Showing posts with label ఏసుదాస్. Show all posts
Showing posts with label ఏసుదాస్. Show all posts

Thursday, July 23, 2020

ఇదేలే తరతరాల చరితం

చిత్రం : పెద్దరికం (1992)
సంగీతం :  రాజ్-కోటి
గీతరచయిత : భువనచంద్ర
నేపథ్య గానం : ఏసుదాస్,  సుజాత


పల్లవి : 


ఇదేలే తరతరాల చరితం... జ్వలించే జీవితాల కథనం
ఇదేలే తరతరాల చరితం... జ్వలించే జీవితాల కథనం 


పగేమో ప్రాణమయ్యేనా... ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా... ఆశలే రాలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం... జ్వలించే జీవితాల కథనం



చరణం 1 :


ఒడిలో పెరిగిన చిన్నారినే ఎరగా చేసినదా ద్వేషము
కథ మారదా...  ఈ బలి ఆగదా 


మనిషే పశువుగా మారితే కసిగా శిశువుని కుమ్మితే
మనిషే పశువుగా మారితే కసిగా శిశువుని కుమ్మితే
అభమూ శుభమూ ఎరుగని వలపులు ఓడిపోయేనా 


ఇదేలే తరతరాల చరితం... జ్వలించే జీవితాల కథనం
పగేమో ప్రాణమయ్యేనా... ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా... ఆశలే రాలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం... జ్వలించే జీవితాల కథనం


చరణం 2 :


విరిసి విరియని పూదోటలో రగిలే మంటలు చల్లరవా
అర్పేదెలా... ఓదార్చేదెలా
నీరే నిప్పుగ మారితే వెలుగే చీకటి రువ్వితే
నీరే నిప్పుగ మారితే వెలుగే చీకటి రువ్వితే
పొగలో సెగలో మమతల పూవులు కాలిపోయేనా 



ఇదేలే తరతరాల చరితం... జ్వలించే జీవితాల కథనం
పగేమో ప్రాణమయ్యేనా... ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా... ఆశలే రాలిపోయేనా  


ఇదేలే తరతరాల చరితం... జ్వలించే జీవితాల కథనం


Wednesday, November 1, 2017

గాలి వానలో వాన నీటిలో

చిత్రం :   స్వయంవరం (1982)
సంగీతం :  సత్యం
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : ఏసుదాస్ 


పల్లవి :



గాలి వానలో...  వాన నీటిలో
గాలి వానలో వాన నీటిలో...  పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం ... తెలియదు పాపం



గాలి వానలో వాన నీటిలో...  పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం....  తెలియదు పాపం
ఒహోహో ఒహోహో ఒహోహో ఒహోహో
ఒఒఒ.... ఒఒఒ



చరణం 1 :



ఇటు హొరు గాలి అని తెలుసు

అటు వరద పొంగు అని తెలుసు

ఇటు హొరు గాలి అని తెలుసు

అటు వరద పొంగు అని తెలుసు

హొరు గాలిలో వరద పొంగులో... సాగలేలని తెలుసు


అది జోరు వాన అని తెలుసు

ఇవి నీటి సుడులని తెలుసు

అది జోరు వాన అని తెలుసు

ఇవి నీటి సుడులని తెలుసు

జోరు వానలో నీటి సుడులలో... మునక తప్పదని తెలుసు



అయినా పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం....  తెలియదు పాపం
ఒహోహో ఒహోహో ఒహోహో ఒహోహో




చరణం 2 :



ఇది ఆశ నిరాశల ఆరాటం

అది చీకటి వెలుగుల చెలాగటం

ఇది ఆశ నిరాశల ఆరాటం

అది చీకటి వెలుగుల చెలాగటం

ఆశ జారినా వెలుగు తొలిగినా... ఆగదు జీవిత పొరాటం


ఇది మనిషి మనసుల పోరాటం

అది ప్రేమ పెళ్ళి చెలగాటం

ఇది మనిషి మనసుల పోరాటం
అది ప్రేమ పెళ్ళి చెలగాటం
ప్రేమ శకలమై మనసు వికలమై... బ్రతుకుతున్నదొక శవం


అయినా పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం....  తెలియదు పాపం


గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయణం
తీరమెక్కడో గమ్యమేమిటో
తెలియదు పాపం....  తెలియదు పాపం
ఒహోహో ఒహోహో ఒహోహో ఒహోహో






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2109

Monday, August 29, 2016

జగముల నేతా

చిత్రం : అయ్యప్ప స్వామి (1975)
సంగీతం : జి.దేవరాజన్
గీతరచయిత :
నేపధ్య గానం : ఏసుదాస్ 




పల్లవి :




జగముల నేతా భాగ్య విధాతా.. శ్రీమన్నారాయణా
స్వామి నమ్మిన వారిని కృపగన రాదా.. శ్రీమన్నారాయణా



ఆ ఆ.. జగముల నేతా భాగ్య విధాతా.. శ్రీమన్నారాయణా
స్వామి నమ్మిన వారిని కృపగన రాదా.. శ్రీమన్నారాయణా 




చరణం 1 :




క్రూరులపైబడి కూల్తువుగాకా.. శ్రీమన్నారాయణా
ఇలను ఋషులను గాంచి దీవించరాగా.. శ్రీమన్నారాయణా
దుష్టుల శిక్షించు లోకవిజేతా..  శ్రీమన్నారాయణా
నీవు శిష్టుల రక్షించు పావనచరితా.. శ్రీమన్నారాయణా..



జగముల నేతా భాగ్య విధాతా.. శ్రీమన్నారాయణా
స్వామి నమ్మిన వారిని కృపగన రాదా.. శ్రీమన్నారాయణా 






చరణం 2 :




పురువిని మహిషి దుర్భర చరియలు కనలేవూ తండ్రీ
దాని దున్మగ మనిషిగ పుట్టితివయ్యా.. శ్రీమన్నారాయణా
జీవులే నీదు సృష్టి అనునది మరచితివో దేవా
ఆ దివ్య మునులను కాపాడుటకై వెడలేవో తండ్రీ.. 





