Showing posts with label మాధవపెద్ది. Show all posts
Showing posts with label మాధవపెద్ది. Show all posts
Tuesday, September 11, 2018
తగునా ఇది మామా
చిత్రం : రాముడు-భీముడు (1964)
తగునా ఇది మామా... తమరే ఇటు బల్క నగున
అల్లుడనగనెవడు... మీ అమ్మాయికి మగడూ
తగునా ఇది మామా... తమరే ఇటు బల్క నగున
ఫో.. ఫో... ర... ఫొమ్మికన్....
నీ సాహసము పరీహాసము... నీ సాహసము పరీహాసము
కొడుకులు లేనందుకు తల కొరివి బెట్టువాడనే...
తగునా ఇది మామా... తమరే ఇటు బల్క నగున
అరె... ఊరికెల్ల మొనగాడినే
ఇపుడె తెలిసెన్ నీ కథ ఎల్లన్... ఫో...ఫో... ర ఫొమ్మికన్
Labels:
(ర),
NTR,
కొసరాజు,
ఘంటసాల,
పెండ్యాల,
మాధవపెద్ది,
రాముడు-భీముడు (1964)
సరదా సరదా సిగిరెట్టు
చిత్రం : రాముడు-భీముడు (1964)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : కొసరాజు
నేపథ్య గానం : మాధవపెద్ది , జమునా రాణి
పల్లవి :
సరదా సరదా సిగిరెట్టూ... ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
సరదా సరదా సిగిరెట్టూ... ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
పట్టుబట్టి ఒక దమ్ము లాగితే... స్వర్గానికె యిది తొలి మెట్టు
సరదా సరదా సిగిరెట్టూ... ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
కంపు గొట్టు యీ సిగరెట్టు... దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు
కంపు గొట్టు యీ సిగరెట్టు... దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు
కడుపు నిండునా కాలు నిండునా... వదలి పెట్టవోయ్ నీ పట్టు
కంపు గొట్టు యీ సిగరెట్టు... దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు
చరణం 1 :
ఈ సిగిరెట్టుతో ఆంజనేయుడూ లంకా దహనం చేశాడూ
హా.. ఎవడో కోతలు కోశాడూ
ఈ పొగ తోటీ గుప్పు గుప్పున మేఘాలు సృష్టించవచ్చూ...
మీసాలు కాల్చుకోవచ్చూ
సరదా సరదా సిగిరెట్టూ... ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
చరణం 2 :
ఊపిరి తిత్తులు క్యాన్సరుకిదియే కారణమన్నారు డాక్టర్లూ
కాదన్నారులే పెద్ద యాక్టర్లూ
పసరు బేరుకొని కఫము జేరుకొని ఉసురు తీయు పొమ్మన్నారూ
దద్దమ్మలు అది విన్నారూ
కంపు గొట్టు యీ సిగరెట్టు... దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు
చరణం 3 :
ప్రక్కనున్న వాళ్ళీ సువాసనకుముక్కు ఎగరేస్తారు...
నీవెరుగవు దీని హుషారు
థియేటర్లలో పొగ త్రాగడమే నిషేధించినారందుకే...
కలెక్షన్లు లేవందుకే
సరదా సరదా సిగిరెట్టూ... ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
కంపు గొట్టు యీ సిగరెట్టు... దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు
చరణం 4 :
కవిత్వానికి సిగిరెట్టు... కాఫీకే యిది తోబుట్టు.
పైత్యానికి యీ సిగిరెట్టు... బడాయి క్రిందా జమకట్టూ
ఆనందానికి సిగిరెట్టు... ఆలోచనలను గిలకొట్టు
వాహ్...పనిలేకుంటే సిగిరెట్టూ... తిని కూర్చుంటే పొగపట్టూ
రవ్వలు రాల్చే రాకెట్టూ... రంగు రంగులా ప్యాకెట్టూ
కొంపలు గాల్చే సిగిరెట్టూ... దీని గొప్ప చెప్ప చీదర బుట్టూ
సరదా సరదా సిగిరెట్టూ... ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టూ
కంపు గొట్టు యీ సిగరెట్టు... దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టు
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6101
Tuesday, January 22, 2013
ఏమిటి ఈ అవతారం
చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: కొసరాజు
నేపధ్య గానం: మాధవపెద్ది సత్యం, స్వర్ణలత
పల్లవి:
ఆ...ఏమిటే...
