Saturday, August 4, 2012

కొండలలో నెలకొన్న

చిత్రం: అల్లుడుగారు (1990)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: అనమయ్య/వేటూరి
నేపధ్య గానం: ఏసుదాస్

పల్లవి:

కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు

చరణం 1:

కుమ్మరదాసుడైన కురువరత్తినంబి
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
దొమ్ములు చేసినయెట్టి తొండమాన్ చక్కురవర్తి
దొమ్ములు చేసినయెట్టి తొండమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు

కొండలలో నెలకొన్న
గమదని సగమా గసని దమగస
కొండలలో సగసమ గదమని గమగద మనిదస నిసమగ దమగస
కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు

చరణం 2:

ఎదలోని శ్రీసతి ఎపుడో ఎడబాటు కాగా
ఎనలేని వేదనలో రగిలినవాడు
మనసిచ్చి పరిణయమాడిన సతి పద్మావతి
మమతల కోవెలలో మసలనివాడు
నీతికి నిలిచినవాడు దోషిగ మారెను నేడు
ప్రేమకే ప్రాణంవాడు శిక్షకు పాత్రుడుకాడు
ఆర్తరక్షక శ్రీవెంకటేశ్వరా కరుణతో...
తోడునీడై వాణ్ణి కాపాడు నేడు

కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయడువాడు..

No comments:

Post a Comment