జగముల నేతా భాగ్య విధాతా.. శ్రీమన్నారాయణా
స్వామి నమ్మిన వారిని కృపగన రాదా.. శ్రీమన్నారాయణా  





చరణం 3 : 





సృష్టి అంత నీ రక్షణ లేకా విధ్వన్సం కాదా
ఇల దుష్టుల కూర్చూ శిష్టుల బ్రోచూ జగదీశ్వర దేవా
అనంత శయనం మందున తేలుచు ఇనవో జగద్పితా..
ఘోరాపదలందున కుమిలే దీనుల కావము పరామత్మా.. 



జగముల నేతా భాగ్య విధాతా.. శ్రీమన్నారాయణా
స్వామి నమ్మిన వారిని కృపగన రాదా.. శ్రీమన్నారాయణా




చరణం 4 :




సకల మానవుల గళములే విజయ శంఖం పూరింతూ
హరిహరిహరి అని దిజ్వులు వేడగా పోరున విహరించు
రియతు కంపించ భూమి తలదించ విజయం సాధించూ
ఈ పలువుల క్రౌర్యం పుడమిన పాపం నేడే నశియించు
శ్రీమన్నారాయణా... శ్రీపతి జగన్నాధా...
వినవో జగద్పితా... దయగలవో పరమాత్మా..ఆ ఆ





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8390

Wednesday, April 13, 2016

నీవు నా పక్కనుంటే హాయి

చిత్రం : శివమెత్తిన సత్యం (1979)
సంగీతం : జె.వి. రాఘవులు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం :  ఏసుదాస్, వాణీ జయరాం



పల్లవి :


నీవు నా పక్కనుంటే హాయి
నీవు లేకుంటే చీకటి రేయి
నీ...కన్నులలోనా
ఎన్నో..ఎన్నో..ఎన్నో.. కిరణాలు మెరిశాయి


నీవు నా పక్కనుంటే హాయి
నీవు లేకుంటే చీకటి రేయి
నీ...కన్నులలోనా..
ఎన్నో..ఎన్నో..ఎన్నో..కిరణాలు మెరిశాయి


నీవు నా పక్కనుంటే హాయీ



చరణం 1 :


కొండలలో కోనలలో ఏకాంతవేళ
గుండెలలో రేగింది సరసాల లీల
కొండలలో కోనలలో ఏకాంతవేళ
గుండెలలో రేగింది సరసాల లీల


అనురాగ శిఖరాన అందాల తోట
అనురాగ శిఖరాన అందాల తోట


ఆ చోట కోనేట సయ్యటలాడాలీ..


నీవు నా పక్కనుంటే హాయి
నీవు లేకుంటే చీకటి రేయి
నీ...కన్నులలోనా..
ఎన్నో..ఎన్నో..ఎన్నో..కిరణాలు మెరిశాయి


నీవు నా పక్కనుంటే హాయీ




చరణం 2 :


కొనగోట మీటిన మాణిక్య వీణ
కొసరే మమతల తొలకరి వాన..ఆ..ఆ..
కొనగోట మీటిన మాణిక్య వీణ
కొసరే మమతల తొలకరి వాన


కన్ను సైగల కౌగిలింతల సన్నజాజి తావీ

ఎన్ని మారులు నిన్ను చూసినా దేవ రంభ ఠీవీ

మువ్వల రవళీ మోహన మురళీ..ఈ..
మువ్వల రవళీ మోహన మురళీ
మధురం మధురం మానస కేళీ..ఈ..ఈ..


నీవు నా పక్కనుంటే హాయి
నీవు లేకుంటే చీకటి రేయి
నీ...కన్నులలోనా..
ఎన్నో..ఎన్నో..ఎన్నో..కిరణాలు మెరిశాయి


నీవు నా పక్కనుంటే హాయీ





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4151

Tuesday, March 15, 2016

కురిసెను హృదయములో

చిత్రం : నేను నా దేశం (1974)
సంగీతం :  సత్యం
గీతరచయిత : అంకిశ్రీ
నేపధ్య గానం : ఏసుదాస్, సుశీల   




పల్లవి :


కురిసెను హృదయములో తేనె జల్లులు
విరిసెను నాలోనే ప్రేమ మల్లెలు...



కురిసెను కన్నులలో పూలవానలు
విరిసెను నాలోనే ప్రేమ మాలలు...



కురిసెను హృదయములో తేనె జల్లులు
విరిసెను నాలోనే ప్రేమ మాలలు...



చరణం 1 :


పగలే వెన్నెల మయము... ఈ జగమే నందన వనము
నా తలపులు పండే.. వలపులు నిండే.. మోజులే రేపే నాలో



మనసే ప్రేమాలయము... అతి సుందర బృందావనము
తొలి చూపుల నెలము.. కలిసెను మనము.. ఆశలు రేగే నాలో..


ఓ ప్రియా.. ఆ.. ఆ..ఆ.. 


కురిసెను హృదయములో తేనె జల్లులు
విరిసెను నాలోనే ప్రేమ మాలలు...



చరణం 2 :


పెదవులలో మధురిమలు.. నీ నడకలలో మగసిరులు
అనురాగములొలికే తీయని పలుకే... విందులు చేసె నాలో


కన్నులలో నయగారం... నీ నడకలలో వయ్యారం...
ఆ నగవుల సొగసే రమ్మని పిలిచే... తొందర చేసె నాలో


ఓ చెలి... ఈ.. ఈ.. ఈ..


కురిసెను కన్నులలో పూలవానలు 

విరిసెను నాలోనే ప్రేమ మల్లెలు...