ఏమిటి ఈ అవతారం?
ఎందుకు ఈ సింగారం?
ఏమిటి ఈ అవతారం?
ఎందుకు ఈ సింగారం?
పాత రోజులు గుర్తొస్తున్నవి
ఉన్నది ఏదో వ్యవహారం
చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం
చరణం 1:
పౌడర్ దెచ్చెను నీకందం
బాగా వెయ్ వేలెడు మందం
పౌడర్ దెచ్చెను నీకందం
బాగా వెయ్ వేలెడు మందం
తట్టెడు పూలు తలను పెట్టుకుని
తయారైతివా చిట్టి వర్ధనం
చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం
చరణం 2:
ఆ...ఆ...ఓ...ఓ....
వయసులోన నే ముదురుదాననా
వయ్యారానికి తగనిదాననా
వయసులోన నే ముదురుదాననా
వయ్యారానికి తగనిదాననా
వరుసకాన్పులై వన్నె తగ్గినా
అందానికి నే తీసిపోదునా
ఏమిటి నా అపరాధం
ఎందుకు ఈ అవతారం
చరణం 3:
దేవకన్య ఇటు ఓహో...
దేవకన్య ఇటు దిగివచ్చిందని
భ్రమసి పోదునా కలనైనా
మహంకాళి నా పక్కనున్నదని
మరచిపోదునా ఎపుడైనా
చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం
నీళ్ళు కలపని పాలవంటిది
పిండి కలపని వెన్న వంటిది
నీళ్ళు కలపని పాలవంటిది
పిండి కలపని వెన్న వంటిది
నిఖారుసైనది నా మనసు
ఊరూవాడకు ఇది తెలుసు
ఏమిటి ఈ అవతారం?
చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: కొసరాజు
నేపధ్య గానం: మాధవపెద్ది సత్యం, స్వర్ణలత
పల్లవి:
ఆ...ఏమిటే...
ఏమిటి ఈ అవతారం?
ఎందుకు ఈ సింగారం?
ఏమిటి ఈ అవతారం?
ఎందుకు ఈ సింగారం?
పాత రోజులు గుర్తొస్తున్నవి
ఉన్నది ఏదో వ్యవహారం
చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం
చరణం 1:
పౌడర్ దెచ్చెను నీకందం
బాగా వెయ్ వేలెడు మందం
పౌడర్ దెచ్చెను నీకందం
బాగా వెయ్ వేలెడు మందం
తట్టెడు పూలు తలను పెట్టుకుని
తయారైతివా చిట్టి వర్ధనం
చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం
చరణం 2:
ఆ...ఆ...ఓ...ఓ....
వయసులోన నే ముదురుదాననా
వయ్యారానికి తగనిదాననా
వయసులోన నే ముదురుదాననా
వయ్యారానికి తగనిదాననా
వరుసకాన్పులై వన్నె తగ్గినా
అందానికి నే తీసిపోదునా
ఏమిటి నా అపరాధం
ఎందుకు ఈ అవతారం
చరణం 3:
దేవకన్య ఇటు ఓహో...
దేవకన్య ఇటు దిగివచ్చిందని
భ్రమసి పోదునా కలనైనా
మహంకాళి నా పక్కనున్నదని
మరచిపోదునా ఎపుడైనా
చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం
నీళ్ళు కలపని పాలవంటిది
పిండి కలపని వెన్న వంటిది
నీళ్ళు కలపని పాలవంటిది
పిండి కలపని వెన్న వంటిది
నిఖారుసైనది నా మనసు
ఊరూవాడకు ఇది తెలుసు
ఏమిటి ఈ అవతారం?
చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం
Subscribe to:
Posts (Atom)