Monday, August 27, 2012

మంచిని మరచీ

చిత్రం: ఒకే కుటుంబం (1970) 
సంగీతం: కోదండపాణి 
గీతరచయిత: దాశరథి 
నేపధ్య గానం: ఘంటసాల 

పల్లవి: 

మంచిని మరచీ.. వంచన నేర్చీ 
మంచిని మరచీ.. వంచన నేర్చీ 
నరుడే ఈనాడూ వానరుడైనాడూ... వానరుడైనాడూ..... 

మంచిని మరచీ.. వంచన నేర్చీ 
నరుడే ఈనాడూ వానరుడైనాడూ... వానరుడైనాడూ 

చరణం 1: 

చదువు తెలివి పెంచాడూ.. చంద్రలోకం జయించాడూ 
చదువు తెలివి పెంచాడూ.. చంద్రలోకం జయించాడూ 
నీతులు చెప్పి గోతులు తవ్వి... పాతాళానికి జారాడూ 
మెదడే పెరిగి హృదయం తరిగి... నరుడే ఈనాడూ వానరుడైనాడూ... 
వానరుడైనాడూ...ఓ..ఓ...ఓ.. 

చరణం 2: 

అందరి చెమటా చిందించాడూ.. సంపద ఎంతో పెంచాడూ 
అందరి చెమటా చిందించాడూ.. సంపద ఎంతో పెంచాడూ 
పంపకమంటూ వచ్చేసరికి... అంతా తనదే అన్నాడూ 
ధనమే హెచ్చి.. గుణమే చచ్చి... నరుడే ఈనాడూ వానరుడైనాడూ 
వానరుడైనాడూ ..

No comments:

Post a Comment