Saturday, August 29, 2015

హరివరాసనం విశ్వమోహనం

చిత్రం : అయ్యప్ప స్వామి (1975)
సంగీతం : జి.దేవరాజన్
గీతరచయిత :
నేపధ్య గానం : ఏసుదాస్  




పల్లవి :




హరివరాసనం... విశ్వమోహనం
హరిదధీశ్వరం...  ఆరాధ్యపాదుకం
అరివిమర్ధనం...  నిత్య నర్తనం
హరిహరాత్మజం...  దేవమాశ్రయే



శరణమయ్యప్ప... స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప.... స్వామి శరణమయ్యప్ప




చరణం 1 :




శరణ కీర్తనం...  శక్తమానసం
భరణలోలుపం...  నర్తనాలసం
అరుణభాసురం...  భూతనాయకం
హరిహరాత్మజం...  దేవమాశ్రయే




శరణమయ్యప్ప... స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప.... స్వామి శరణమయ్యప్ప





చరణం 2 :



కళమృదుస్మితం...  సుందరాననం
కళభకోమళం...  గాత్రమోహనం
కళభకేసరి...  వాజివాహనం
హరిహరాత్మజం...  దేవమాశ్రయే


శరణమయ్యప్ప... స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప.... స్వామి శరణమయ్యప్ప




చరణం 3 :




శ్రితజనప్రియం...  చిందితప్రదం
శృతివిభూషణం...  సాధు జీవనం
శృతిమనోహరం...  గీతలాలసం
హరిహరాత్మజం...  దేవమాశ్రయే




శరణమయ్యప్ప...  స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప...  స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప...  స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప...  స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప...  స్వామి శరణమయ్యప్ప
శరణమయ్యప్ప...  స్వామి శరణమయ్యప్ప








http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8389

శబరిమలను స్వర్ణ చంద్రోదయం

చిత్రం : అయ్యప్ప స్వామి (1975)
సంగీతం : జి.దేవరాజన్
గీతరచయిత :
నేపధ్య గానం : ఏసుదాస్ 




పల్లవి :


శబరిమలను స్వర్ణ చంద్రోదయం
ధర్మ రక్షకుని సన్నిధిని అభిషేకం
లోకాల గారవించు అయ్యప్ప స్తోత్రం
భక్తితో పాడుకుంటాం హృదయములా


శబరిమలను స్వర్ణ చంద్రోదయం
ధర్మ రక్షకుని సన్నిధిని అభిషేకం
లోకాల గారవించు అయ్యప్ప స్తోత్రం
భక్తితో పాడుకుంటాం హృదయములా


శబరిమలను స్వర్ణ చంద్రోదయం 





చరణం 1 :




ప్రీతియే ఉల్లమున పాలవును.. అదే చల్లని నీ ఎదను పెరుగౌను
వెన్నయే నీవిత్తు అనురాగం..నీకు నెయ్యభిషేకమునే జరిపిస్తా


నీజాడలలో నడిచే జీవులమయ్యప్పా...
ఈ సర్వస్వం నీ ఆశీర్వాదం అయ్యప్పా...
అయ్యప్పా.. శరణమయ్యప్పా..
అయ్యప్పా.. శరణమయ్యపా..


శబరిమలను స్వర్ణ చంద్రోదయం 






చరణం 2 :




పుణ్యమిత్తే పన్నీరభిషేకం.. జనులు భక్తితో చేసెడి పాలభిషేకం
దివ్య పంచామృతాన అభిషేకం.. నీదు తనువంత జ్యోతివలె వెలిగేనూ



నీజాడలలో నడిచే జీవులమయ్యప్పా...
ఈ సర్వస్వం నీ ఆశీర్వాదం అయ్యప్పా...
అయ్యప్పా.. శరణమయ్యప్పా..
అయ్యప్పా.. శరణమయ్యపా..


శబరిమలను స్వర్ణ చంద్రోదయం






చరణం 3 : 




దోసిట పుణ్య జలం అందుకొని.. అదే నీ పేరు స్తుతియించి శిరసునుంచి
కరుగు విభూతితో అభిషేకం.. హరి యోమని చందనంతో అభిషేకం



నీ జాడలలో నడిచే జీవులమయ్యప్పా...
ఈ సర్వస్వం నీ ఆశీర్వాదం అయ్యప్పా...
అయ్యప్పా.. శరణమయ్యప్పా..
అయ్యప్పా.. శరణమయ్యపా..



శబరిమలను స్వర్ణ చంద్రోదయం
ధర్మ రక్షకుని సన్నిధిని అభిషేకం
లోకాల గారవించు అయ్యప్ప స్తోత్రం
భక్తితో పాడుకుంటాం హృదయములా



అయ్యప్పా.. శరణం అయ్యప్పా
అయ్యప్పా.. శరణం అయ్యప్పా
అయ్యప్పా.. శరణం అయ్యప్పా 





Saturday, June 28, 2014

ఎవ్వరిది ఈ పిలుపు

చిత్రం :  మానస వీణ (1983)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఏసుదాస్, సుశీల


పల్లవి:


ఎవ్వరిది.. ఈ పిలుపు
ఎక్కడిది.. ఈ వెలుగు
ఎవ్వరిది ఈ పిలుపు..
ఎక్కడిది ఈ వెలుగు..


నీవై వెలిగినది..ఈ.. నీలో పలికినది..ఈ..ఈ..
నీవై వెలిగినది..ఈ.. నీలో పలికినది..
పిలిచిన పిలుపెల్లా నాదలై.. ఆ మ్రోగిన
వి..

ఆ రాగాలై.. సాగినవి..
మానసవీణై వెలసినది..


ఎవ్వరిది ఈ వీణా.. ఎక్కడిది ఈ జాణా..
నాలోని.. నీ రూపమే..
ఆ..ఆ..నాలోని.. నీ భావమే...


ఎవ్వరిది ఈ పిలుపు..
ఎక్కడిది ఈ వెలుగు..
నీవై వెలిగినదీ..
నీలో పలికినది..


