చిత్రం : సిరిమువ్వల సింహనాదం
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సిరివెన్నెల
నేపథ్య గానం : బాలు, శైలజ
పల్లవి :
నేనెవరో అనామికనూ... నీ కథలో అభిసారికను
నేనెవరో అనామికనూ... నీ కథలో అభిసారికను
తలపులు తెలుపని కోరికను...
ఏ తళుకులు తెలియని తారకను
నేనెవరో అనామికనూ...
చరణం 1 :
బదులు దొరకని పొడుపు కథనై ఎదురు చూస్తున్నా
పెదవి కదపని పేద యెదనై ఎదుటనే ఉన్నా
చెలిమి చినుకే తొలకరిస్తే చిగురు తొడిగేను
మనసు తెలిసి పలకరిస్తే మంచు కరిగేను
నేనెవరో అనామికనూ
చరణం 2 :
దిశలు తెలిపే కలికి కెరటం పిలుపు వింటున్నా
నిశిని చెరిపే పసిడి కిరణం వెలుగు కంటున్నా
గుండెలోతున గూటి కోసం కదిలి వస్తున్నా
గువ్వ జాడకు మువ్వ నవ్వులు కానుక ఇమ్మన్నా
నేనెవరో అనామికను... నీ కథలో అభిసారికను
తీరము దొరికిన కోరికను...
నే ద్వారము తెరిచిన ద్వారకను....
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12506