Showing posts with label మనోరమ (1959). Show all posts
Showing posts with label మనోరమ (1959). Show all posts
Tuesday, August 18, 2020
గతిలేని వాణ్ణి
చిత్రం : మనోరమ (1959)
గతిలేని వాణ్ణి గుడ్డివాణ్ణి బాబయ్య
ప్రేమతోడ లోకమేను దేవుడు
చావలేము బతకలేము బాబయ్యా
ఆకలి చికాకుతోడ వేగుతూ...
గంజికొక్క ధర్మమెయ్యి బాబయ్య
Labels:
(మ),
NTR,
తలత్ మహమూద్,
మనోరమ (1959),
రమేశ్ నాయుడు,
సముద్రాల,
సుశీల
Monday, August 17, 2020
చందామామా రావే
చిత్రం : మనోరమ (1959)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : సముద్రాల
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
చందామామా రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందామామా రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందామామా రావే జాబిల్లి రావే
చరణం 1 :
వెండిగిన్నెలో వేడి బువ్వ తేవే
పైడిగిన్నెలో పాల బువ్వ తేవే
వెండిగిన్నెలో వేడి బువ్వ తేవే
పైడిగిన్నెలో పాల బువ్వ తేవే
అందాలా పాపకు అందించి పోవే
చందామామా రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందామామా రావే జాబిల్లి రావే
చరణం 2 :
తెల్లమబ్బుల తేరు మీద రావే
పాల వెన్నెలా పానకాలు తేవే
తెల్లమబ్బుల తేరు మీద రావే
పాల వెన్నెలా పానకాలు తేవే
అందాల పాపకు అందించి పోవే
చందామామా రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందామామా రావే జాబిల్లి రావే
Labels:
(మ),
NTR,
మనోరమ (1959),
రమేశ్ నాయుడు,
సముద్రాల (జూ),
సుశీల
మరచి పోయేవేమో
చిత్రం : మనోరమ (1959)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : సముద్రాల
నేపధ్య గానం : తలత్ మహమూద్, సుశీల
పల్లవి :
మరచి పోయేవేమో మాయని బాసలూ... మనకివే ఓ సఖీ
మరచి పోరాదోయీ చేసిన బాసలూ... ఆశలు మాసినా
చరణం 1 :
వెలిగేను నీ కులుకే నా కన్నుదోయి
మెలిగేను నా మదిలో నీ చెలిమి హాయి
వెలుగొందు ఆ తారలాగా
మాయని బాసలూ మనకివే ఓ సఖీ
మరచి పోరాదోయీ చేసిన బాసలూ ఆశలు మాసినా
చరణం 2 :
విరబూసే ఈ పువ్వు నీ పూజ కొరకే
విసిరేవు దూరముగా వసి వాడునోయీ
నీ దాన ఏనాటికైనా..
మాయనీ బాసలూ మనకివే ఓ సఖా
మరచి పోరాదోయీ చేసిన బాసలూ ఆశలు మాసినా
Labels:
(మ),
NTR,
తలత్ మహమూద్,
మనోరమ (1959),
రమేశ్ నాయుడు,
సముద్రాల,
సుశీల
అందాల సీమా
చిత్రం : మనోరమ (1959)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : సముద్రాల
నేపధ్య గానం : తలత్ మహమూద్
పల్లవి :
అందాల సీమా సుధా నిలయం
ఈ లోకమే దివ్య ప్రేమమయం
అందాల సీమా సుధా నిలయం
ఈ లోకమే దివ్య ప్రేమమయం
చరణం 1 :
వలపేమో తెలియకా తెలవారు బ్రతుకేలా
తొలినాటి ప్రేమలు ఫలమైన కలయైనా
మాయనీ గాయమై మిగిలినా అభినయం
మాయనీ గాయమై మిగిలినా అభినయం
అందాల సీమా సుధా నిలయం
ఈ లోకమే దివ్య ప్రేమమయం
చరణం 2 :
అందాల వెలుగులో అలరారు ఆనందం
అలరించు సొగసులా ఆనందమున తేలే
తీయనీ అనుభవం దేవుని పరిచయం
తీయనీ అనుభవం దేవుని పరిచయం
అందాల సీమా సుధా నిలయం
ఈ లోకమే దివ్య ప్రేమమయం
Labels:
(మ),
NTR,
తలత్ మహమూద్,
మనోరమ (1959),
రమేశ్ నాయుడు,
సముద్రాల
Subscribe to:
Posts (Atom)