చరణం 1:


చుక్కల్నీ ఒలిచీ.. చక్కంగా మలిచి..
నీ కంఠహారాన్ని చేయించనా..ఆ..ఆ


సూర్యుణ్ణి అడిగి.. కిరణాలు తొడిగి..
నీ ముంగిటే ముగ్గు వేయించనా..ఆ..ఆ


ప్రాణాలు ఐదు.. నీలోనా ఖైదై.. ఆరోది నీవై జీవించనా
ప్రాణాలు ఐదు.. నీలోనా ఖైదై.. ఆరోది నీవై జీవించనా


ఎవ్వరిది.. ఈ వీణా..
ఆ.. ఎక్కడిది.. ఈ జాణా..
నాలోని నీ రూపమే..
ఆ.. ఆ.. నాలోని నీ భావమే..


చరణం 2:


తనువెల్లా మనసై.. మనసెల్లా కనులై..
నెలలన్నీ దినమల్లే గడిపేయనా..


నాకున్న రుచులు.. నీకున్నా కళలు..
కలబోసి ప్రతిరోజు విందివ్వవా..


నేనివ్వగలది..ఈ.. ఏ జన్మములది..
ఇక ముందు ఎంతో.. మిగిలున్నది..


ఎవ్వరిది ఈ వీణా..
ఎక్కడిది ఈ జాణా..
నాలోని నీ రూపమే..
ఆ..ఆ..నాలోని నీ భావమే..


ఎవ్వరిది ఈ పిలుపు..
ఎక్కడిది ఈ వెలుగు..
నీవై వెలిగినదీ..ఈ..
నీలో పలికినది..ఈ..
నీవై వెలిగినదీ..ఈ..
నీలో పలికినది..


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5092

Friday, April 11, 2014

సిగలో అవి విరులో

చిత్రం :  మేఘసందేశం (1982)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  ఏసుదాస్



పల్లవి:


సిగలో అవి విరులో... అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో... మసలే వలపు తొలకరులో


సిగలో అవి విరులో... అగరు పొగలో అత్తరులో..
మగువ సిగ్గు దొంతరలో.. మసలే వలపు తొలకరులో..
సిగలో అవి విరులో


చరణం 1:


ఎదుట నా ఎదుట ఏవో సోయగాల మాలికలు
ఎదుట నా ఎదుట ఏవో సోయగాల మాలికలు


మదిలోనా గదిలోనా..మదిలోనా గదిలోనా
మత్తిలిన కొత్త కోరికలు ..
నిలువనీవు నా తలపులు...
మరీ మరీ ప్రియా... ప్రియా..
నిలువనీవు నా తలపులు
నీ కనుల ఆ పిలుపులు....


సిగలో అవి విరులో.. అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో..
సిగలో అవి విరులో


చరణం 2:


జరిగి ఇటు ఒరిగి పరవశాన ఇటులే కరిగి
జరిగి ఇటు ఒరిగి పరవశాన ఇటులే కరిగి..
చిరునవ్వుల అరవిడిన ..చిగురాకు పెదవుల మరిగి
చిరునవ్వుల అరవిడిన ..చిగురాకు పెదవుల మరిగి


మరళి రాలేవు నా చూపులు...
మరీ మరీ ప్రియా.. ప్రియా..
మరళి రాలేవు నా చూపులు
మధువుకై మెదలు తుమ్మెదలు


సిగలో అవి విరులో.. అగరు పొగలో అత్తరులో..
మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో..
సిగలో అవి విరులో...


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1365

Sunday, March 16, 2014

చిన్ని చిన్ని కన్నయ్యా

చిత్రం :  భద్రకాళి (1976)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  ఏసుదాస్, సుశీల

పల్లవి:

చిన్ని చిన్ని కన్నయ్యా.. కన్నులలో నీవయ్యా
నిన్ను చూసి మురిసేనూ.. నేను మేను మరిచేను
ఎత్తుకుని ముద్దాడీ ..  ఉయ్యాలలూపేనూ
జోలపాట పాడేనూ..  లాలిపాట పాడేనూ

చరణం 1:

నీ ఒడిలో నిదురించీ .. తీయనీ కలగాంచీ
పొంగి పొంగి పోయానూ .. పుణ్యమెంతో చేశానూ
నీ ఒడిలో నిదురించీ .. తీయని కలగాంచీ
పొంగి పొంగీ పోయానూ .. పుణ్యమెంతో చేశానూ

ఏడేడు జన్మలకు నా తోడు నీవమ్మా
ఈనాటి ఈ బంధం ఏ నాడు విడదమ్మా
అమ్మ వలె రమ్మనగా .. పాప వలె చేరేవూ
నా చెంత నీవుంటే .. స్వర్గమే నాదౌనూ
గాయత్రి మంత్రమునూ .. జపించే భక్తుడనే
కోరుకున్న వరములనూ .. ఇవ్వకున్న వదలనులే

చరణం 2:

స్నానమాడి శుభవేళా .. కురులలో పువ్వులతో
దేవి వలే నీవొస్తే .. నా మనసు నిలువదులే
అందాల కన్నులకూ .. కాటుకను దిద్దేనూ
చెడు చూపు పడకుండా .. అదరు చుక్క పెట్టేనూ

చిన్ని చిన్ని కన్నయ్యా.. కన్నులలో నీవయ్యా
నిన్ను చూసి మురిసేనూ.. నేను మేను మరిచేను
ఎత్తుకుని ముద్దాడీ .. ఉయ్యాలలూపేనూ
జోలపాట పాడేనూ.. లాలిపాట పాడేనూ

జోలాలీ .. జోలాలీ .. జోలాలీ .. జోలాలీ ..జో జో జో...

