Saturday, August 4, 2012

మధువనిలో రాధికవో

చిత్రం: అల్లరి బావ (1980)
సంగీతం: రాజన్-నాగేంద్ర
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:

మధువనిలో రాధికవో..మధువొలికే గీతికవో
మధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనం
మనోహరం .. మనోహరం

మధువనిలో రాధికనూ..మది పలికే గీతికనూ
మధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనం
మనోహరం .. మనోహరం

మధువనిలో రాధికవో..మధువొలికే గీతికవో

చరణం 1:

కార్తీకాన కళలే చిలికి వెలిగే జాబిలీ..
ఎదలో మల్లెల పొదలో వెలిగెను నేడీ జాబిలీ..
నీలాకాశ వీధుల్లోన వెలిగే సూర్యుడూ..
వెతలే మాసిన కధలో వెలిగెను నేడీ సూర్యుడూ..

తొలి తొలీ వలపులే..
తొలకరీ మెరుపులై..
విరిసే వేళలో..హేలలో..డోలలో..

మధువనిలో రాధికనూ..మది పలికే గీతికనూ
మధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనం
మనోహరం .. మనోహరం

మధువనిలో రాధికవో..మధువొలికే గీతికవో

చరణం 2:

బృందావనికి మురళీధరుడు ఒకడే కృష్ణుడూ..
ఎదిగిన బాలిక ఎద గల గోపికకతడే దేవుడూ..
మధురాపురికి యమునా నదికి ఒకటే రాధికా..
మరువైపోయిన మనసున వెలసెను నేడీ దేవతా..

వెలుగులా వీణలే..పలికెనూ జాణలో..
అదియే రాగమో..భావమో..బంధమో..

మధువనిలో రాధికనూ..మది పలికే గీతికనూ
మధురం ఈ జీవనం .. మధురం ఈ జవ్వనం
మనోహరం .. మనోహరం

మధువనిలో రాధికవో..మధువొలికే గీతికవో

No comments:

Post a Comment