుల గూటి గువ్వవు గోట మీటగానే మోగు వీణవు
కోమలి కో అంటే... ఆరును ఎదమంట
భామిని నో అంటే... బాధలు మొదలంట...
సరి అనవా... వరమిడవా.. సరసన నవరస మధురసమీవా
మధుకలశం హిమశకలం మన చెలిమి మధురాతిమధురం
ఓ... అభిమతమో అభినయమో ఈ ప్రేమ చతురాతిచతురం
చరణం 2:
మండుటెండలో మంచుకొండవై... స్నేహ సుధలలోనా భాగమందుకో
ఒంటరి మనుగడలో... ఊరట కలిమేలే...
బాధల సుడివడిలో... బాసట బలిమేలే...
వేడుకలో ..వేదనలో... తోడుగ నిలిచెడి స్నేహమె.. సంపద
అభిమతమో అభినయమో ఈ ప్రేమ చతురాతిచతురం
మధుకలశం హిమశకలం మన చెలిమి మధురాతిమధురం
చలిలో... రేగును సెగలే
ఎదలో.... మోగును లయలే
ఇటు సాగిన స్నేహమె మైత్రికి అందం
అభిమతమో అభినయమో ఈ ప్రేమ చతురాతిచతురం
మధుకలశం హిమశకలం మన చెలిమి మధురాతిమధురం
Subscribe to:
Posts (Atom)