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5311

Tuesday, January 28, 2014

నిండు చందమామా

చిత్రం : బంగారు తిమ్మరాజు (1964)
సంగీతం : కోదండపాణి
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : ఏసుదాస్

పల్లవి:

ఓ నిండు చందమామా … నిగనిగల భామా
ఒంటరిగ సాగలేవు కలసి మెలసి పోదామా
ఓ… ఓ.,…. ఓ,.. నిండు చందమామా

చరణం 1:

నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే
నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే
మేలుకొన్న స్వప్నంలోన ఏల ఇంత బిడియపడేవు
మేలుకొన్న స్వప్నంలోన ఏల ఇంత బిడియపడేవు
ఏలుకునే ప్రియుడను కానా లాలించగ సరసకు రానా
ఓఓఓఓఓ… ఓ నిండు చందమామా … నిగనిగల భామా
ఒంటరిగ సాగలేవు కలసి మెలసి పోదామా
ఓ… ఓ.,…. ఓ,.. నిండు చందమామా

చరణం 2:

దోరవయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగే
కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే
దోరవయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగే
కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే
నీదు మనసు నీలో లేదు నా లోనె లీనమయే
నీదు మనసు నీలో లేదు నా లోనె లీనమయే
నేటినుంచి మేనులు రెండూ నెరజాణా ఒకటాయే..
ఓఓఓఓఓ… ఓ నిండు చందమామా … నిగనిగల భామా
ఒంటరిగ సాగలేవు కలసి మెలసి పోదామా
ఓ… ఓ.,…. ఓ,.. నిండు చందమామా

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7021


Tuesday, August 6, 2013

వెన్నెలైనా చీకటైనా


చిత్రం: పచ్చని కాపురం (1985)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఏసుదాస్, జానకి


పల్లవి:

    ఆ..ఆ..ఆ..

    వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా
    నీతోనే జీవితము.. నీ ప్రేమే శాశ్వతము
    ఏ జన్మదో ఈ బంధము.. ఏ జన్మదో ఈ బంధము
    నింగి నేల సాక్ష్యాలు.. నింగి నేల సాక్ష్యాలు
    ప్రేమకు మనమే తీరాలు

    వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా
    నీతోనే జీవితము.. నీ ప్రేమే శాశ్వతము

చరణం 1:

    జ్ఞాపకమేదో.. నీడల్లె తారాడే.. స్వప్నాలేవో.. నీ కళ్ళ దోగాడే
    కౌగిలింతలోన గాలి ఆడకూడదు.. చుక్కలైన నిన్ను నన్ను చూడకూడదు
    నీ సర్వమూ.. నాదైనదీ..
    నేను దేహమల్లె.. నీవు ప్రాణమల్లె ఏకమైన రాసలీలలోనా..

    వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా

చరణం 2:

    అంతంలేనీ.. నీ రాగ బంధంలో.. అంచున నిలిచీ.. నీ వైపే చూస్తున్నా
    పున్నమింత కట్టుకున్న పూలడోలలు.. ఎన్నడింక చెప్పవమ్మ బాలసారలు
    ఆ ముద్దులే.. మూడైనవీ..
    బాలచంద్రుడొస్తే.. నూలుపోగులిస్తా.. ఇంటి దీపమయ్యేదింకా ప్రేమా

    వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా
    నీతోనే జీవితము.. నీ ప్రేమే శాశ్వతము
    ఏ జన్మదో ఈ బంధము.. ఏ జన్మదో ఈ బంధము
    నింగి నేల సాక్ష్యాలు.. నింగి నేల సాక్ష్యాలు
    ప్రేమకు మనమే తీరాలు..

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3793

Sunday, August 4, 2013

సుక్కల్లే తోచావే

చిత్రం: నిరీక్షణ (1981) 
సంగీతం: ఇళయరాజా 
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 
నేపధ్య గానం: ఏసుదాస్ 

పల్లవి: 

సుక్కల్లే తోచావే.. ఎన్నెల్లే కాచావే.. ఏడ బోయావే 
ఇన్ని ఏలసుక్కల్లో.. నిన్ను నే నెతికానే 
ఇన్ని ఏలసుక్కల్లో.. నిన్ను నే నెతికానే 

సుక్కల్లే తోచావే.. ఎన్నెల్లే కాచావే.. ఏడ బోయావే.. 

చరణం 1: 

పూసిందే ఆ పూలమాను నీ దీపంలో.. 
కాగిందే నా పేదగుండె నీ తాపంలో 
ఊగానే నీ పాటలో ఉయ్యాలై..ఈ.. 
ఉన్నానే ఈ నాటికి నేస్తాన్నై..ఐ.. 
ఉన్నా ఉన్నాదొక దూరం.. ఎన్నాళ్లకు చేరం.. తీరందీనేరం.. 

సుక్కల్లే తోచావే.. ఎన్నెల్లే కాచావే.. ఏడ బోయావే.. 

చరణం 2: 

తానాలే చేశాను నేను నీ స్నేహంలో 
ప్రాణాలే దాచావు నీవు నా మోహంలో 
ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే..ఏ.. 
ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే..ఏ 
ఉందా కనీళ్ళకు అర్థం.. ఇన్నేళ్ళుగా వ్యర్థం.. చట్టందే రాజ్యం.. 

సుక్కల్లే తోచావే.. ఎన్నెల్లే కాచావే.. ఏడ బోయావే 
ఇన్ని ఏలసుక్కల్లో.. నిన్ను నే నెతికానే 
ఇన్ని ఏలసుక్కల్లో.. నిన్ను నే నెతికానే 

సుక్కల్లే తోచావే.. ఎన్నెల్లే కాచావే.. ఏడ బోయావే..

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12039

Tuesday, July 30, 2013

తకధిమి తకధిమితోం దీనీ తస్సాదియ్యా

చిత్రం: ధర్మాత్ముడు (1983)
సంగీతం: సత్యం
గీతరచయిత: మైలవరపు గోపి
నేపధ్య గానం: ఏసుదాస్

పల్లవి:

తకధిమి తకధిమితోం దీనీ తస్సాదియ్యా
ఏ ఊరు ఏ వాడా చందమామా
ఈ గూడు చేరావే చందమామా
తకధిమి తకధిమితోం దీనీ తస్సాదియ్యా
ఏ ఊరు ఏ వాడా చందమామా
ఈ గూడు చేరావే చందమామా

చరణం 1:

