Saturday, April 4, 2020

నిన్నొక చిన్నది

చిత్రం : పారిజాతం (1980)
సంగీతం : కె.వి. మహదేవన్
నేపథ్య గానం : బాలు, సుశీల 

పల్లవి :

నిన్నొక చిన్నది నాతో అన్నది... పున్నమి రాబోతున్నదని
ఆ వెన్నెలా సన్నని సూదులని
నిన్నొక చిన్నది నాతో అన్నది... పున్నమి రాబోతున్నదని
ఆ వెన్నెలా సన్నని సూదులని

నిన్నొక చిన్నాడు నాతో అన్నాడు.. పున్నమి తన ఎదుటున్నదని
ఆ వెన్నెలే సన్నని సూదులని
నిన్నొక చిన్నాడు నాతో అన్నాడు.. పున్నమి తన ఎదుటున్నదని
ఆ వెన్నెలే సన్నని సూదులని

చరణం 1 :

రా రా రా.. రమ్మని పిలిచే కన్నులలో... ఆ సిగ్గులు ఎందుకని
ఈ ఈ ఈ.. ఇమ్మని అడిగే పెదవులలో... ఆ బెదురులు ఎందుకని

కన్నెతనానికి సిగ్గులు ఋజువులని...  లేతదనానికి బెదురులు గురుతులని
ఇవి రెండూ మగువకు తరగని సొగసులని...

నిన్నొక చిన్నది నాతో అన్నది... పున్నమి రాబోతున్నదని
ఆ వెన్నెలే సన్నని సూదులని

చరణం 2 :

రా రా రా... రమ్మని పిలిచే వచ్చేలోగా అలకలు ఎందుకని
ఈ ఈ ఈ.. ఇమని అడిగి ఇచ్చేలోగా తొందరలెందుకని

కొసరడిగేందుకు అలకలు కిటుకులని...
తొందరలేందే అసలుకు మోసమని
ఈ అసలు.. కొసరు... అనురాగానికి అందమని

నిన్నొక చిన్నది నాతో అన్నది... పున్నమి రాబోతున్నదని
ఆ వెన్నెలా సన్నని సూదులని... ఆ వెన్నెలే సన్నని సూదులని

 https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5427

No comments:

Post a Comment