Monday, August 27, 2012

ఓ పోయే పోయే చినదాన

చిత్రం: ఉయ్యాల - జంపాల (1965) 
సంగీతం: పెండ్యాల 
గీతరచయిత: ఆరుద్ర 
నేపధ్య గానం: ఘంటసాల 

పల్లవి: 

ఓ పోయే పోయే చినదాన... నీ తీయని మనసునాదేనా... 

ఓ పోయే పోయే చినదాన నీ తీయని మనసు నాదేనా 
కలలో పూచిన కమ్మని ప్రేమ కాయా పండా నెరజాణా 

చరణం 1: 

ఘుమ ఘుమ పూవులు జడలోన గుసగుసలాడెను చెవిలోన 
ఘుమ ఘుమ పూవులు జడలోన గుసగుసలాడెను చెవిలోన 
అదియేమో తెలుసుకొని అలుగుట తగునా నాపైన 

ఓ పోయే పోయే చినదాన నీ తీయని మనసు నాదేనా 
కలలో పూచిన కమ్మని ప్రేమ కాయా పండా నెరజాణా 

చరణం 2: 

కులుకులు తళుకులు నీలోన జిలిబిలి సరసములాడేనా 
కులుకులు తళుకులు నీలోన జిలిబిలి సరసములాడేనా 
ఒయ్యారి సయ్యాట ఒంటిగ అడుగ సరియవునా 

ఓ పోయే పోయే చినదాన నీ తీయని మనసు నాదేనా 
కలలో పూచిన కమ్మని ప్రేమ కాయా పండా నెరజాణా 

చరణం 3: 

సొగసుల మోమును ముడుచుకుని చురచుర చూడకె వగలాడి 
సొగసుల మోమును ముడుచుకుని చురచుర చూడకె వగలాడి 
ఇతగాడే జతగాడు ఇద్దరమొకటే యెపుడైనా 

ఓ పోయే పోయే చినదాన నీ తీయని మనసు నాదేనా 
కలలో పూచిన కమ్మని ప్రేమ కాయా పండా నెరజాణా

No comments:

Post a Comment