రూపం చూస్తే దీపమని లోకం తెలియని పాపవని
ఎట్టా నీతో చెప్పేది చెప్పక ఎట్టా దాచేది
ఏమి చిత్రమే ఇదీ చందమామా
ఎంత చోద్యమే ఇదీ చందమామా
తకధిమి తకధిమితోం దీనీ తస్సాదియ్యా
ఏ ఊరు ఏ వాడా చందమామా
ఈ గూడు చేరావే చందమామా

చరణం 2:

చేరే తీరం ఏదైనా పయనించేదీ ఒక పడవ
ఎవరికి ఎవరో నిన్నటికి ఏమౌతామో రేపటికి
బదులు పలకవే నువ్వు చందమామా
పలకలేవులే నువ్వు చందమామా
తకధిమి తకధిమితో దీనీ తస్సాదియ్యా
ఏ ఊరు ఏ వాడా చందమామా
ఈ గూడు చేరావే చందమామా


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4190

Friday, July 26, 2013

ఆ పూలరంగు నీ చీర చెంగు

చిత్రం: దొంగ పోలీస్ (1992)
సంగీతం: బప్పిలహరి

గీతరచయిత: రసరాజు
నేపధ్య గానం: ఏసుదాస్, చిత్ర


పల్లవి:

ఆ పూలరంగు నీ చీర చెంగు.. రాశాయి నాలో గీతాలు ఏవో
నే పాడుకుంటానులే రాగాల లోగిళ్ళలో అనురాగాల వాకిళ్ళలో

ఓ తేనె దొంగ నా సామిరంగ ..పుట్టాను నీకై పూసాను పూవై
నీ వెంట ఉంటానులే .. నీ దాననౌతానులే .. మరి నీలోని గీతాన్నిలే...
సరి సరి గరిగపద...సరి సరి గరిగపద...

చరణం 1:

పుసుపుగ విరిసిన పూవులు.. తలపై కురిసెను పలికెను .. ఉండాలనీ పచ్చగా... హోయ్
ఎర్రగ విరిసిన పూవులు..ఎదపై కురిసెను పలికెను ఉండాలనీ ప్రేమతో...
ఆ రంగుతోటి ఈ రంగు కలిసే .. నీకాళ్ళపారాణిగా ..
నా కళ్ళలో రాణిగా... నా కళ్ళలో రాణిగా...

ఓ తేనె దొంగ నా సామిరంగ ..పుట్టాను నీకై ..పూసాను పూవై
నే పాడుకుంటానులే రాగాల లోగిళ్ళలో అనురాగాల వాకిళ్ళలో

చరణం 2:

కలిసిన కనులకే తెలియును ..వలపుల మలుపుల సొగసులు..ఏ ప్రేమబంధాలివో.
నడిచిన అడుగులే కలుపును..మనుసును మనసును ఒకటిగాఏరాగబంధాలివో...హోయ్
ఆ బంధమేదో అనుబంధమేదో పాడాలి భూపాలమై...
అందానికే మూలమై .. అందానికే మూలమై

ఆ పూలరంగు నీ చీర చెంగు రాశాయి నాలో గీతాలు ఏవో
నే పాడుకుంటానులేహోయ్రాగాల లోగిళ్లలో అనురాగాల వాకిళ్ళలో

నేపధ్య గానం: ఏసుదాస్, చిత్ర

పల్లవి:

ఆ పూలరంగు నీ చీర చెంగు.. రాశాయి నాలో గీతాలు ఏవో
నే పాడుకుంటానులే రాగాల లోగిళ్ళలో అనురాగాల వాకిళ్ళలో

ఓ తేనె దొంగ నా సామిరంగ ..పుట్టాను నీకై పూసాను పూవై
నీ వెంట ఉంటానులే .. నీ దాననౌతానులే .. మరి నీలోని గీతాన్నిలే...
సరి సరి గరిగపద...సరి సరి గరిగపద...

చరణం 1:

పుసుపుగ విరిసిన పూవులు.. తలపై కురిసెను పలికెను .. ఉండాలనీ పచ్చగా... హోయ్
ఎర్రగ విరిసిన పూవులు..ఎదపై కురిసెను పలికెను ఉండాలనీ ప్రేమతో...
ఆ రంగుతోటి ఈ రంగు కలిసే .. నీకాళ్ళపారాణిగా ..
నా కళ్ళలో రాణిగా... నా కళ్ళలో రాణిగా...

ఓ తేనె దొంగ నా సామిరంగ ..పుట్టాను నీకై ..పూసాను పూవై
నే పాడుకుంటానులే రాగాల లోగిళ్ళలో అనురాగాల వాకిళ్ళలో

చరణం 2:

కలిసిన కనులకే తెలియును ..వలపుల మలుపుల సొగసులు..ఏ ప్రేమబంధాలివో.
నడిచిన అడుగులే కలుపును..మనుసును మనసును ఒకటిగాఏరాగబంధాలివో...హోయ్
ఆ బంధమేదో అనుబంధమేదో పాడాలి భూపాలమై...
అందానికే మూలమై .. అందానికే మూలమై

ఆ పూలరంగు నీ చీర చెంగు రాశాయి నాలో గీతాలు ఏవో
నే పాడుకుంటానులేహోయ్రాగాల లోగిళ్లలో అనురాగాల వాకిళ్ళలో

Thursday, July 25, 2013

ఊఁ అన్నా.. ఆఁ అన్నా

చిత్రం: దారి తప్పిన మనిషి (1981)
సంగీతం: విజయభాస్కర్
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: ఏసుదాస్, సుశీల

పల్లవి:

ఊఁ అన్నా.. ఆఁ అన్నా.. ఉలికి ఉలికి పడతావెందుకు
ఊఁ అన్నా.. ఆఁ అన్నా.. ఉలికి ఉలికి పడతావెందుకు
అన్నన్నా ఎంత మాట మనసు దాచి రాగాలెందుకు

చరణం 1:

ఉన్న తలపు వలపైనప్పుడు ..కన్నె మనసు ఏమంటుంది
చిలిపి చిలిపి కులుకుల కన్నుల నిలిపి తోడు రమ్మంటుంది
కోరికలన్నీ కోయిలలైతే.. కొత్త ఋతువు ఏమంటుంది
వయసంతా వసంతమై వలపు వీణ ఝుమ్మంటుంది
పిలుపో.. తొలి వలపో.. మరుపో.. మైమరుపో

