Thursday, August 9, 2012

మిడిసిపడే దీపాలివి




చిత్రం: ఆస్తులు-అంతస్తులు (1987) 

సంగీతం: ఇళయరాజా 

గీతరచయిత: వేటూరి 

నేపధ్య గానం: ఏసుదాస్ 


పల్లవి: 


మిడిసిపడే దీపాలివి... మిన్నెగసి పడే కెరటాలివి 

మిడిసిపడే దీపాలివి... మిన్నెగిసి పడే కెరటాలివి 


వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు 

వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు 


ఈ జీవితమే ఒక గమ్యం లేని నావ 

సుఖదుఃఖాలే ఏకమైన రేవులో..ఓ.. 


మిడిసి పడే దీపాలివి.. మిన్నెగిసి పడే కెరటాలివి 

వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు 

వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు.. 


చరణం 1: 


బావి లోతు ఇంతని తెలుసు.. నదుల లోతు కొంతే తెలుసు 

ఆడగుండె లోతు ఎంతో లోకంలో ఎవరికి తెలుసు 


ఏ నిముషం ప్రేమిస్తుందో ఏ నిముషం పగబడుతుందో 

ఎప్పుడెలా మారుతుందో తెలిసిన మగవాడు లేడు 

రాగం.. అనురాగం.. ఎర వేసి జత చేరి.. కన్నీట ముంచుతుందిరా 



మిడిసిపడే దీపాలివి... మిన్నెగిసి పడే కెరటాలివి 

వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు 

వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు.. 




చరణం 2 : 


పాము విషం సోకినవాడు ఆయువుంటె బతికేస్తాడు 

కన్నె వలపు కరిచిన వాడు నూరేళ్ళకి తేరుకోడు 


సొగసు చూసి మనసిచ్చావా...  బందీగా నిలబడతావు 

నీ కలలే విరిగిననాడూ...  కలతే నీ తోడవుతుంది 

లేదు.. ఏ సౌఖ్యం.. రవ్వంత సంతోషం.. ఈ ఆడదాని ప్రేమలో 




మిడిసిపడే దీపాలివి...  మిన్నెగిసి పడే కెరటాలివి 

వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు 

వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు.. 


ఈ జీవితమే ఒక గమ్యం లేని నావ 

సుఖదుఃఖాలే ఏకమైన రేవులో..ఓ.. 


మిడిసిపడే దీపాలివి.. మిన్నెగిసి పడే కెరటాలివి 

వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు 

వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు..






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5102

No comments:

Post a Comment