Friday, August 3, 2012

రంగులలో కలవో

చిత్రం: అభినందన (1988)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం: బాలు, జానకి

పల్లవి :

రంగులలో కలవో యద పొంగులలో కళవో
రంగులలో కలవో యద పొంగులలో కళవో
నవశిల్పానివో రతిరూపానివో తొలి ఊహల ఊయలవో
రంగులలో కలవో యద పొంగులలో కళవో


చరణం 1 :

కాశ్మీర నందన సుందరివో.. కాశ్మీర నందన సుందరివో
కైలాస మందిర లాస్యానివో
ఆమని పూచే యామినివో.. ఆమని పూచే యామినివో
మరుని బాణమో.. మధుమాస గానమో
నవ పరిమళాల పారిజాత సుమమో


రంగులలో కలనై.. యద పొంగులలో కళనై
నవశిల్పాంగినై రతిరూపాంగినై నీ ఊహల ఊగించనా
రంగులలో కలనై


చరణం 2 :


ముంతాజు అందాల అద్దానివో.. ముంతాజు అందాల అద్దానివో
షాజాను అనురాగ సౌధానివో
లైలా కన్నుల ప్రేయసివో.. లైలా కన్నుల ప్రేయసివో
ప్రణయ దీపమో నా విరహ తాపమో
నా చిత్రకళా చిత్ర చైత్ర రథమో



రంగులలో కలనై యద పొంగులలో కళనై
నవశిల్పాంగినై రతిరూపాంగినై నీ ఊహల ఊగించనా
రంగులలో కలనై యద పొంగులలో కళనై





https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12413

No comments:

Post a Comment