ఊఁ అన్నా.. ఆఁ అన్నా.. ఉలికి ఉలికి పడతావెందుకు
అన్నన్నా ఎంత మాట మనసు దాచి రాగాలెందుకు

చరణం 2:

ఉన్న కనులు రెండే అయినా.. కన్నకలలకు అంతే లేదు
కన్న కలలు ఎన్నైనా.. ఉన్న నిజము మారిపోదు
కోరిన వారు కొంగు ముడేస్తే.. కలలు పండి నిజమౌతాయి
కల అయినా.. నిజమైనా.. కలదు కదా కథ తరువాయి
కలయో.. ఇది నిజమో.. కథయో.. వైష్ణవమాయో

ఊఁ అన్నా.. ఆఁ అన్నా.. ఉలికి ఉలికి పడతావెందుకు
అన్నన్నా ఎంత మాట మనసు దాచి రాగాలెందుకు

చరణం 3:

నిదురించిన తూరుపులో నీవేలే పొద్దుపొడుపు
నిను కోరిన నా తలపులలో నీకేలే ముద్దుల ముడుపు
అన్నా.. నేవిన్నా.. ఔనన్నా.. కాదన్నా
అవునంటే నీతో ఉన్నా... కాదన్నా నీలో ఉన్నా

ఊఁ అన్నా.. ఆఁ అన్నా.. ఉలికి ఉలికి పడతావెందుకు
అన్నన్నా ఎంత మాట మనసు దోచి రాగాలెందుకు

ఆహాహాహహా...  ఆహాహాహహా


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8017

Tuesday, July 23, 2013

అభినందన మందార మాల



చిత్రం : తాండ్ర పాపారాయుడు (1986)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : సినారె

నేపథ్య గానం : ఏసుదాస్, సుశీల





పల్లవి :



అభినందన మందార మాల..

అభినందన మందార మాల..

అభినందన మందార మాల.. 

అధినాయక స్వాగత వేళ..ఆ..

అభినందన మందార మాల..


స్త్రీజాతికీ.. ఏనాటికీ.. స్మరణీయ మహనీయ వీరాగ్రణికి..

అభినందన మందారమాల.. అధినాయక స్వాగత వేళ..ఆ..





చరణం 1 :





వేయి వేణువులు నిన్నే పిలువగ.. నీ పిలుపు నావైపు పయనించెనా

వేయి వేణువులు నిన్నే పిలువగ.. నీ పిలుపు నావైపు పయనించెనా



వెన్నెల కన్నెలు నిన్నే చూడగ..

వెన్నెల కన్నెలు నిన్నే చూడగ.. నీ చూపు నారూపు వరియించెనా

నీ చూపు నారూపు వరియించెనా..



నా గుండె పై నీవుండగా.. దివి తానే భువిపైనే దిగివచ్చెనా

అభినందన మందారమాల.. అలివేణి స్వాగత వేళ..ఆ..

అభినందన మందారమాల..



సౌందర్యమూ సౌశీల్యమూ.. నిలువెల్ల నెలకొన్న కలభాషిణికి

అభినందన మందారమాల..





చరణం 2 :





వెండి కొండపై వెలసిన దేవర.. నెలవంక మెరిసింది నీ కరుణలో

వెండి కొండపై వెలసిన దేవర.. నెలవంక మెరిసింది నీ కరుణలో



సగము మేనిలో ఒదిగిన దేవత..

సగము మేనిలో ఒదిగిన దేవత.. నునుసిగ్గు తొణికింది నీ తనువులో

నునుసిగ్గు తొణికింది నీ తనువులో..



ప్రియ భావమే లయ రూపమై.. అలలెత్తి ఆడింది అణువణువులో



అభినందన మందారమాల.. 

ఉభయాత్మల సంగమవేళ..ఆ..

అభినందన మందారమాల..









https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4194

Tuesday, July 16, 2013

ఎవరమ్మా ఈ కొమ్మా

చిత్రం: జే గంటలు (1981) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీతరచయిత: వేటూరి 
నేపధ్య గానం: ఏసుదాస్, వాణీ జయరాం 

పల్లవి: 

ఆ....ఆ....ఆ ఆ ఆ.....ఆ 

ఎవరమ్మా ఎవరమ్మా...ఈ కొమ్మా... 
ఎవరమ్మా ఎవరమ్మా...ఈ కొమ్మా... 
కులుకులమ్మ కన్న కూతురా... మెరుపులమ్మ మేనకోడలా.. 
కులుకులమ్మ కన్న కూతురా... మెరుపులమ్మ మేనకోడలా.. 
ఎవరమ్మా... ఎవరమ్మా...ఈ కొమ్మా 

ఆ ఆ ఆ...ఆ ....ఆ.....ఆ.....ఆ 

చరణం 1: 

కొనగోటను గోరింటలు పేరంటాలడగా.. 
చెక్కిలిలో చేమంతులు సీమంతాలడగా... 
ఊఁ....మూ....మూ...మూ....ఆహహా 
కొనగోటను గోరింటలు పేరంటాలడగా.. 
చెక్కిలిలో చేమంతులు సీమంతాలడగా... 

స్వాతివాన చినుకై ముత్యాలనవ్వు మొలకై... 
స్వాతివాన చినుకై ముత్యాలనవ్వు మొలకై 
మురిసే ముద్దులగుమ్మా ఎవరమ్మా 
కులుకులమ్మ కన్న కూతురా... మెరుపులమ్మ మేనకోడలా.. 

ఎవరమ్మా ఎవరమ్మా...ఈ కొమ్మా... 

చరణం 2: 

లలలలలలలలల..లలలలలలలలలా... 
లలలలలలలలల..లలలలలలలలలా...ఆ...ఆ...ఆ.... 

