Showing posts with label పారిజాతం (1980). Show all posts
Showing posts with label పారిజాతం (1980). Show all posts

Saturday, April 4, 2020

నిన్నొక చిన్నది

చిత్రం : పారిజాతం (1980)
సంగీతం : కె.వి. మహదేవన్
నేపథ్య గానం : బాలు, సుశీల 

పల్లవి :

నిన్నొక చిన్నది నాతో అన్నది... పున్నమి రాబోతున్నదని
ఆ వెన్నెలా సన్నని సూదులని
నిన్నొక చిన్నది నాతో అన్నది... పున్నమి రాబోతున్నదని
ఆ వెన్నెలా సన్నని సూదులని

నిన్నొక చిన్నాడు నాతో అన్నాడు.. పున్నమి తన ఎదుటున్నదని
ఆ వెన్నెలే సన్నని సూదులని
నిన్నొక చిన్నాడు నాతో అన్నాడు.. పున్నమి తన ఎదుటున్నదని
ఆ వెన్నెలే సన్నని సూదులని

చరణం 1 :

రా రా రా.. రమ్మని పిలిచే కన్నులలో... ఆ సిగ్గులు ఎందుకని
ఈ ఈ ఈ.. ఇమ్మని అడిగే పెదవులలో... ఆ బెదురులు ఎందుకని

కన్నెతనానికి సిగ్గులు ఋజువులని...  లేతదనానికి బెదురులు గురుతులని
ఇవి రెండూ మగువకు తరగని సొగసులని...

నిన్నొక చిన్నది నాతో అన్నది... పున్నమి రాబోతున్నదని
ఆ వెన్నెలే సన్నని సూదులని

చరణం 2 :

రా రా రా... రమ్మని పిలిచే వచ్చేలోగా అలకలు ఎందుకని
ఈ ఈ ఈ.. ఇమని అడిగి ఇచ్చేలోగా తొందరలెందుకని

కొసరడిగేందుకు అలకలు కిటుకులని...
తొందరలేందే అసలుకు మోసమని
ఈ అసలు.. కొసరు... అనురాగానికి అందమని

నిన్నొక చిన్నది నాతో అన్నది... పున్నమి రాబోతున్నదని
ఆ వెన్నెలా సన్నని సూదులని... ఆ వెన్నెలే సన్నని సూదులని

 https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5427

Sunday, November 10, 2013

పూచిన పారిజాతమా

చిత్రం : పారిజాతం (1980)
సంగీతం : కె.వి. మహదేవన్
నేపధ్య గానం : బాలు

పల్లవి :

పూచిన పారిజాతమా.. రాయని ప్రేమ గీతమా
నా ఒడిలో పరిమళించవే.. నా హృదిలో ప్రతిఫలించవే
నా ఒడిలో పరిమళించవే.. నా హృదిలో ప్రతిఫలించవే 

చరణం : 1 

నీ సొగసుకు నేనే వయసని.. నా వయసుకు నువ్వే మనసని
నీ సొగసుకు నేనే వయసని.. నా వయసుకు నువ్వే మనసని
ఇద్దరమూ తెలుసుకొని.. తొలి ముద్దులతో ముడి వేసుకొని...
ఇద్దరమూ తెలుసుకొని.. తొలి ముద్దులతో ముడి వేసుకొని...
నీ కన్నె స్వప్నము.. నే కన్న స్వర్గము.. నిత్య సత్యము కావాలి..

పూచిన పారిజాతమా.. రాయని ప్రేమ గీతమా
నా ఒడిలో పరిమళించవే.. నా హృదిలో ప్రతిఫలించవే
నా ఒడిలో పరిమళించవే.. నా హృదిలో ప్రతిఫలించవే 

చరణం : 2

నీ దేవుడు నేనే కావాలి.. నా పుజకు నువ్వే రావాలి
నీ దేవుడు నేనే కావాలి.. నా పుజకు నువ్వే రావాలి
గుండెకు నిన్ను హత్తుకొని మన కౌగిలినే గుడి చేయాలి
గుండెకు నిన్ను హత్తుకొని మన కౌగిలినే గుడి చేయాలి
నా పురుష జన్మము.. నీ పూర్వపుణ్యము... వరమై స్థిరమై ఉండాలి...

పూచిన పారిజాతమా.. రాయని ప్రేమ గీతమా
నా ఒడిలో పరిమళించవే.. నా హృదిలో ప్రతిఫలించవే
లాలాలలలలాలలా... లలలాలలలలాలలా...

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5429