Showing posts with label టాక్సీ డ్రైవర్ (1981). Show all posts
Showing posts with label టాక్సీ డ్రైవర్ (1981). Show all posts

Friday, July 17, 2020

నా ప్రేయసి... ఊహలో ఊర్వశి

చిత్రం : టాక్సీ డ్రైవర్ (1981)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు 



పల్లవి : 


నా ప్రేయసి... ఊహలో ఊర్వశి
నా ప్రేయసి... ఊహలో ఊర్వశి
ఆకాశ వీధిలో అందాల రాశి 


నా ప్రేయసి... ఊహలో ఊర్వశి
ఆకాశ వీధిలో అందాల రాశి
నా ప్రేయసి... ఊహలో ఊర్వశి 



చరణం 1 :



కలగా నీవు కనిపించినావే
వలగా నీవు వలపించినావే
చెలిమై నన్ను జతకూడినావే
సిరివై నన్ను విడనాడినావే
ఆ దివిలో నీవు... భువిలో నేను
ఆ దివిలో నీవు... భువిలో నేను
ఎదలోన రగిలే వ్యధవైతివే


నా ప్రేయసి... ఊహలో ఊర్వశి
ఆకాశ వీధిలో అందాల రాశి
నా ప్రేయసి... ఊహలో ఊర్వశి 


చరణం 2 :


గుండెలలో నీకు గుడి కట్టినానే
అనురాగాదీపాలు వెలిగించినానే
శిలవని తెలియక పూజించినానే
విషమని తెలియక సేవించినానే 


కలవో లేవో...  కలవో శిలవో

కలవో లేవో...  కలవో శిలవో 

కలయిక... కల ఇక...  మనకికలేదులే 



నా ప్రేయసి... ఊహలో ఊర్వశి
ఆకాశ వీధిలో అందాల రాశి
నా ప్రేయసి... ఊహలో ఊర్వశి