కొన సిగ్గులు చెలిబుగ్గల తొలిముగ్గులు తీర్చగా... 
అరకన్నుల సిరివెన్నెల మదికిన్నెర మీటగా... 
ఓ..ఓ..ఓ..ఓహో... 
కొన సిగ్గులు చెలిబుగ్గల తొలిముగ్గులు తీర్చగా 
అరకన్నుల సిరివెన్నెల మదికిన్నెర మీటగా... 

సందెగాలి తరగై చందమామ తునకై ... 
సందెగాలి తరగై చందమామ తునకై ... 
విరిసే పున్నమిరెమ్మ ఎవరమ్మా.... 

ఎవరమ్మా ఎవరమ్మా...ఈ కొమ్మా... 
ఎవరమ్మా ఎవరమ్మా...ఈ కొమ్మా... 
ఆ....ఆ....ఆ ఆ ఆ.....ఆ అ ఆ... ఆ అ ఆ...

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7532

Tuesday, December 4, 2012

మోమున బొట్టెట్టి

చిత్రం: కుంకుమ తిలకం (1983)
సంగీతం: సత్యం
గీతరచయిత: మైలవరపు గోపి
నేపధ్య గానం: ఏసుదాస్, సుశీల

పల్లవి:

మోమున బొట్టెట్టి నీ బుగ్గన చుక్కెట్టి
బొమ్మల నడుమ ముద్దుల గుమ్మా.. కుదిరింది శుభలగ్నము
నేడే కళ్యాణ వైభోగమూ...

మోమున బొట్టెట్టి నీ బుగ్గన చుక్కెట్టి
ఈ బొమ్మకి నచ్చిన మన్మధుడమ్మ.. కుదిరింది శుభలగ్నము
నేడే కళ్యాణ వైభోగమూ...

పాపపపపమ గమదనిప ఆ ఆ ఆ ...
సాససస సనిసమగమస ఆ ఆ ఆ ...
పనిసనిపా.. ఆ... గపమగస.. ఆ... పమగమప సా పా

చరణం 1:

తానం తననం.. తననననం.. తానం తననం.. తననననం
తననన తననన తననన తననన.. తననననం.. తననననం.. తననం

మమతలు కూర్చి మాలికలల్లిన సమయం.. సమయం
ఆ కూర్చిన మాలలు మనసులు కలిపిన తరుణం.. తరుణం
మమతలు కూర్చి మాలికలల్లిన సమయం.. సమయం
ఆ కూర్చిన మాలలు మనసులు కలిపిన తరుణం.. తరుణం

ఆ గగనం పందిరట.. ఈ భువనం వేదికట
బొమ్మల నడుమ ముద్దుల గుమ్మా కుదిరింది శుభలగ్నము
నేడే కళ్యాణ వైభోగమూ...

మోమున బొట్టెట్టి నీ బుగ్గన చుక్కెట్టి
ఈ బొమ్మకి నచ్చిన మన్మధుడమ్మ
కుదిరింది శుభలగ్నము... నేడే కళ్యాణ వైభోగమూ

చరణం 2:

ఆ ఆ ఆ... ఆ ఆ ఆ...
నినిపప పమప నినిపప పమప ససని ససని పమ గమపనిపా
గమపనిసనిసగ మదపగమపగమ రిగమపామగమ రిపమగ రిగసా

తానం తననం.. తననననం.. తానం తననం.. తననననం
తననన తననన తననన తననన.. తననననం.. తననననం.. తననం

మన కలయికలో కొత్తగ తోచెను ఉదయం.. ఉదయం
పురి విప్పిన నెమలిగ నాట్యం చేసెను హృదయం.. హృదయం
మన కలయికలో కొత్తగ తోచెను ఉదయం.. ఉదయం
పురి విప్పిన నెమలిగ నాట్యం చేసెను హృదయం.. హృదయం

నీ కట్నం అనురాగం... నీ కానుక ఆనందం
ఈ బొమ్మకి నచ్చిన మన్మధుడమ్మ.. కుదిరింది శుభలగ్నము
నేడే కళ్యాణ వైభోగమూ....

మోమున బొట్టెట్టి నీ బుగ్గన చుక్కెట్టి
బొమ్మల నడుమ ముద్దుల గుమ్మా.. కుదిరింది శుభలగ్నము
నేడే కళ్యాణ వైభోగమూ...





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5462

ఆలనగా పాలనగా (female)

చిత్రం: కుంకుమ తిలకం (1983)
సంగీతం: సత్యం
గీతరచయిత: మైలవరపు గోపి
నేపధ్య గానం: ఏసుదాస్, సుశీల

పల్లవి:

ఆలనగా పాలనగా అలసిన గుండెకు ఆలంబనగా
లాలించు నీ దానిగా.. స్వామీ.. పాలించు నీ దాసిగా

ఆలనగా పాలనగా అలసిన గుండెకు ఆలంబనగా
లాలించు నీ దానిగా.. స్వామీ.. పాలించు నీ దాసిగా

చరణం 1:

పున్నమి కోరే రేయిని నేను.. పూజకు వేచిన పువ్వును నేను
ఆ.. ఆ ఆ ఆ ఆ ఆ ....
పున్నమి కోరే రేయిని నేను.. పూజకు వేచిన పువ్వును నేను

నిన్నటి దాకా.. నాలో నేను.. ఈ నిమిషానా.. నీతో నేను
లాలించు నీ దానిగా.. స్వామీ పాలించు నీ దాసిగా

చరణం 2:

నీ హృదయం ఒక సాగరమైతే.. బిందువునైనా చాలును నేను
ఆ.. ఆ ఆ ఆ ఆ ఆ .....

నీ హృదయం ఒక సాగరమైతే.. బిందువునైనా చాలును నేను
నీ ఒడిలో పసిపాపను కానా.. నీ పాదాల రేణువు కానా
లాలించు నీ దానిగా.. స్వామీ.. పాలించు నీ దాసిగా

ఆలనగా పాలనగా అలసిన గుండెకు ఆలంబనగా
ఆహాహ హా ఆహహా ఆ ఆ ఆ ఆ ......