Sunday, August 26, 2012

అందాల రాముడు ఇందీవర శ్యాముడు

చిత్రం: ఉయ్యాల - జంపాల (1965) 
సంగీతం: పెండ్యాల 
గీతరచయిత: ఆరుద్ర 
నేపధ్య గానం: లీల 

పల్లవి: 

అందాల రాముడు ఇందీవర శ్యాముడు 
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు 

అందాల రాముడు ఇందీవర శ్యాముడు 
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు 
ఎందువలన దేవుడు 

చరణం 1: 

తండ్రి మాటకై పదవుల త్యాగమే జేసెను...ఊ..ఊ.. 
తండ్రి మాటకై పదవుల త్యాగమే జేసెను 
తన తమ్ముని బాగుకై తాను బాధ పొందెను 
అందాల రాముడు అందువలన దేవుడు... 

అందాల రాముడు ఇందీవర శ్యాముడు 
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు 

చరణం 2: 

అనుభవించదగిన వయసు అడవిపాలు జేసెను..ఊ...ఊ.. 
అనుభవించదగిన వయసు అడవిపాలు జేసెను 
అడుగు పెట్టినంత మేర ఆర్యభూమి జేసెను.. 
అందాల రాముడు అందువలన దేవుడు ... 

అందాల రాముడు ఇందీవర శ్యాముడు 
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు 

చరణం 3: 

ధర్మపత్ని చెర బాపగ దనుజుని దునుమాడెను...ఊ..ఊ.. 
ధర్మపత్ని చెర బాపగ దనుజుని దునుమాడెను 
ధర్మము కాపాడుటకాసతినే విడనాడెను... 
అందాల రాముడు అందువలన దేవుడు 

అందాల రాముడు... ఇందీవర శ్యాముడు 
అందాల రాముడు... ఇందీవర శ్యాముడు 
ఇనకులాబ్ది సోముడు... ఇలలో మన దేవుడు 
ఇనకులాబ్ది సోముడు... ఇలలో మన దేవుడు 
అందాల రాముడు... ఇందీవర శ్యాముడు 
అందాల రాముడు... ఇందీవర శ్యాముడు 
అందాల రాముడు... అందాల రాముడు 
ఇందీవర శ్యాముడు... ఇందీవర శ్యాముడు 
అందాల రాముడు... ఇందీవర శ్యాముడు 
ఇనకులాబ్ది సోముడు... ఇలలో మన దేవుడు 
అందాల రాముడు... ఇందీవర శ్యాముడు 
ఇనకులాబ్ది సోముడు... ఇలలో మన దేవుడు

3 comments:

  1. లీల గారు పాడిన పాట ఇది. సుశీల గారు కాదనిపిస్తుంది. వీలయితే సవరించండి.

    ReplyDelete
  2. ఇనకులాబ్ధిసోముడు...అంటే సూర్యవంశమనే సముద్రంలో ఉదయించిన చంద్రుడు.. ఓహ్ ఏమీ పదప్రయోగం..!!!
    అద్భుతం.. ఆరుద్రకి చంద్రుడు అలంకారమే కదా..
    బొడ్డుపల్లి కాళిదాసు

    ReplyDelete